తెలంగాణ
Ganesh Immersion: వీడియో ఇదిగో.. వినాయక నిమజ్జనంలో పాములతో చెలగాటం, అదుపులోకి తీసుకున్న పోలీసులు, తార్నాకలో ఘటన
Arun Charagondaవినాయక నిమజ్జనంలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. తార్నక వినాయక నిమజ్జనంలో పాములతో చెలగాటం ఆడారు కొంతమంది. దీంతో పాములతో ఆడుతున్న వేషధారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Free Heart Surgeries at NIMS: హైదరాబాద్ నిమ్స్ లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు.. ఈ నెల 22 నుంచి 28 వరకు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraగుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ లోని నిమ్స్ లో ఉచిత శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్ లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
Case Filed Against MLA Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు.. కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన గచ్చిబౌలి పోలీసులు
Rudraశేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అరెకపూడి గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ ను కూడా నిందితులుగా పేర్కొంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
UIDAI Extends Free Online Aadhaar Update: ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు మళ్లీ పొడిగింపు.. డిసెంబర్ 14 వరకూ అవకాశం
Rudraపదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకోవడానికి శనివారం ఆఖరు తేదీ కావడంతో ఈ గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు ఉడాయ్ ప్రకటించింది.
Symbol Of Communal Harmony: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. కేపీహెచ్‌బీలో వినాయకుడి నిమజ్జనంలో కలిసి డాన్సు స్టెప్స్ వేసిన హిందూ-ముస్లిం సోదరులు.. వీడియో వైరల్
Rudraమత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ మరోసారి నిలిచింది. నగరంలోని కేపీహెచ్‌బీలో ఓ వినాయకుడి నిమజ్జనం వేడుకలో కలిసి పాల్గొన్న హిందూ-ముస్లిం సోదరులు ఎంతో సంబురంగా డ్యాన్సు స్టెప్స్ వేసి.. గణనాథుడికి భక్తితో వీడ్కోలు పలికారు.
Ganesh Immersion: 17న గణేశ్ నిమజ్జనం.. ఈ జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అలా చూస్తే, మొత్తంగా నాలుగు రోజులు హాలీడే..
Rudraతెలంగాణలో గణేశ్ నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన వినాయక చవితి ఉత్సవాలు 17న నిమజ్జనం వేడుకలతో ముగియనున్నాయి.
Sankranti Trains Full: దసరా కూడా రాకుండానే సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్.. కేవలం ఐదు నిమిషాల్లోనే బెర్త్ లు ఫుల్
Rudraతెలుగువారికి ముఖ్యంగా ఆంధ్రులకు పెద్దపండుగగా పిలిచే సంక్రాంతి ఎంత ప్రముఖమైందో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ ఉన్నా సొంతూళ్ళకు చేరాల్సిందే.
Wine Shops Close For 2 Days: రెండు రోజుల పాటూ వైన్ షాపులు బంద్, ఈ ప్రాంతాల్లో బార్లు, వైన్స్, మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా
VNSగణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ (Cyberabad Police) పరిధిలో మద్యం షాపులు (Wine Shops Close), కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Petition on Hydra: హైడ్రాపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ! హైకోర్టులో పిటీషన్ దాఖలు, హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
VNSఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
Traffic Restrictions in Cyberabad: సైబరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, సైబర్స్ టవర్స్ నుంచి వెళ్లే వారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
VNSఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ నుంచి యశోద హాస్పిటల్ వరకు కొత్తగా సర్వీసు రోడ్డు నిర్మిస్తుండడంతో.. 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Astrologer Venuswamy: వేణుస్వామికి షాకిచ్చిన నాంపల్లి కోర్టు, వేణుస్వామిపై కేసు నమోదుచేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు
Arun Charagondaవేణుస్వామిపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జాతకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను సైతం మార్ఫింగ్ చేసి వేణుస్వామి ప్రజలను తప్పుదోవ పట్టించారని మూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. తనకు హాని తలపెట్టాలని చూస్తున్నాడని పిటిషన్ లో పేర్కొనగా పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది కోర్టు
Telangana: నీళ్ల సంపులో యువకుడి మృతదేహం...నవీన్ శరీరంపై గాయాలు..హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు!
Arun Charagondaమేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న నీళ్ల సంపులో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు శాంతి నగర్ కు చెందిన నవీన్ ( 21 ) గా గుర్తించగా నవీన్ శరీరంపై గాయాలు ఉండటంతో హత్యనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Donations To Telangana CMRF: రెడ్డీస్ ల్యాబ్ రూ.5 కోట్లు, బాలయ్య కూతురు రూ.50 లక్షలు..ఇంకా ఎవరెవరూ ఎంత ఇచ్చారంటే!
Arun Charagondaతెలంగాణ వరద బాధితుల సహాయార్ధం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని అందివ్వగా తాజాగా రూ.5 కోట్లు విరాళం ఇచ్చింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ.
Fake Doctor Arrest: మేడ్చల్‌లో నకిలీ డాక్టర్, చదివింది డీ ఫార్మసీ చెప్పుకునేది ఎంబీబీఎస్, వల వేసి పెట్టుకున్న ఎస్‌ఓటీ పోలీసులు
Arun Charagondaనకిలీ డాక్టర్‌ని అరెస్ట్ చేశారు ఎస్‌ఓటీ పోలీసులు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని దమ్మాయిగూడకు వెళ్ళే దారిలో డీ ఫార్మ చేసిన బండ సాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీబీఎస్ వైద్యుడి అవతారమెత్తి వైరమ్ లతాశ్రీ మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించారు. పక్కా సమాచారంతో సాయి వర్ధన్ రెడ్డి ఆటకట్టించారు పోలీసులు.
Telangana Congress: కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మహిళా నేతలు, మహిళలను కించ పరిచేలా మాట్లాడారని ఆగ్రహం
Arun Charagondaబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ మహిళా విభాగం. మహిళలను కించపరిచేలా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళా నేతలు. కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Arekapudi Gandhi Vs Kaushik Reddy: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ..మొత్తం వివాదానికి కారణం ఇదే, పీఏసీ వ్యవహారం..అగ్నిగుండంలా మారిన రాష్ట్రం!
Arun Charagondaపార్టీ ఫిరాయింపులు దీనికి తోడు రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం(పీఏసీ) ఛైర్మన్ పదవి వెరసీ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా మారిపోయాయి.
Telangana Flood Relief: తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు ఏఎంఆర్ ఇండియా కోటి రూపాయల విరాళం, సీఎం రేవంత్‌ను కలిసి చెక్కు అందించిన కంపెనీ ఎండీ మహేష్ కుమార్
Arun Charagondaవరద బాధితుల సహాయార్థం ఏఎంఆర్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కంపెనీ ఎండీ ఎ. మహేష్ కుమార్ రెడ్డి .
Ganesh Laddu Auction: వినాయకుడి లడ్డూ వేలంపాటలో ముస్లిం సోదరులు, లడ్డూను రూ.15వేలకు దక్కించుకున్న తాజోద్దీన్..వెల్లివిరిసిన మతసామరస్యం
Arun Charagondaతెలంగాణలోని వనపర్తిలో మత సామరస్యం వెల్లివిరిసింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో వినాయక లడ్డు వేలం పాట జరిగింది. వేలం పాటలో రూ.15 వేలకు లడ్డూను దక్కించుకున్నారు ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్. ఇందుకు సంబంధించిన న్యూస్ చర్చనీయాంశంగా మారింది.
MLA Arekapudi Gandhi: బీఆర్ఎస్‌లోనే ఉన్నా, కేసీఆర్‌ను కలవడానికి ఇబ్బంది లేదన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్ అని మండిపాటు
Arun Charagondaబీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలవటానికి తనకు ఇబ్బేందేమీ లేదు అని తెలిపారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ చెప్పారు...కౌశిక్ రెడ్డి ఆంధ్ర కామెంట్స్ పై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్..మా మనోభావాలు దెబ్బదతినటం వలనే ప్రతిగా స్పందిచాల్సి వచ్చిందని చెప్పారు.
KTR On BRS Leaders House Arrest: బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్, సీఎం రేవంత్ రెడ్డి వెన్నులో ఎందుకంత వణుకు? అని ప్రశ్న
Arun Charagondaబీఆర్ఎస్ నేతల అక్రమ నిర్భంధాలు...హౌస్ అరెస్ట్ ల పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కేటీఆర్...మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా ? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు అని మండిపడ్డారు.