తెలంగాణ

Telangana Shocker: సిద్దిపేటలో దారుణం, వదినను గుడి ప్రాంగణానికి కట్టేసిన మరిది, మిత్తి ఇవ్వలేదని అరాచకం

Arun Charagonda

సిద్దిపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ అన్న వదినను గుడి ప్రాంగణానికి కట్టేశాడు తమ్ముడు. కనకయ్య దగ్గర 1,20,000 అప్పుగా తీసుకున్నారు అన్న పరుశురాములు. తీసుకున్న అప్పు లక్ష చెల్లించగా మిగిలిన 20000 మిత్తి ఇవ్వాలంటూ వదినను అన్నను చెట్టుకు కట్టేశారు మరిది కనకయ్య .

Bandi Sanjay On BRS: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలినమన్న కేంద్రమంత్రి బండి సంజయ్, కేసీఆర్‌కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి, కవితకు రాజ్యసభ అని కామెంట్

Arun Charagonda

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్... కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలనం తర్వాత కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అన్నారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న పార్టీ కాంగ్రెస్‌ది అన్నారు. కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

CM Revanth Reddy On BRS: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా, కేసీఆర్ గవర్నర్ అవుతారన్న సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఏ పదవో తెలుసా?

Arun Charagonda

బీజేపీ - బీఆర్ఎస్ విలీనంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్..మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం పక్కా అని తేల్చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నలుగురు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు.. వాళ్ల విలీనంతో కవితకు బెయిల్ వస్తుందని జోస్యం చెప్పారు.

CM Revanth Reddy Meets Foxconn Chairman: మీ విజన్‌ అద్భుతం..సీఎం రేవంత్‌రెడ్డికి ఫాక్స్ కాన్ సీఈవో కితాబు, త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తా, పెట్టుబడులు పెడుతానని వెల్లడించిన యంగ్ లియూ

Arun Charagonda

త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని చెప్పారు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి- లియూ మధ్య జరిగిన భేటీలో హైదరాబాద్‌లో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేశారు. ఇండ‌స్ట్రీ, స‌ర్వీస్ రంగాల్లో విస్త‌రించే స‌త్తా గ‌ల న‌గ‌రం హైదరాబాద్ అని కొనియాడారు. ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం అని కితాబిచ్చారు.

Advertisement

KTR Apologies To Womens: మహిళలకు క్షమాపణ చెప్పిన కేటీఆర్, అక్కాచెల్లెళ్లను కించ పరిచే ఉద్దేశం లేదని కామెంట్

Arun Charagonda

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్..తన వ్యాఖ్యలతో మహిళలు బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అన్నారు.

Dalit Woman Torture Case: దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ కేసు, షాద్‌నగర్‌ పోలీసులపై కేసు నమోదు, ఇప్పటికే డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లు సస్పెండ్

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో షాద్ నగర్ ఇన్‌స్పెక్టర్‌ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై కేసులు నమోదయ్యాయి

Harishrao : హైదరాబాద్‌లో హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం, దమ్ముంటే రాజీనామా చెయ్- అగ్గిపెట్ట హరీశ్ రావు అంటూ మైనంపల్లి అభిమానుల పేరిట ఫ్లెక్సీల ఏర్పాటు, వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు.

Telangana Shocker: 3 నెలలుగా ఓ మహిళపై పోలీసుల చిత్ర హింసలు, లవ్ మ్యారేజీ విషయంలో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన బషీరాబాద్ పోలీసులు, ఆలస్యంగా వెలుగులోకి ఘటన

Arun Charagonda

వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. కొడుకు ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడని 3 నెలలుగా తల్లిని లాఠీలతో కొడుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్(17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక(16) ప్రేమించుకొని 3 నెలల క్రితం ఇంట్లోనుండి వెళ్ళిపోయారు.

Advertisement

Telangana: ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వదిలి వెళ్లిందని లైవ్‌లోనే పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం, సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం..

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో చివ్వేంల మండలం కోటి నాయక్ తండాకు చెందిన విజయ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే భార్య నికిత తనను వదిలి వెళ్లిందని మనస్థాపంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు.

Thief at Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో చోరీ.. గోడ దూకి చొరబడిన దుండగుడు.. చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ

Rudra

నిర్మల్ లోని బాస‌రలో కొలువైన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యంలో చోరీ జ‌రిగింది. ఆలయం లోపలికి గోడ దూకి చొరబడిన దుండగుడు ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేశాడు.

Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్, హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

Arun Charagonda

తెలంగాణలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు కోదండరాం, అమీర్ అలీఖాన్. మండలిలోని తన ఛాంబర్‌లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ....కోదండరాం, అమీర్ అలీఖాన్ చేత ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కూమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

CM Revanth Reddy Delhi Tour: హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చ, ఆపిల్- ఫాక్స్ కాన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ, పూర్తి వివరాలివే..

Arun Charagonda

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఆగస్టు 14న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కాగ్నిజెంట్ కంపెనీ విస్తరణ పనులు, మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల, సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

Advertisement

SSLV-D3: ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)

Rudra

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది.

KTR-Women's Commission: మహిళలపై 'బ్రేక్ డ్యాన్స్' వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మహిళా కమిషన్ సీరియస్.. సుమోటోగా తీసుకున్న కమిషన్.. విచారణకు ఆదేశం.. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు

Rudra

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు’ ప్రయాణ సదుపాయంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విచారణకు ఆదేశించింది.

Varalakshmi Vratham 2024: నేడే వరలక్ష్మీవ్రతం.. లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి

Rudra

తెలుగింటి ఆడబిడ్డలు ఎంతో మురిపెంగా చేసుకునే వరలక్ష్మీవ్రతం నేడే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి.

Harish Rao VS Revanth Reddy: అబద్ధం కూడా సిగ్గుపడి మూసిలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రవర్తన, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన హరీష్ రావు

Hazarath Reddy

రుణమాఫీ పచ్చి అబద్ధమని తెలిశాక రాజీనామా చేయాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి ఏ దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పారో ఆ దేవుళ్ల వద్దకు వెళతాను. ఆయన చేసిన తప్పు తెలంగాణ ప్రజలకు ముప్పుగా మారవద్దని ప్రార్థిస్తాను" అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

Advertisement

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం, అతి వేగంగా వచ్చి తుఫాను వాహనాన్ని ఢీకొట్టిన మారుతి బెలెనో కారు, ఐదుగురి మృతి

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్‌ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనాన్ని అతి వేగంగా వచ్చిన మారుతి బెలెనో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అయిదుగురు మృత్యువాతపడ్డారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలు అవ్వగా, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Weather Forecast: తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్‌ జారీ, హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Hazarath Reddy

తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Rain in Hyderabad: హైద‌రాబాద్ లో ఒక్క‌సారిగా మారిన వాతావ‌ర‌ణం, ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత వాన‌

VNS

హైద‌రాబాద్ లో వాతావ‌ర‌ణం (Hyderabad rain) ఒక్క‌సారిగా మారిపోయింది. ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బోయిన్ ప‌ల్లి, సికింద్రాబాద్ (Rain), అల్వాల్, ప‌టాన్ చెరు, ఆర్సీపురం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీన్ పూర్, అమీర్ పేట్, హైటెక్ సిటీ లో వ‌ర్షం దంచికొడుతోంది.

KTR Slams CM Revanth Reddy: రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అంటూ బిల్డప్, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్, నోటిఫికేషన్లు ఇవ్వకుండానే 30 వేల ఉద్యోగాలు ఎలా అంటూ సూటి ప్రశ్న

Hazarath Reddy

రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ అని బిల్డప్ ఇచ్చారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆగస్ట్ 15వ తేదీ వచ్చినా రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదని... అందుకే తెలంగాణకు రావాలని పిలుస్తున్నా రాహుల్ గాంధీ రావడం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement