తెలంగాణ

Rain Alert: తెలంగాణ‌కు భారీ వర్ష సూచ‌న‌, రెండు రోజుల పాటూ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అల‌ర్ట్

VNS

రాష్ట్రంలో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rain alert) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) తెలిపింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్యలో ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించారు.

Warangal: ప్రేమ‌ను ఒప్పుకోలేద‌ని యువ‌తి త‌ల్లిదండ్రుల‌ను అడ్డంగా నరికేసిన ఉన్మాది, అడ్డొచ్చిన య‌వ‌తి, అమె సోద‌రుడిపైనా తల్వార్ తో దాడి

VNS

ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్‌తో (Attacked wth talwars) ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు. అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై కూడా తల్వార్‌తో బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో బానోతు శివ, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.

RTC X Road Fire Video: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీదత్తసాయి కాంప్లెక్స్‌లోని మూడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలి రోడ్డు మీద పడ్డాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Jitender as New DGP of Telangana: తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్‌, రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Hazarath Reddy

తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ జితేందర్‌ని నియమిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియామిస్తునట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.2025 సెప్టెంబర్‌లో జితేందర్‌ పదవీ విరమణ చేయనున్నారు.

Advertisement

IPS Transfers In Telangana: తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్ అధికారుల బ‌దిలీ, మ‌హేష్ భ‌గ‌వ‌త్, స్వాతి ల‌క్రా, స్టీఫెన్ ర‌వీంద్ర సహా ప‌లువురు సీనియ‌ర్ల ట్రాన్స్ ఫ‌ర్

VNS

తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ (IPS Officers Transfer) అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌ (Mahesh Bhavath) బదిలీ అయ్యారు. హోంగార్డులు, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతిలక్రా (Swati lacra), గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర నియామకమయ్యారు.

Telangana: వీడియో ఇదిగో, డీఎస్సీ వాయిదా వేయకుంటే నాకు చావే గతి, సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకున్న మ‌హిళా అభ్య‌ర్థి

Hazarath Reddy

సీఎం రేవంత్ రెడ్డికి న‌మ‌స్కారం. డీఎస్సీ సిల‌బ‌స్ ఎక్కువ‌గా ఉంది. టెట్, డీఎస్సీ మ‌ధ్య 20 రోజుల స‌మ‌య‌మే ఇచ్చారు. మీ కాళ్లు మొక్కుతా.. దండం పెడుతా.. డీఎస్సీ వాయిదా వేయండి స‌ర్.. నా భ‌ర్త నా మీద న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. స‌మ‌యం లేనందున సిల‌బ‌స్ పూర్తి చేయ‌డం క‌ష్టం

Telangana: ఉస్మానియా యూనివ‌ర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత, మీడియా రిపోర్ట‌ర్‌పై పోలీసుల దాడి, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ వాయిదా వేయాల‌ని నిరుద్యోగ అభ్య‌ర్థులు నిరసనకు దిగారు. వారికి మ‌ద్ద‌తుగా నిర‌స‌న తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకుల ప‌ట్ల పోలీసులు అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు.వారిపై దాడి చేశారు.

Dammapeta SI Dies of Heart Attack: తీవ్ర విషాదం, గుండెపోటుతో కుప్పకూలిన దమ్మపేట ఎస్ఐ, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సర్కిల్‌లో పోలీసులను విషాదాలు వెంటాడుతున్నాయి. అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య ఘటనను మరువకముందే..మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దమ్మపేట పోలీస్ స్టేషన్ లో రెండవ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సీమా(60) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

Advertisement

Telangana: దారుణం, ముగ్గురు పిల్లలను చంపి తాను కూడా చనిపోడానికి చెరువులోకి కారు తీసుకెళ్లిన తండ్రి, చివరకు ఏమైందంటే..

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్‌లోని ఓ తండ్రి తన ముగురు పిల్లలని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోడానికి ఇనాంగూడ చెరువులోకి తన కారును వేగంగా డ్రైవ్ చేశాడు. అది చూసిన స్థానికులు ప్రమాదవశాత్తు దూసుకు వెళ్లారనుకొని నలుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana: టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు గుడ్ న్యూస్, నెలకు రూ 5,000 స్టైఫండ్‌తో పాటు ఉచిత కోచింగ్ అందిస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కారు

Hazarath Reddy

తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు నెలకు రూ 5,000 స్టైఫండ్‌తో పాటు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.కాగా టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి.

'Ghostbusting' in Telangana: పాఠశాలలో దెయ్యం పుకార్లు, విద్యార్థుల భయం పోగొట్టేందుకు రాత్రంతా ఆ స్కూలులోనే పడుకున్న ఉపాధ్యాయుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పాఠశాలల్లో దెయ్యాల గురించిన అపోహలు కొత్తేమీ కాదు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి గదిలోనే దెయ్యం ఉందని విద్యార్థులు చెప్పగా అది అబద్దమని ఉపాధ్యాయుడు నిరూపించిన సంఘటన చోటు చేసుకుంది.

Mujra Party Busted in Hyderabad: వీడియో ఇదిగో, అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు, ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ గుట్టు రట్టు చేసిన మొయినాబాద్‌ పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్‌ శివార్లలోని మొయినాబాద్‌ (Moinabad)లోని ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ (Mujra Party) నిర్వహిస్తున్నారని, అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్సులు వేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు.

Advertisement

Ponnam Prabhakar: తామేమి అలగలేదని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌, తోపులాట‌ను నిలువ‌రించేందుకు కొద్దిసేపు ఆగిన‌ట్లు వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల‌కు హాజ‌రైన‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కార్య‌క్ర‌మం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. ప్రొటోకాల్‌ పాటించడం లేద‌ని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయారు

Mohammad Siraj Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి‌ని కలిసిన మహమ్మద్ సిరాజ్, టీమిండియా జెర్సీని సీఎంకు బహుకరించిన టీమిండియా క్రికెటర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Hyderabad Car Fire: వీడియో ఇదిగో, దిల్‌సుఖ్‌నగర్ వద్ద కదులుతున్న కారులో మంటలు, తృటిలో తప్పించుకున్న డ్రైవర్, అందులో ప్రయాణికులు

Hazarath Reddy

గత రాత్రి హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ నుండి దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. ఇంజన్ నుండి మంటలు రావడంతో డ్రైవర్, ప్రయాణికులు తప్పించుకోగలిగారు.

Hyderabad: తన పిల్లల టీసీ ఇవ్వాలంటూ స్కూలు ఎదుట తండ్రి అర్థ నగ్న ప్రదర్శన, యాజమాన్యం కాళ్ళు మొక్కినా కనికరించలేదని ఆవేదన

Hazarath Reddy

నాగోల్‌లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తన పిల్లలకు TC, బోనోపైడ్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని విద్యార్థి తండ్రి ధర్మరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Live Rat Found in Chutney: వీడియో ఇదిగో, జెఎన్టియుహెచ్ క్యాంపస్ మెస్‌ చట్నీలో చిందులేసిన ఎలుక, మండిపడుతున్న విద్యార్థులు

Hazarath Reddy

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ ప్రాంతం జెఎన్ టియుహెచ్ కాలేజీలోని క్యాంటీన్‌లో చట్నీ పాత్రలో ఎలుక కనిపించింది. మూత పెట్టకపోవడంతో చట్నీలో ఎలుక పడింది. చట్నీలో ఎలుక పరుగులు తీయడం చూసిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహ స్పందించారు.

Kidney Racket In Vijayawada: రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి కిడ్నీ కొట్టేసిన ముఠా.. చివరకు రూ. లక్ష చేతిలో పెట్టి బెదిరింపులు.. విజయవాడలో భారీ మోసం

Rudra

విజయవాడలో కిడ్నీ రాకెట్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. కిడ్నీ ఇస్తే, రూ. 30 లక్షలు ఇస్తామని ఆశచూపి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నాక.. డబ్బులు ఇచ్చేది లేదంటూ ఎదురితిరిగి బెదిరించింది.

Balkampet Yellamma Kalyanam: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం నేడే.. ఉదయం 11.34 గంటలకు అంగరంగ వైభోగంగా వేడుక

Rudra

రాష్ట్రంలో మహిమాన్విత క్షేత్రంగా బాసిల్లుతున్న హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం జరుగనుంది. ఉదయం 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు.

Rains in Telangana: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Rudra

రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement
Advertisement