తెలంగాణ

Justice Narasimha Reddy Commission Row: విద్యుత్‌ కమిషన్‌ విచారణ రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగించవచ్చంటూ స్పష్టం

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన రిట్‌ పిటిషన్‌ను (Former CM KCR’s writ petition) తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. జూన్‌ లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Telangana: రోజూ తాగి వస్తున్నాడని భర్త చేతులు కాళ్లు కట్టేసి నిప్పు కర్రతో వాతలు పెట్టిన భార్య, లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

Hazarath Reddy

తెలంగాణలోని నిజామాబాద్ సారంగాపూర్ కు చెందిన మహేష్ (33) అనే వ్యక్తి తన భార్య తనను తీవ్రంగా కొట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ 6-టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిప్ప తండాకు చెందిన మహేష్ మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా భార్య సునీతతో గొడవపడేవాడని తెలిపారు.

Safety Pin Found in Biryani: బాబోయ్, మణికొండ మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌, అధికారులకు ఫిర్యాదు

Vikas M

హైదరాబాద్ మణికొండలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌ను(కాంట) కనుగొన్నాడు. కస్టమర్ జూన్ 29,2024, శనివారం నాడు సేఫ్టీ పిన్‌తో బిర్యానీ ఫోటోను పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిస్పందన కోరుతూ అధికారులకు ట్యాగ్ చేశాడు

Advertisement

Ex MP Ramesh Rathod No More: మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ కన్నుమూత..తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన రమేశ్ రాథోడ్..

sajaya

ఆదిలాబాద్: మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ కన్నుమూత.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్కు తరలింపు.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన రమేశ్ రాథోడ్.. స్వస్థలం ఉట్నూరుకు రమేశ్ రాథోడ్ మృతదేహం తరలింపు..

Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. అంజన్నను దర్శించుకోనున్న జనసేనాని

Rudra

కొండగట్టు అంజన్నను నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన కొండగట్టుకు వస్తున్నారు.

DS Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత.. గుండెపోటుతో అస్తమయం

Rudra

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. శనివారం గుండెపోటుకు గురై తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Telangana DSC 2024 Exam Schedule Out: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు షిఫ్ట్‌ లలో పరీక్షల నిర్వహణ.. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలు

Rudra

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకొనే లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.

Advertisement

Revanth Reddy On Loan Waiver: రైతుల‌కు రుణ‌మాఫీకి రేష‌న్ కార్డుతో సంబంధం లేదు! కీల‌కవ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

VNS

రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. పంట రుణాల మాఫీకి (Farm Loan Waiver) రేషన్ కార్డు ప్రామాణికం కాదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. రేషన్ కార్డు (Ration Card) కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే అని వెల్లడించారు.

Explosion in Glass Factory: షాద్ నగ‌ర్ లో ఘోర ప్ర‌మాదం, గ్లాస్ ఫ్యాక్ట‌రీలో కంప్రెష‌ర్ పేలి ఆరుగురు మృతి, చెల్లాచెదురుగా పడిపోయిన మృత‌దేహాలు

VNS

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో (Shad Nagar) పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక సౌత్‌ గ్లాసు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కంప్రెషర్‌ పేలడంతో (Compressor Blast) ఆరుగురు మృతి చెందారు. ఈ పేలుడుతో పరిశ్రమ వద్ద భీతావహ వాతావరణం నెలకొంది. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

Medigadda Barrage: మేడిగ‌డ్డ రిపేర్ ప‌నుల‌కు బ్రేక్, ఇప్పట్లో ప‌నులు చేప‌ట్టే ప‌రిస్థితి లేదంటున్న అధికారులు

VNS

వర్షా కాలం తర్వాతే బ్యారేజ్ మరమ్మతు పనులు పున: ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎగువున భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద నీరు.. ప్రాణహిత నదికి భారీగా చేరుకుంది. ప్రాణహితలో వరద ప్రవాహం పెరిగి.. ఆ వరద మేడిగడ్డ బ్యారేజీకి (Medigadda Barrage) రావడంతో.. బ్యారేజీ మరమ్మతు పనులు కొనసాగించే పరిస్థితులు లేకుండా పోయాయి.

Telangana: వీడియో ఇదిగో, కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో పూర్తిగా కాలి బూడిదైన రైతు కూలీ ఇల్లు, సుమారు రూ. 5 లక్షల ఆస్తి నష్టం

Hazarath Reddy

మంచిర్యాల జిల్లాలోని భీమిని మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో అంబిలపు సుధాకర్ అనే రైతు కూలీ ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న లక్ష రూపాయల నగదు కాలిపోగా.. సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగింది.

Advertisement

CM Revanth Reddy On Jagan: జగన్ చచ్చిన పాము, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఏమన్నారంటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రయోజనాల విషయంలో తాను రాజీపడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

TS SSC Advanced Supplementary Results 2024 Out: తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, ఫలితాలను bse.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విద్యాశాఖ అధికారులు వీటిని విడుద‌ల చేశారు. సప్లిమెంటరీ పరీక్ష‌ల్లో 73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు

Harish Rao Meets Kavitha: వీడియో ఇదిగో, తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖాత్, ధైర్యంగా ఉండాలని సూచన

Hazarath Reddy

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో అరెస్టు అయి తిహార్ జైల్లో (Tihad Jail) ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)తో శుక్రవారం ఉదయం ఆయన భేటీ అయ్యారు.

Telangana: వీడియో ఇదిగో, పశువులు వాగు దాటుతుండగా ఉప్పొంగిన పెద్ద వాగు, పెద్దఎత్తున నీటిలో కొట్టుకుపోయిన ఆవులు, గేదెలు

Hazarath Reddy

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వరద ఉధృతికి ఆవులు, గేదెలు కొట్టుకుపోయాయి. జిల్లాలోని కాగజ్ నగర్ అందవెల్లి సమీపంలోని పెద్దవాగు దగ్గర పశువులు దాటుతుండగా ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది.

Advertisement

Dog Attack in Hyderabad: కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు మృతి, ప్రకృతి పిలుపు కోసం వెళ్లగా ఒక్కసారి దాడి చేసిన వీధికుక్కలు

Hazarath Reddy

పటాన్ చెరు పరిధి ఇస్నాపూర్‌లోని మహీధర వెంచర్లో విశాల్(8) అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బీహార్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికుని కుమారుడైన బాలుడు శుక్రవారం ఉదయం ప్రకృతి పిలుపుకు వెళ్లాడు

BRS MLA Kale Yadaiah Joins Congress: బీఆర్ఎస్‌లో మరో వికెట్ డౌన్, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత రాష్ట్ర సమితి (BRS)కు మరో షాక్‌ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు

Car Hits School Bus: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, స్కూలు బస్సును ఢీకొట్టిన కారు, దెబ్బకు బోల్తా పడిన బస్సు, ఆరుగురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హన్మకొండ-కమలాపూర్ మండలంలోని ప్రధాన రహదారిపై పాఠశాల బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఏకశిలా స్కూల్‌ బస్సు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీని తాకిడికి బస్సు బోల్తాపడింది.

Viral Video: నార్సింగ్ హనుమాన్ గుడిలో చోరీ.. సీసీటీవీలో రికార్డు అయిన చోరీ దృశ్యాలు.. వీడియోతో

Rudra

హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గంధంగూడలోని శ్రీనివాస నగర్ కాలనీలోని హనుమాన్ గుడిలో చోరీ జరిగింది.

Advertisement
Advertisement