తెలంగాణ
Telangana Elections 2024: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జోరందుకున్న వలసలు, చెక్ పెట్టేందుకు కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ, పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల ముంగిట తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీట్ల కోసం, అధికారం కోసం నేతలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ ఆ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు.
Telangana: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు, చికిత్స అందించేలోగానే మృతి, వీడియో ఇదిగో..
Hazarath Reddyనిజామాబాద్‌కు చెందిన సాంబయ్య హుజురాబాద్ నుంచి నిజామాబాదు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. మెట్‌పల్లి బస్టాండ్‌లో మూత్రవిసర్జనకు దిగగా, బస్సు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి, సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Shamshabad Fire: శంషాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, పక్కనే సిలిండర్ గోదాం ఉండడంతో పొంచి ఉన్న పెను ముప్పు, మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని శంషాబాద్(Shamshabad) మున్సిపాలిటీ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం(Fire broke) చోటు చేసుకుంది. రాల్లగూడ రోడ్లో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో(Scrap shop) భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
Hyderabad Fire: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ వాహనం పార్కింగ్ స్థలంలో భారీ అగ్నిప్రమాదం, దాదాపు పోలీసులు స్వాధీనం చేసుకున్న 40 వాహనాలు దగ్ధం
Hazarath Reddyహైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనం పార్కింగ్ స్థలంలో భారీ మంటలు చెలరేగాయి. మంటలు ప్రక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి, పోలీసులు స్వాధీనం చేసుకున్న అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి.అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి
FIR filed on KTR: హన్మకొండలో మాజీ మంత్రి కేటీఆర్‌ పై కేసు నమోదు.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హన్మకొండ పోలీసులు
Rudraమాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై హన్మకొండలో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్‌‌ లో ఫిర్యాదు చేశారు.
Fire Accident in Warangal Shopping Complex: వరంగల్ లోని వద్దిరాజు షాపింగ్ కాంప్లెక్స్‌ లో మంటలు.. భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసిన కస్టమర్లు.. మంటలు అదుపులోకి (వీడియో)
Rudraవరంగల్ - పోచమ్మ మైదాన్ జంక్షన్‌ లోని వద్దిరాజు షాపింగ్ కాంప్లెక్స్‌ లో నిన్న రాత్రి మంటలు చెలరేగాయి. దీంతో మాల్ లోపల ఉన్న కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
Kadiam Kavya Big Shock to BRS: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ కు బిగ్ షాక్.. వరంగల్ లోక్‌ సభ పోటీ నుంచి వైదొలగిన కడియం కావ్య.. కేసీఆర్ కు సుదీర్ఘమైన లేఖ.. తండ్రి కడియం శ్రీహరితో కలిసి హస్తం గూటికి చేరే ఛాన్స్
Rudraపుట్టెడు కష్టాల్లో మునిగిన బీఆర్ఎస్‌ కు లోక్ సభ ఎన్నికల వేళ మరో బిగ్ షాక్ తగిలింది. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి కడియం కావ్య తప్పుకున్నారు.
Theft Caught on Camera: పట్టపగలే కారు అద్దాలను ద్వంసం చేసి రూ. 2 లక్షల చోరీ, సీసీటీవీ పుటేజీలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డు
Hazarath Reddyజనగామ జిల్లా కేంద్రంలోని ICICI బ్యాంకులో దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన ప్రతాప్ రెడ్డి రూ.2 లక్షలు డ్రా చేసి డబ్బును కారులో ఉంచాడు. కారును పంజాబ్ బ్యాంకు ఎదుట పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు కారు అద్దాలను ద్వంసం చేసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
Hyderabad Shocker: అర్థరాత్రి అపార్ట్‌మెంట్‌పై విరుచుకుపడిన 30 మంది హిజ్రాలు, రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని కొండాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఓ అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించిన 20 నుంచి 30 మంది హిజ్రాలు డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. రూ. 30 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Heart Touching Story: అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన, చనిపోయిన కూతురు స‌మాధి పక్కనే రోదిస్తూ పడుకున్న తండ్రి, ఆమె జ్ఞాప‌కాల‌నే తలుచుకుంటూ..
Hazarath Reddyఓ తండ్రి త‌న బిడ్డ మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌.. ఆమె జ్ఞాప‌కాల‌ను మ‌రిచిపోలేక‌.. ఏకంగా ఆమె స‌మాధి వ‌ద్ద రోదిస్తూ ప‌డుకున్నాడు. ఆ స‌మాధిని గ‌ట్టిగా కౌగిలించుకుని త‌న బిడ్డ జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ చ‌లించిపోయారు. ఈ హృద‌య విదార‌క దృశ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు, 14 మందితో ఎనిమిదో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, తెలంగాణ నుంచి 4 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, లిస్టు ఇదిగో..
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికలకు 14 మంది అభ్యర్థులతో కూడిన ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ బుధవారం విడుదల చేసింది, మధ్యప్రదేశ్‌లోని గుణాలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై రావు యద్వేంద్ర సింగ్‌ను బరిలోకి దింపింది.
Telangana Fire: కాటేదాన్ బిస్కెట్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyమైలార్ దేవుపల్లి పరిధిలో గల కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మాట్లార్పుతోంది. దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Nita Ambani: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ.. ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్
Rudraఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.
Telangana Road Accident: పెళ్లి కూతురును తీసుకువస్తుండగా ట్రాక్టర్‌ బోల్తా, ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి, మెదక్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyమెదక్‌ జిల్లాలో ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది.. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు ఆందోల్‌ గ్రామానికి బయల్దేరారు. మన్సాన్‌పల్లి వద్దకు రాగానే ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది.
Telangana: ఇంట్లో గొడవపడి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన యువకుడు, ప్రాణాలకు తెగించి కాపాడిన హోంగార్డు, వీడియో ఇదిగో..
Hazarath Reddyవరంగల్ - ఛత్తీస్‌గఢ్‌ నుండి ఉపాధికోసం వచ్చిన సోను అనే యువకుడు కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.. అతన్ని గమనించిన హోంగార్డు రవి ప్రాణాలకు తెగించి రక్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Telangana Weather Update: తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు, అరెంజ్ అలర్ట్ జారీ చేసిన రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ
Hazarath Reddyతెలంగాణలో మార్చి చివరి వారంలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఆదిలాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో మంగళవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని తలమడుగు, జైనథ్‌ మండలాల్లో మంగళవారం గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.
Delhi Excise Policy Case: కవిత కేసులో రాజకీయ ప్రమేయం లేదు, అది అంతా అవినీతి కేసు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyహైదరాబాద్, తెలంగాణ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితపై కేసు రాజకీయ ప్రేరేపితమైనది కాదని, ఇది అవినీతి కేసు అని.. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి సంబంధించిన కేసు అని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
KTR Slams CM Revanth Reddy: వెంట్రుక కూడా పీకలేవంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన కేటీఆర్, ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అవుతారంటూ జోస్యం
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు (KTR Slams CM Revanth Reddy) చేశారు. మంగళవారం సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి నేతలతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తీహార్ జైలుకు కవిత, ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజుల పాటు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది ట్రయల్‌ కోర్టు.దీంతో ఆమెను తీహార్‌ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్‌ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్‌ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు.
Delhi Excise Policy Case: ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు, కడిగిన ముత్యంలో బటయకు వస్తానని తెలిపిన ఎమ్మెల్సీ కవిత
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మనీ లాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ లాండరింగ్‌ కేసని విమర్శలు గుప్పించారు.