తెలంగాణ
Lucky Draw Cheating: రూ. 11వంద‌లు క‌డితే బంప‌ర్ డ్రాలో కారు, బంగారం, ఫ్రిడ్జ్.. ఏకంగా 3 వేల మందిని రూ. 5కోట్లు ముంచి ఉడాయించిన సంస్థ‌
VNSలక్కీ డ్రా పేరుతో ప్రతి నెల బంగారం, కారు, వెండి, బైకులు, ఫ్రిడ్జ్ టీవీ, వాషింగ్ మిషన్, మొబైల్స్ బహుమతిగా (Gifts) ఇస్తామని ఊరించింది. ఇదేదో ఆఫర్ అదిరిపోయింది అంటూ.. చాలామంది అట్రాక్ట్ అయ్యారు. లక్కీ డ్రా లో ఇస్తామన్న బహుమతులకు ఆశపడ్డారు. ఇంకేముంది లక్కీ డ్రాలో చేరిపోయారు. అలా.. 3వేల మెంబర్ షిప్ లు చేయించింది సంస్థ. ఒక్కో వ్యక్తి నుండి ప్రతి నెల 1100 రూపాయలు వసూలు చేసింది.
Bandi Sanjay: ఫిబ్ర‌వ‌రి 2వ తారీఖు కూడా అయిపోయింది! కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి బండి సంజ‌య్ హెచ్చ‌రిక‌, గ్రూప్ -1 నోటిఫికేష‌న్ ఏమైందంటూ నిల‌దీత‌
VNSతెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ (Group-1 Notification) ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.
Telangana Cabinet Meeting: ఈ నెల 4న‌ తెలంగాణ కేబినెట్ స‌మావేశం, అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు స‌హా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించనున్న మంత్రివ‌ర్గం
VNSఈ నెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet Meeting) సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణతో పాటు కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లోని రెండు స్కీమ్‌ల అమలుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ తేదీని అధికారికంగా నిర్ణయించనున్నారు.
Mohan Babu on Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై ప్రశంసలు కురిపించిన మోహన్ బాబు, గద్దర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హీరో
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డులపై మంచు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నట్లుగా తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ట్వీట్‌లో చెప్పుకొచ్చారు
Telangana Shocker: పోలీసులు ఫోన్ లాక్కున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసంగారెడ్డి - పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సంతోష్ అనే యువకుడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న వీడియోలు తీయడం గమనించిన పోలీసులు అతని ఫోన్ లాక్కుని ప్రశ్నించడంతో భయపడి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ నుండి పెట్రోల్ తెచ్చుకొని ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు.
Telangana: తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటన
Hazarath Reddy.ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్‌ రూ.1200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని తెలిపారు. విద్యుత్‌ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్న సీఎం.. త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించారు.
CM Revanth Reddy Indravelli Tour: త్వరలో మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్, నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు.ఆదివాసీల ఇలవేల్పు నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Telangana Elections 2024: మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం బండ్ల గణేశ్‌ దరఖాస్తు, కాంగ్రెస్‌లో చేరతామని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోమని మండిపాటు
Hazarath Reddyమతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరతామని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని స్పష్టం చేశారు.
Godavari Express Train Turns 50: గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు గోల్డెన్ జూబ్లీ వేడుకల వీడియోలు ఇవిగో, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులతో విడదీయలేని అనుబంధం
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల మధ్య పట్టాలపై పరుగులు పెడుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఎక్స్ ప్రెస్ సేవలు విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు.
Viral Video: బస్సు టైర్ కింద తల పెట్టి..నడిరోడ్డుపై అర్ధ నగ్నంగా వ్యక్తి హంగామా.. హైదరాబాద్ లో ఘటన (వీడియోతో)
Rudraహైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌ లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వచ్చి హంగామా సృష్టించాడు. రోడ్డుమీద పోయే వాహనాలపై దాడి చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
TTD Srivari Hundi: వంద కోట్ల మార్క్‌ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం.. వరుసగా 23వ నెలలోనూ రికార్డ్
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారికి భారీగా కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా శ్రీవారికి హుండీ ద్వారా ప్రతీ రోజు కోట్లలో ఆదాయం వస్తుంటుంది. ఇక, తిరుమల వెంకన్నకు వరుసగా గత నెలలో కూడా ఆదాయం వంద కోట్ల మార్క్‌ ని దాటింది.
CM Revanth Indravelli Sabha: నేడు ఇంద్రవెల్లిలో రేవంత్‌ సభ.. రూ.500కే సిలిండర్‌, ఉచిత విద్యుత్తు లేదా మహిళలకు నెలకు రూ.2500 ఆర్థికసాయం వంటి హామీల అమలుపై ప్రకటించే ఛాన్స్
Rudraతెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Telangana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వెళ్ళతున్న బీటెక్ విద్యార్థి కాళ్ల మీద నుంచి వెళ్లిన లారీ
Hazarath Reddyమేడ్చల్ జిల్లా: యంనంపేట్‌లో రోడ్డు ప్రమాదం విద్యార్థి హర్షిత కాళ్లపై లారీ దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ యంనంపేట్ వద్ద అతివేగంతో హర్షిత 20 విద్యార్థి కాళ్లపై వెళ్ళిన TS30T3949 నెంబర్ గల లారీ. శ్రీనిధి కళాశాల బీటెక్ సెకండియర్ చదువుతున్న హర్షిత అనే విద్యార్థిని. ఎగ్జామ్ రాసి తిరిగి ఇంటికి వెళ్ళతున్న సమయంలో సంఘటన. విద్యార్థి పరిస్థితి విషం నగరంలోని శ్రీకర ఆసుపత్రికి తరలింపు.
Video: ఫుల్లుగా తాగి ఇంటిదగ్గర దింపమని అంబులెన్స్‌కు కాల్ చేసిన మందుబాబు, లేదంటే స్పృహతప్పి పడిపోతానంటూ వాదన, వీడియో ఇదిగో..
Hazarath Reddyరమేష్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగేసి భువనగిరి నుండి జనగాంకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్‌కు కాల్ చేసాడు.. అవాక్కైన సిబ్బంది ఎందుకు కాల్ చేసావని అడగగా నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవు, నన్ను జనగాంలో దింపండి లేదంటే స్పృహతప్పి పడిపోతానేమో అంటూ వాదించాడు.
Bronze Statue of Gadar Unveiled: ప్రజాయుద్ధనౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ - పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజాయుద్ధనౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
Hit And Run Case: జూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వీడియో ఇదిగో, బైకులను ఢీకొట్టి బీభత్సం సృష్టించిన వైట్ డెకో స్పోర్ట్స్ కారు, ముగ్గురుకి తీవ్ర గాయాలు
Hazarath Reddyజూబ్లీహిల్స్ లో మరో హిట్ అండ్ రన్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వైట్ డెకో స్పోర్ట్స్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగాంగా వెళ్లి ఎదురుగా ఉన్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లితో పాటు మరో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
KCR Take Oath as MLA: గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, బీఆర్‌ఎస్‌ అధినేత చేత ప్రమాణం చేయించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌
Hazarath Reddyతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చాంజర్‌లో ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణం చేశారు. ఇక, కేసీఆర్‌తో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ‍ప్రమాణం చేయించారు
KCR Oath: ఎమ్మెల్యేగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఓట‌మి ఎరుగ‌ని నేత‌గా గులాబీ బాస్ రికార్డు, ఏకంగా ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా ప్ర‌మాణం
VNSఆయన రెండు నెలలుపాటు గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడు కర్ర సాయంతో వైద్యుల పర్యవేక్షణలో నెమ్మదిగా నడుస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీ ఆవరణలో శాసనసభాపక్ష నేతగా ఆయనకు కేటాయించిన చాంబర్ లో కేసీఆర్ ముందుగా పూజలు చేస్తారు.
Hyderabad: వృద్ధురాలిని కుర్చీకి క‌ట్టేసి బంగారం, న‌గ‌దు దోచుకెళ్లిన దొంగ‌లు, నోట్లో గుడ్డ‌లు కుక్క‌డంతో ఊపిరాడ‌క మృతిచెందిన మ‌హిళ‌, విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..
VNSబీరువాలో ఉన్న నగదు, బంగారాన్ని తీసుకొని పారిపోయారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా.. స్నేహలత కుర్చీలో బంధించి, అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను వెంటనే హైదర్‌గూడలోని అపోలో దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Gaddar Award: ఇకపై ప్ర‌తీ సంవ‌త్స‌రం నంది అవార్డులు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌, పుర‌స్కారం పేరు మార్చుతూ త్వ‌ర‌లోనే జీవో జారీ
VNSతెలంగాణలో నంది అవార్డులను ఇక నుంచి ‘గద్దర్ అవార్డు’ (Gaddar Award) పేరుతో ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నేడు జనవరి 31న గద్దర్ జయంతి కావడంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ రేవంత్ రెడ్డి (Revanth reddy).. ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.