తెలంగాణ

Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పూర్తి కథనం, కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానల్లో విజయం

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఓటర్లు హస్తానికే పట్టం కట్టారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది.

Telangana Rains: తెలంగాణపై మిచౌంగ్ తుపాన్ ఎఫెక్ట్, పలు జిల్లాలకు యెల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాకాతంలో విలయతాండవం సృష్టిస్తున్న మిచౌంగ్ తుపాన్ ప్రభావం తెలంగాణలోనూ తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది

Telangana Assembly Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు, ఏడు స్థానాలను నిలుపుకున్న ఎంఐఎం, గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తగ్గిపోయిన ఓటు బ్యాంకు

Hazarath Reddy

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అసెంబ్లీలో తన ఏడు స్థానాలను నిలుపుకుంది. రెండు సీట్లలో ఓడిపోయింది. అలాగే సాంప్రదాయక కోటలో ఆ పార్టీకి ఓట్ల శాతం కూడా తగ్గింది. ఎఐఎంఐఎం అభ్యర్థులు రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించగా, మరో ఐదు సెగ్మెంట్‌లను మెజారిటీతో నిలబెట్టుకున్నారు.

IAF Aircraft Crashlands in Toopran: తూప్రాన్‌ లో కూలిన శిక్షణ హెలికాప్టర్‌.. ఒకరు లేక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసుల అనుమానం

Rudra

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపల్ పరిధి రావెల్లి శివారులో శిక్షణ హెలికాప్టర్‌ కూలింది. హైదరాబాద్‌ కు చెందిన హెలికాప్టర్‌ సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది.

Advertisement

Bus Accident in Nalgonda: హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం.. నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘటన

Rudra

హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం కాగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. నల్లొండ జిల్లా మర్రిగూడ వద్ద జరిగిందీ ఘటన.

Kamareddy Result: గత సీఎం కేసీఆర్‌, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డిలను సాధారణ ప్రత్యర్థులుగానే చూశా.. కామారెడ్డి వీరుడు వెంకటరమణారెడ్డి స్పందన ఇది..

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామం కామారెడ్డి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థులను ఢీకొట్టి.. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు.

TS New CM Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి!.. నేడు ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక, ఖర్గే

Rudra

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం కానున్నది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌ కు తెలియజేస్తారు.

KCR Leaving Pragathi Bhavan: సామాన్యుడిలా ట్రాఫిక్‌ లో ఆగుతూ.. కాన్వాయ్, గన్‌ మెన్‌ లు లేకుండానే సొంత వాహనంలో ఫామ్ హౌస్ కు పెద్ద సారు.. ఓటమి తథ్యమని తెలియగానే కేసీఆర్ ప్రగతిభవన్ ను ఎలా విడిచిపెట్టి వెళ్లారంటే??

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమి తప్పదని తెలిసిన వెంటనే హుందాగా వ్యవహరిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.

Advertisement

Telangana CM: రేపు ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం..గవర్నమెంట్ ఏర్పాటుకు సిద్ధం

ahana

హైదరాబాద్‌: రేపు ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం.. గవర్నమెంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని గవర్నర్‌కు చెప్పాం.. కాంగ్రెస్‌కు 65 మంది సభ్యులున్నారని వెల్లడించాం -డీకే శివకుమార్‌

Women MLAs in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన 8 మంది మ‌హిళ‌లు, ఈ సారి రికార్డు సృష్టించిన యువతులు, అతిపిన్న వ‌య‌స్సులో అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న ఎమ్మెల్యేలు వీళ్లే!

VNS

కొత్తగా విజయం సాధించినవారిలో కంటోన్మెంట్‌ నుంచి లాస్య నందిత, పాలకుర్తిలో మామిడాల యశస్విని , నారాయణ్‌పేట్‌లో పర్నికా రెడ్డి (Parnika Reddy) ఉండగా, ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, నర్సాపూర్‌లో సునితా లక్ష్మారెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, వరంగల్‌ తూర్పులో కొండా సురేఖ(Konda surekha), ములుగులో సీతక్క, కోదాడలో పద్మావతి రెడ్డి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

RGV on Revanth Reddy & KTR: రేవంత్ రెడ్డి, కేటీఆర్ పై ఆర్జీవీ సెన్సేష‌న‌ల్ పోస్ట్, ఇంత‌వ‌ర‌కు ఇలాంటి నాయ‌కుల‌ను చూడ‌లేదంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రామ్ గోపాల్ వ‌ర్మ‌

VNS

ఈ ట్వీట్ కి ఆర్జీవీ రెస్పాండ్ అవుతూ.. “ఇప్పుడు ఈ ఓటమి మీద మీరు చేసిన మాటలకు కూడా అంతం లేదు సర్. ఎందుకంటే ఓటమిని ఇంత పాజిటివ్ గా తీసుకున్న ఏ పొలిటికల్ లీడర్ ని నేను చూడలేదు. ఆ విషయంలో మీకు హ్యాట్సాఫ్. ఇలాంటి ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యమే అందరికి కావాల్సింది” అంటూ ట్వీట్ చేశారు.

Telangana New DGP: తెలంగాణ కొత్త డీజీపీగా ర‌విగుప్తా, ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వం, రేవంత్ ను క‌లిసింద‌నందుకు డీజీపీ అంజ‌నీకుమార్ పై వేటు

VNS

డీజీపీ అంజనీ కుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రవి గుప్తా వచ్చారు. రేవంత్ రెడ్డిని (Revanth Reddy) అంజనీ కుమార్ కలవడం పట్ల ఈసీ సీరియస్ అయ్యింది. వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది.

Advertisement

Telangana Election Results 2023: గజ్వేల్‌లో 45,174 ఓట్ల తేడాతో ఈటెల రాజేందర్‌పై ఘన విజయం, మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌ అభ్యర్థి తూమ్‌కుంట నర్సారెడ్డి

Hazarath Reddy

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌ రావు ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్తి ఈటల రాజేందర్‌పై 45,174 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తూమ్‌కుంట నర్సారెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.

Telangana Election Results 2023: తెలంగాణలో 8 సీట్లను కైవసం చేసుకుని పుంజుకున్న బీజేపీ, కమలం గెలిచిన స్థానాలు ఇవే..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఓట్ల శాతాన్ని, సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. మొత్తం 111 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ మొత్తం 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ఎంపీల్లో సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌ ఓటమి పాలయ్యారు

Telangana Election Results 2023: ఓటమి ఎరుగని ఎర్రబెల్లి దయాకర్‌రావును మట్టికరిపించిన కాంగ్రెస్‌ అభ్యర్థి య‌శ‌స్విని రెడ్డి, కొండా సురేఖ చేతిలో ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావు ఓటమి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సోదరుడు ఓటమి పాలయ్యారు. ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు బీఆర్‌ఎస్‌ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యేగా మరోసారి బరిలోకి దిగారు. ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్‌ రావు వరంగల్‌ ఈస్ట్‌ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు.

Telangana Election Results 2023: మళ్లీ ఎంపీగా పోటీ చేస్తా, బర్రెలక్క సంచలన నిర్ణయం, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు విజయం

Hazarath Reddy

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అత్యధిక సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతుంది. అయితే కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.

Advertisement

Telangana Election Results 2023: రేవంత్‌రెడ్డితో భేటీ అయిన కొద్ది సేపటికే డీజీపీ అంజనీకుమార్‌ సస్పెండ్‌, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే కలవడంపై ఈసీ సీరియస్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్‌ చేసినట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే అధికారికంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో సంప్రదింపులు జరపడమే అంజనీకుమార్‌ సస్పెన్షన్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Telangana Election Results 2023: రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఈ రోజు రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు సోమవారం ఉంటుందని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి.

Telangana Election Results 2023: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా, OSD ద్వారా రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసైకి పంపించిన బీఆర్ఎస్ అధినేత

Hazarath Reddy

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. కేవలం రెండు వాహనాల్లోనే రాజ్‌భవన్‌కు చేరుకుని కేసీఆర్ రిజైన్ లెటర్‌ను అందించారు.తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

PM Modi on Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ, తెలంగాణతో మా బంధం విడదీయరానిదంటూ ట్వీట్

Hazarath Reddy

నా ప్రియమైన తెలంగాణా సోదరులారా..తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా, ఈ మద్దతు పెరుగుతోంది మరియు రాబోయే కాలంలో కూడా ఈ ధోరణి కొనసాగుతుంది.తెలంగాణతో మా బంధం విడదీయరానిదని, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం.ప్రతి బీజేపీ కార్యకర్త చేస్తున్న కృషిని కూడా నేను అభినందిస్తున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement