తెలంగాణ

Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, గులాబీ తీర్థం పుచ్చుకున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్న మాజీ టీడీపీ నేత

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ రోజు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

NDSA Report on Medigadda Project: మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిపోవడంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇదిగో, పునాదుల కింద ఇసుక కుంగిపోవడం వల్లే..

Hazarath Reddy

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిమీద విచారణ చేపట్టిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ తన నివేదికను శుక్రవారం సమర్పించింది.డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(NDSA) నిర్ధారించింది.

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేసిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు

Hazarath Reddy

వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటున్నామని చెప్పారు.ఈ మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

Telangana Assembly Elections 2023: నేటి నుంచి తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, మొత్తం 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎన్నుకోవాలంటూ ఈసీ నోటిఫికేషన్

Hazarath Reddy

తెలంగాణ శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసులను అధికారులు జారీ చేస్తారు. ఆ తర్వాతి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

Advertisement

Telangana Assembly Elections 2023: ఇవేం బూతులు బాబోయ్, మంత్రి మల్లారెడ్డి,హరీష్ రావులను మైనంపల్లి హన్మంతరావు ఎలా తిడుతున్నాడో వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ కేటాయించలేదని బీఆర్ఎస్‌ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజిగిరి, కుమారుడు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

Goodnews for US Visa: యూఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన వెయిటింగ్ టైమ్.. 2.5 లక్షల నాన్‌ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌ మెంట్లు ఓపెన్

Rudra

అగ్రరాజ్యం అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం సాధారణంగా చాలా ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే అలా ఎదురుచూస్తున్న భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం గుడ్‌ న్యూస్ చెప్పింది.

Telangana Elections: సీఎం కేసీఆర్‌ పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ.. కాయితీ లంబాడీలు 1,016 నామినేషన్లు.. కామారెడ్డిలో ఆసక్తికర రాజకీయం

Rudra

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు గురువారం వెల్లడించారు.

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన సీపీఎం, 17 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం బైబై చెప్పి ఒంటరి పోరుకు సిద్ధమైంది. 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.తాజాగా 17 మందితో కూడిన సీపీఎం అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం గురువారం ప్రకటించారు.

Advertisement

Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, బీజేపీని తెలంగాణాలో ఒక్క సీటు కూడా గెలవనియ్యం, ఆ స్థానాల్లో బీజేపీని ఓడించే బలమైన పార్టీకి ఓటు వేస్తామని తెలిపిన తమ్మినేని వీరబద్రం

Hazarath Reddy

బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న ప్రతీ సీటును ఓడించడం మా లక్ష్యం. బీజేపీ ఓడిపోయే సీట్లలో ఎవరు ఓడించే వారైతే వాళ్లకు ఓటు వేస్తాం. అది కాంగ్రెస్ అయినా బీఆర్‌ఎస్‌ అయినా’ అని తమ్మినేని పేర్కొన్నారు. వీడియో ఇదిగో..

Telangana Assembly Election 2023: ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రుణ మాఫీ డబ్బులు ఇప్పుడే వేస్తాం, సీఎం కేసీఆర్ వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎన్నికల కోడ్ వల్ల రైతు రుణ మాఫీ ఆగింది.. కాంగ్రెస్ నాయకులు ఆపాలని ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే రుణ మాఫీ ఇప్పుడే వేస్తం. లేదంటే ఎన్నికలు అయిన తర్వాత మరునాడు నుండే రుణ మాఫీ డబ్బులు అకౌంట్లో వేస్తాం - సీఎం కేసీఆర్

Chandrababu Health Update: ఏఐజీ ఆస్పత్రిలో చేరిన చంద్రబాబు, టీడీపీ అధినేతకు వైద్య పరీక్షలు పూర్తి

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఆయన బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఏఐజీ వైద్యుల బృందం చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది.

Telangana Assembly Election 2023: ఆందోల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బాబూ మోహన్ పోటీ, 35 మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ మూడో జాబితా ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 35 మంది అభ్యర్థులతో మూడో జాబితా విడుదల చేసింది. అంతకుముందు రెండు జాబితాల్లో 53 మందిని బీజేపీ ప్రకటించింది. ముగ్గురు ఎంపీలు కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

Advertisement

Telangana Shocker: భార్యతో వివాహేతర సంబంధం, సీఐ మర్మాంగాలు కోసేసిన కానిస్టేబుల్, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌, సీఐపై దాడికి పాల్పడ్డాడు. అతని మర్మాంగాలు కోసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.

Telangana Assembly Elections 2023: చంద్రబాబు ర్యాలీ నిర్వాహకులకు హైదరాబాద్ పోలీసులు షాక్, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదు

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కేసు నమోదైంది.

IT Raids in Hyderabad: కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఐటీ దాడులు, మహేశ్వరం టికెట్ కోసం కోట్లు ఇచ్చారన్న ఆరోపణలతో దాడులు ముమ్మరం, కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇంట్లోనూ తనికీలు

VNS

కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డికి (Parijatha Nasimhareddy) చెందిన బాలాపూర్ లోని నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. బడంగ్పేట్ మేయర్ గా ఉన్న పారిజాత కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం (Maheswaram) నియోజకవర్గం టికెట్ ఆశించారు. అదేవిధంగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎల్ఆర్ (KLR) నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Prabhakar Reddy Attack Case: కొత్త ప్రభాకర్‌రెడ్డి హత్యాయత్నం కేసు, నిందితుడికి 14 రోజులు రిమాండ్, మీడియాకు వివరాలను అందించిన సీపీ శ్వేత

Hazarath Reddy

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ( MP Prabhakar Reddy )పై ఈ నెల 30వ తేదీ రోజున సూరంపల్లిలో కత్తితో నిందితుడు రాజు దాడి చేసిన సంగతి విదితమే. ఈ కేసుపై సీపీ శ్వేత ( CP Swetha ) సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మీడియాకు వివరాలను అందజేశారు

Advertisement

Telangana Assembly Elections 2023: సన్నాసి అంటూ డీకే శివకుమార్‌పై సీఎం కేసీఆర్ ఫైర్, ఇల్లందు బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోస‌మే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల కోస‌మే పోరాడే పార్టీ అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

Telangana Assembly Elections 2023: దళిత బంధు తెచ్చిన మొగోడు ఎవరైనా ఉన్నారా? సత్తుపల్లి బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ,ప్రతీసారీ దళితులు మోసానికి గురయ్యారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు

Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఎర్ర‌వల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌‎లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో ఈ యాగానికి ఈ రోజు అంకురార్పణ జరిగింది

Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, డబల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సెటైర్

Hazarath Reddy

డబుల్ రోడ్ వస్తే తెలంగాణ.. సింగల్ రోడ్ వస్తే ఆంధ్రప్రదేశ్ అంటూ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రోడ్లపై సెటైర్ వేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకొని తెలంగాణ విడిపోతే కటిక చీకటి అవుద్ది అన్నాడు. ఇప్పుడు మన దగ్గర వెలుగు జిలుగులు ఉన్నాయి.. మనల్ని శపించినోళ్లు చీకట్లో ఉన్నారు అంటూ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement