తెలంగాణ

Telangana: తెలంగాణ సచివాలయం ముందున్న తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహలను తొలగించిన అధికారులు, మండిపడుతున్న భాషాభిమానులు

Hazarath Reddy

హైదరాబాద్‌లో నూతన సచివాలయం ముందున్న తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహలను అధికారులు తొలగించారు. ఈ తొలగింపు వివాదాస్పదంగా మారింది. కొత్త సచివాలయం ఏర్పాటు సందర్భంగా రోడ్డు వెడెల్పులో భాగంగా విగ్రహాలను తొలగించారు.

Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు, దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని వాదనలు, హైకోర్టు మద్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వివేకా కూతురు

Hazarath Reddy

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కరరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని భాస్కరరెడ్డి, కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

Hyderabad Student Died In London: ఇంగ్లాండ్‌లో హైదరాబాద్‌ యువతి మృతి, సరదాకోసం బీచ్‌కు వెళ్లి అలల్లో చిక్కుకున్న సాయితేజస్వీ రెడ్డి, మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకువచ్చేందుకు యత్నాలు

VNS

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి చెందిన ఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది. ఇంగ్లాండ్ లో తెలంగాణ యువతి మృతి చెందారు. లండన్ లోని బీచ్ లో హైదరాబాద్ కు (Hyderabad Student ) చెందిన విద్యార్థిని కె. సాయి తేజస్విని రెడ్డి (Sai Tejaswini Reddy) మరణించారు.

Medico Preethi Case: మెడికో ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం, నిందితుడు సైఫ్‌కు బెయిల్, 16 వారాల పాటూ కోర్టుకు రావాలంటూ కండీషన్, సాక్ష్యాలు తారుమారు చేస్తే బెయిల్ రద్దే

VNS

తెలంగాణలో సంచలనం రేపిన వరంగల్ ఎంజీఎం డాక్టర్ ప్రీతి మృతి కేసులో (Medico Preethi Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సైఫ్ కు కోర్టు బెయిల్ (Bail For Saif) మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. 10 వేల రూపాయలు ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

Advertisement

Migrant Workers in Iraq: స్వదేశానికి వెళ్లాలంటే లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సిందే, వలస కార్మికులకు షాకిచ్చిన ఇరాక్ ప్రభుత్వం

Hazarath Reddy

పొట్ట కూటి కోసం ఇరాక్‌ వెళ్లిన వలస ​కార్మికులకు ఇరాక్ ప్రభుత్వం షాకిచ్చింది. కార్మికుల అకామ (రెసిడెన్సీ కార్డు) గడువు ముగిసిపోవడంతో తిరిగి స్వదేశానికి వెళ్లాలంటే 1500 డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Beer Sales in Hyderabad: మందుబాబులా మజాకా, 17 రోజుల్లో కోటి రూపాయల బీర్లు తాగేసిన హైదరాబాదీలు, ఏప్రిల్ నెలలో అమాంతం పెరిగిన బీర్ల అమ్మకాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో బీర్లు మంచి నీళ్ల మాదిరిగా అమ్ముడుపోతున్నాయి. అసాధారణంగా పెరుగుతున్న ఎండలతో మందుబాబులు బీర్లను అమాంతం తాగేస్తున్నారు. ఫలితంగా ఏప్రిల్ నెలలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

Booster Dose Distribution: తెలంగాణలో కరోనా బూస్టర్ డోసుగా కార్బెవాక్స్, పెరుగుతున్న కరోనా కేసులతో కీలక నిర్ణయం, గతంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ తీసుకున్నవారికి కూడా బూస్టర్ డోసుగా కార్బెవాక్స్

VNS

రోనా మహమ్మారి (Corona Cases) మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ బూస్టర్ డోస్ (Booster dose) పంపిణీకి సిద్ధమైంది. రాష్ట్రంలో బుధవారం నుంచి కోవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం కానుంది.

IPL 2023 :ఉప్పల్ స్టేడియంలో తాగుబోతుల హంగామా.. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ

kanha

ప్పల్ స్టేడియంలో తాగుబోతులు హంగామా చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మద్యం మత్తులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, తోటి ప్రేక్షకులతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Vivekananda Reddy Murder Case: హైకోర్టులో అవినాష్‌రెడ్డికి ఊరట, ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని సీబీఐకి కోర్టు ఆదేశాలు, గంటన్నరకు పైగా సాగిన వాదనలు

Hazarath Reddy

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనల తర్వాత.. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Telangana Shocker: ముసలి వయసులో సేవ చేయాల్సి రావడంతో, కన్నతల్లిని దారుణంగా చంపిన కొడుకు, ఎవరికి తెలియకుండా రాత్రి పూట ఖననం, పోలీసుల అదుపులో కసాయి కొడుకు

Hazarath Reddy

కని పెంచిన తల్లికి సపర్యలు చేయలేక ఓ కసాయి కొడుకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా పూడ్చి పెట్టాడు. పైగా తన తల్లి కనబడటం లేదంటూ పోలీసులుకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం బయటపెట్టడంతో జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

Srinivasa Rao Comments: అంతా తాయత్తు మహిమ, డాక్లర్లకేమి తెలుసు, తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్‌ శ్రీనివాస్‌ అన్నారు. కొత్తగూడెం ఇఫ్తార్‌ విందులో తాయత్తు గురించి ప్రస్తావించారు.

Telangana: జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో దారుణం, డెలివరీ సమయంలో మహిళ కడుపులో గుడ్డను వదిలేసిన డాక్టర్లు, 16 నెలల తర్వాత కడుపునొప్పితో ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

జగిత్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ వదిలేశారు. 16 నెలల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళకు డెలివరీ చేశారు.

Advertisement

Telangana Shocker: అత్తతో రోజంతా లాడ్జిలో అల్లుడు, మరుసటి రోజు అత్త అనుమానాస్పద మృతి, అల్లుడే గొంతు నులిమి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

Hazarath Reddy

ఖమ్మం జిల్లా భద్రాచలం పట్టణంలో ఆదివారం ఓ లాడ్జిలో ఓ పెళ్లయిన మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆ మహిళను ఆమెకు అల్లుడు వరసయ్యే ఆంజనేయులు హత్య చేసినట్లు సోమవారం అరుణ కుటుంబ సభ్యులు భద్రాచలం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు

Hyderabad Child Rape Case: చిన్నారిపై అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు, బంజారాహిల్స్‌ స్కూల్‌లో కిడ్‌పై తెగబడిన డ్రైవర్

Hazarath Reddy

హైదరాబాద్ బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాలలో స్కూలుకు వెళుతున్న ఐదేండ్ల బాలికపై లైంగిక దాడి కేసులో డ్రైవర్‌ రజినీకుమార్‌ను నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు దోషిగా తేల్చింది.ఈ కేసులో అతనికి 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది.

Annavaram Online Services: అందుబాటులోకి అన్నవరం దేవస్థానం ఆన్‌లైన్ సేవలు.. స్వామి వారి ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను ముందుగానే బుక్ చేసుకునే వెసులుబాటు

Rudra

అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఆన్‌లైన్ సేవలు ప్రారంభించింది. వీటి ద్వారా భక్తులు స్వామి వారి ప్రత్యక్ష, పరోక్ష సేవలు అంటే.. వ్రతాలు, కల్యాణాలు, హోమాలు, ఇతర పూజలు, దర్శనాలు, ప్రసాదం, కల్యాణకట్ట, అన్నదానం టికెట్లు, వసతి గదులు, కల్యాణ మండపాల బుకింగ్ వంటి వాటిని ముందుగానే చేసుకోవచ్చు.

Weather Forecast: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో మూడు రోజుల పాటు సాయంత్రం పూట వర్షాలు, పగలంతా ఎండలు కాస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో మూడు రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. ఈదురు గాలులతో పాటు వడగండ్ల వాన సైతం కురవొచ్చని తాజా బులిటెన్‌లో తెలిపింది.

Advertisement

Hyderabad Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌లో వడగండ్ల వాన, ఈదురు గాలులతో కూడిన వర్షంతో వణికిన భాగ్య నగరం, తెలంగాణలోనూ పలు చోట్ల వర్ష ప్రభావం

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, నాంపల్లి, కోఠి ఇలా పలు ప్రాంతాల్లో.. భారీ వర్షం పడింది.

Vivekananda Reddy Murder Case: అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌తో పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు.. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న విచారణ

Rudra

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణ దూకుడుగా సాగుతున్నది. విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ (CBI) నుంచి నోటీసులు (Notices) అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) హైదరాబాద్ (Hyderabad) పయనమయ్యారు.

Record Temperature In Telangana: తెలంగాణలో అసాధారణంగా పెరుగుతున్న ఎండలు.. మరో మూడు రోజులు ఇలాగే ఉంటాయంటూ వాతావరణశాఖ వెల్లడి.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.. ఎండవేడితో నిర్మల్ జిల్లా భగభగ.. దస్తూరాబాద్‌ మండలంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..

Rudra

తెలంగాణలో (Telangana) ఎండలు భగభగమంటున్నాయి. నిర్మల్ (Nirmal) జిల్లాలోని దస్తూరాబాద్‌ మండలంలో ఏకంగా 44.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత (Temperature) ఇదే.

YS Viveka Case: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు.. భాస్కర్‌ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలింపు

kanha

మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్యకేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ విధిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. రిమాండ్ అనంతరం భాస్కర్‌ రెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు.

Advertisement
Advertisement