తెలంగాణ

Karimnagar Minister Gangula Kamalakar: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌కు తప్పిన ప్రమాదం.. కుప్పకూలిన వేదిక, ఒక్కసారిగా కింద పడ్డ మంత్రి

kanha

కరీంనగర్‌: మంత్రి గంగుల కమలాకర్‌కు తప్పిన ప్రమాదం.. చెర్లబూట్కూర్ గ్రామంలో ఓ కార్యక్రమంలో కుప్పకూలిన వేదిక... ఒక్కసారిగా కింద పడ్డ మంత్రి సహా ఇతర కార్యకర్తలు.. స్వల్ప గాయాలు కావడంతో ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

Vivekananda Reddy Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి అరెస్ట్.. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించిన సీబీఐ

Rudra

మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక ముందడుగు పడింది. కేసు విచారణలో ఇటీవల దూకుడు పెంచిన సీబీఐ ఈ తెల్లవారుజామున వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది.

Fire Accident In Hyderabad: కుషాయి గూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం

Rudra

హైదరాబాద్ లోని కుషాయిగూడ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. కట్టెల మండీలో చెలరేగిన మంటలతో కలపపూర్తిగా దహనమవ్వడంతో పాటు పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో ముగ్గురు కాలిపోయారు.

TSPSC Announced New Dates: టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ తేదీలు ఖరారు, ఏయే నియామక పరీక్షల తేదీలు విడుదలయ్యాయంటే?

VNS

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నియామక పరీక్షలకు కొత్త తేదీలు (New Exam Dates) ప్రకటించింది. ఈ నెల 23న జరగాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ASMV) ఎగ్జామ్ జూన్ 28న నిర్వహిస్తామని తెలిపింది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ మే 16కి వాయిదా పడింది. ఈ పరీక్ష ఈ నెల 25న జరగాల్సిన ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Viral Video: బీరు సీసాలో బల్లి, దెబ్బకు మందు బాబుకు వదిలిన మత్తు..వరంగల్ లో జరిగిన వింత ఘటన, వీడియో వైరల్

kanha

వరంగల్ - ఖానాపూరంలో బీరులో బీరులో బల్లి అవశేషాలు. మద్యం దుకాణం యజమానిని విషయాన్ని అడగగా, షాప్ వాళ్లు ఇదంతా సర్వసాధారణమని తెలిపారంటూ బాధితులు తెలిపారు.

Minister Mallareddy: మంత్రి మల్లారెడ్డి మాట ఐటీ మంత్రి కేటీఆర్ నోట..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

kanha

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పై ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నేడు ఓ సభలో నవ్వులు పూయించాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయినటువంటి మంత్రి మల్లారెడ్డి డైలాగ్ పాలమ్మాను… పూలమ్మాను.. అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు మంత్రి కేటీఆర్ నోటా వినిపించాయి.

Drone Over Srisailam Temple: శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం.. ఆలయంపై ఆకాశంలో డ్రోన్ చక్కర్లు.. సత్రాలపై కూడా ఎగిరిన డ్రోన్.. డ్రోన్ ఎగరేసిన వ్యక్తుల కోసం భద్రతా సిబ్బంది గాలింపు

Rudra

దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలం దేవస్థానంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం రేపింది. ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో దేవస్థానం సిబ్బంది అవాక్కయ్యారు.

JEE Main Result 2023: 29న జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల.. నేటితో ముగియనున్న చివరి విడత మెయిన్ పరీక్షలు

Rudra

జేఈఈ మెయిన్ ఫలితాల(JEE Main Result 2023) పై తాజాగా ఓ అప్టేట్ వచ్చింది. ఈనెల 29వ తేదీన ఆ ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడత మెయిన్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎగ్జామ్స్ శనివారంతో ముగియనున్నాయి.

Advertisement

Rains In Telangana: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు.. వాతావరణ శాఖ బులెటిన్

Rudra

గత రెండు రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలను అతలాకుతలం చేసిన వానలు వచ్చే రెండు రోజుల పాటు కొనసాగవచ్చు. ఈ మేరకు రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Adulterated Ice Creams: సమ్మర్ అని ఐస్‌క్రీమ్స్ తెగ లాగించేస్తున్నారా? పైన బ్రాండెడ్ స్టిక్కర్, లోపల నకిలీ ఐస్‌క్రీమ్, హైదరాబాద్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ ముఠా గుట్టురట్టు

VNS

నాసిరకం ఐస్ క్రీమ్స్ తయారీ (Adulterated Ice Creams) దందా బయటపడింది. చందానగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా నాసిరకం ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అక్కడ జరుగుతున్న తంతు చూసి పోలీసులే షాక్ తిన్నారు. పైకేమో బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్.. లోపలేమో నాసిరకం సరుకు..

Ambedkar Statue in Hyd: హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం, ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ఆవిష్కరించిన తెలంగాణ సీఎం కేసీఆర్

Hazarath Reddy

హుస్సేన్‌ సాగర్‌ తీరాన 125 అడుగుల అంబేద్కర్‌ మహావిగ్రహావిష్కరణ జరిగింది. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. బౌద్ధ గురువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Hyderabad Shocker: ఇంట్లోకి దూరి యువతిపై మాజీ ప్రియుడు దారుణం, బట్టలు చింపి కింద పడేసి అత్యాచారయత్నం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడమే కాకుండా లైంగికదాడికి యత్నించాడంటూ మాజీ బాయ్‌ ఫ్రెండ్‌పై ఓ యువతి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు నిందితుడిని గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Hyderabad Horror: చందానగర్‌లో దారుణం, భార్యను రోడ్డు మీద వెంబడించి కత్తితో నరికి చంపిన భర్త, అనుమానంతోనే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణ

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని చందానగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను రాయితో అతి కిరాతకంగా కొట్టి హత్య చేశాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి మూడోసారి కరోనా.. నిన్ననే పుణె నుంచి హైదరాబాద్ వచ్చిన పోసాని.. అస్వస్థతగా ఉండటంతో కరోనా పరీక్షలు.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు

Rudra

నటుడు పోసాని కృష్ణ మురళికి కరోనా సోకింది. దాంతో ఆయన్ను హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. పూణేలో జరిగిన షూటింగ్‌లో పాల్గొని నిన్ననే హైదరాబాద్‌కు వచ్చిన పోసాని కృష్ణ మురళికు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కాగా పోసానికి కరోనా పాజిటివ్‌ రావడం ఇది మూడోసారి.

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షం.. మణికొండ, షేక్ పేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌ లో వర్షం బీభత్సం.. మరో మూడు రోజుల పాటు వానలు

Rudra

హైదరాబాద్ నగర వ్యాప్తంగా నేటి ఉదయం నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. మణికొండ, షేక్ పేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం.. ఇటు టోలిచౌకి, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో వర్షం కురుస్తోంది.

Ambedkar Jayanti Telugu Quotes: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు గ్రీటింగ్స్ తెలుగులో, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దాం

Rudra

ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు, సంఘ సంస్కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి నేడు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఈ కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేయండి.

Advertisement

Ambedkar Statue Unveiling Today: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నేడు బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ.. హైదరాబాద్‌లో పండుగ వాతావరణం

Rudra

బహుజనుల కోసం జీవితాంతం కృషి చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, తత్వవేత్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కంచు మహా విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు.

Telangana: ఆ చంద్రశేఖర్‌ ఎవరో నాకు తెలియదు, వాట్సాప్‌ ఛాటింగ్‌ ప్రచారంపై స్పందించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు

Hazarath Reddy

సుఖేష్‌ చంద్రశేఖర్‌ వాట్సాప్‌ ఛాటింగ్‌ ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీఆర్‌ఎస్‌పై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతోందని, కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై దాడికి దిగారని కవిత ట్విటర్‌ ద్వారా కౌంటర్‌ఎటాక్‌కి దిగారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.

Hyderabad Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్‌ను ముంచెత్తిన అకాల వర్షం, ఈదురు గాలులతో వాన, పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షంతో తడిసి ముద్దయ్యింది. గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది.

Alleti Maheshwar Reddy Joins BJP: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అధికారికంగా బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్‌ మహేశ్వర్‌రెడ్డికి కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

Advertisement
Advertisement