తెలంగాణ

Kondagattu Temple Burglary Case: కొండగట్టు అంజన్న బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు వీళ్లే, అరెస్ట్ చేసిన జగిత్యాల పోలీసులు, కేసు వివరాలు నేడో రేపో వెల్లడించే అవకాశం

Hazarath Reddy

తెలంగాణలో ప్రముఖ ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. సదరు దొంగను కర్నాటకలోని బీదర్‌లో పట్టుకున్నారు. వీరంతా మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ సమీపంలోని ఓ తండాకు చెందిన గ్యాంగ్‌గా గుర్తించారు.

MMTS Trains Cancelled: అలర్ట్ న్యూస్, నేడు 19 ఎంఎంటీఎస్‌ల రద్దు, పనిదినాల్లో సర్వీసుల రద్దుపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు, రద్దయిన రైళ్ల జాబితా ఇదే..

Hazarath Reddy

ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసుల రద్దు కొనసాగుతోంది. వారం రోజులుగా సర్వీసులను రద్దు (MMTS Trains Cancelled) చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది. నేడు మరికొన్ని ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయినట్టు (Cancellation of MMTS Train Services) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది

Medico Preethi Died: మెడికో ప్రీతి మృతి.. మొత్తంగా కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. వీడియోతో

Rudra

వరంగల్‌ ఎంజీఎంలో సీనియర్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ పీజీ విద్యార్థిని ప్రీతి మరణించింది. కాగా, ప్రీతి కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అండగా నిలిచారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 లక్షల పరిహారానికి తోడు ఆయన కూడా రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు.

Medico Preethi Died: ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి మృతి, ఆమెకు సైఫ్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాడంటూ కుటుంబ సభ్యుల సంచలన ఆరోపణ

VNS

వరంగల్‌ (Warangal) ఎంజీఎం (MGM)లో సీనియర్‌ వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ పీజీ విద్యార్థిని ప్రీతి మరణించింది. నిమ్స్‌ (NIMS)లో చికిత్స పొందిన ఆమె పరిస్థితి రోజు రోజుకూ దిగజారింది. దాంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ప్రీతి ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసినట్లు డాక్టర్లు తెలిపారు.

Advertisement

Viral Video: పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిన 19 ఏళ్ల యువకుడు, రెప్పపాటులోనే గుండెపోటుతో కన్నుమూత, నిర్మల్ జిల్లాలో ఘటన, వీడియో ఇదుగోండి!

VNS

అప్పటిదాకా డ్యాన్స్ చేసిన అతడు.. ఉన్నట్టుండి ఆగిపోయాడు. అలానే కిందికి పడిపోయాడు. దాంతో అక్కడున్న వారు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ యువకుడు చనిపోయాడని తెలిసి అంతా షాక్ తిన్నారు. కాగా, యువకుడి మృతికి గుండెపోటే (Heart Attack) కారణం అని తెలుస్తోంది.

Peddapalli Shocker: అయిదేళ్లుగా కడుపులోనే కత్తెర.. పెద్దపల్లిలో వైద్యుల నిర్వాకం

Rudra

పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ ప్రసవం కోసం 2017లో గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యుడు కత్తెరను మాత్రం బాధితురాలి కడుపులోనే మర్చిపోయాడు. ఆ తర్వాత..

US Student Visa: కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు.. విద్యార్థులకు ఉపయోగకరంగా అమెరికా నూతన వీసా విధానం

Rudra

అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు శుభవార్త. అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా కల్పించింది.

PG Medico Suicide Attempt Case: వైద్య విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం కేసులో పురోగతి, నిందితుడికి 14 రోజులు రిమాండ్‌ విధించిన కోర్టు, ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడిన పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు

Advertisement

Telangana EAMCET 2023: ఫిబ్రవరి 28న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్, మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్, తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌ న్యూస్..తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 3 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరణ ఉంటుంది.ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 30గా నిర్ణయించారు.

Telangana: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో రెండు విగ్రహాలు చోరీ, విలువైన వెండి వస్తువులు ఎత్తుకుపోయిన దొంగలు, ఆలయాన్ని మూసివేసి విచారణ జరుపుతున్న పోలీస్ అధికారులు

Hazarath Reddy

కొండగట్టు ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంలో (Kondagattu Anjaneya Swamy temple) రెండు విగ్రహాలు చోరికి గురయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులు దొంగిలించినట్లు (stole around 15 kilograms of silver objects) సమాచారం.

Traffic Police Save Life: వీడియో ఇదిగో..రోడ్డు మీద వెళుతుండగా యువకుడికి గుండెపోటు, సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్

Hazarath Reddy

రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటు రాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సిపిఆర్ చేసి ప్రాణం కాపాడాడు. ఇప్పుడు బాలరాజు సురక్షితంగా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Constable Dies in Gym: జిమ్‌లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి, హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన

Hazarath Reddy

హైదరాబాద్‌లో జిమ్‌ చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్‌ కానిస్టేబుల్ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు.వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బోయిన్‌పల్లికి చెందిన కానిస్టేబుల్ పేరు విశాల్ 2020 బ్యాచ్ కాగా.. ఆసిఫ్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

Tirumala Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. మార్చి నెల రూ. 300 టికెట్ల ఆన్‌లైన్ కోటా ఈ ఉదయం 10 గంటలకు విడుదల.. నేటి సాయంత్రం శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లు

Rudra

తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Telangana Kanti Velugu: 50 లక్షల మార్కుకు చేరుకున్న కంటి వెలుగు, 1.5 కోట్ల మందికి కంటి ప‌రీక్ష‌లు నిర్వహించే లక్ష్యంతో దూసుకెళ్తున్న కేసీఆర్ సర్కారు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన రెండో విడ‌త కంటి వెలుగు (Telangana Kanti Velugu) కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. గడిచిన 25 రోజుల పని దినాల్లో కంటి వెలుగు ప‌రీక్ష‌లు నేటికి 50 లక్షల మార్కుకు చేరుకున్నది.

Stray Dog Attack: అంబర్ పేట ఘటన మరువక ముందే మరో ఘటన, రోడ్డుపై పోతున్న వారిని ఇష్టమొచ్చినట్లుగా కరుచుకుంటూ పోయిన వీధి కుక్క, 10 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

అంబర్ పేట వీధి కుక్కల దాడి ఘటన మరువక ముందే మరో ఘటన (Stray Dog Attack) చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో గురువారం ఉదయం ఓ వీధి కుక్క మనుషులపై దాడికి పాల్పడింది. ఏకంగా పది మందిని (Stray dog bites 10 persons) తీవ్రంగా గాయపరిచింది.

Dog Attack Boy Case: వీధి కుక్కల దాడిపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్, నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ, జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని మండిపడిన హైకోర్టు

Hazarath Reddy

అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

TSRTC: లారీ కిందకు దూసుకెళ్లిన యువతి, తృటిలో చావు నుంచి తప్పించుకున్న వైనం, రోడ్డు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Hazarath Reddy

తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఓ వీడియోని ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ వీడియోలో ట్రాఫిక్‌ జామ్‌లో ఓ యువతి లేన్‌ని క్రాస్‌ చేసి లారీ ముందుకు తన ద్విచక్ర వాహనాన్ని ఆపుతుంది. అంతలో వెనుక ఉన్న లారీ ముందుకు కదిలింది.

Bomb Threat Call: బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టారంటూ పోలీసులకు బెదిరింపు కాల్, నిందితుడు అరెస్ట్, బూటకపు కాల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ | బళ్లారి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు నిన్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. రైలును క్షుణ్ణంగా శోధించగా అది బూటకపు కాల్ అని తేలింది.దీనిపై కేసు నమోదు చేశామని సికింద్రాబాద్ జీఆర్పీ ఎస్పీ అనురాధ తెలిపారు.

RGI Airport: బూట్ల కింద 15 కిలోల బంగారం పెట్టుకొచ్చారు, శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన నిందితులు, దాని విలువ దాదాపు రూ.8 కోట్లుపై మాటే..

Hazarath Reddy

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని భారీగా స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు, దాని విలువ దాదాపు రూ. 8 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు.

Junior Doctor Attempts Suicide: పీజీ విద్యార్థిని ఆత్మహత్యకు కారణం అతడే, అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, విషమంగా ప్రీతి ఆరోగ్యం,ఐదు గంటలు గడిస్తే కాని చెప్పలేమంటున్న వైద్యులు

Hazarath Reddy

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో అనస్తీషియా విభాగంలోని పీజీ వైద్యురాలు ఈ రోజు తెల్లవారుజామున విధుల్లో ఉండగా హానికరమైన ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి(Junior Doctor Attempts Suicide) పాల్పడిన సంగతి విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతోంది.

Advertisement
Advertisement