తెలంగాణ

Actor Mohan Babu: తన ఫోటోలు, వాయిస్‌ ను గూగుల్‌ లో, సోషల్ మీడియాలో వాడొద్దని కోర్టుకు మోహన్ బాబు.. తొలగించాలని తీర్పునిచ్చిన న్యాయస్థానం

Rudra

ఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలిచిన నటుడు మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. తన ఫోటోలు, వాయిస్‌ ను గూగుల్‌ లో, సోషల్ మీడియాలో వాడొద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని అందులో అభ్యర్థించారు.

Road Accidents in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నెత్తురోడిన రహదారులు.. రెండు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం.. నల్గొండ జిల్లా దేవరకొండలో ముగ్గురు.. స‌త్య‌సాయి జిల్లాలో నలుగురు మృతి

Rudra

రోడ్డు ప్రమాదాలతో తెలుగు రాష్ట్రాలలోని రహదారులు శనివారం తెల్లవారుజామున నెత్తురోడాయి. రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తంగా ఏడుగురు మరణించగా పలువురు గాయపడ్డారు.

Fire Accident In Software Company: హైదరాబాద్ లోని సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ఉద్యోగులు (వీడియో)

Rudra

హైదరాబాద్ మాదాపూర్‌ లో ఉన్న ఓ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇనార్బిట్‌మాల్‌ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఈ ఘటన జరిగింది.

Rains Alert for Hyderabad: హైద‌రాబాద్ లో మారిన వాతావ‌ర‌ణం, న‌గ‌ర వాసుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఐంఎడీ, అక్క‌డ‌క్క‌డ చిరు జ‌ల్లులు కురిసే అవ‌కాశం

VNS

బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గ్రేటర్ హైద‌రాబాద్‌లో (Hyderabad Rains) రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(IMD Hyderabad) అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరిగి, చలి తీవ్రత (Cold Wave) తగ్గింది.

Advertisement

Case on KTR: కేటీఆర్ పై మ‌రో కేసు న‌మోదు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రంగంలోకి దిగిన ఈడీ

VNS

ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ (Formula E Car Race) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై ఏసీబీ (ACB) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్‌ (ECIR) నమోదు చేశారు.

Traffic Restrictions In Hyderabad:హైద‌రాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్లో వెళ్లేవారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు సూచించిన పోలీసులు

VNS

ఎల్బీస్టేడియంలో శనివారం సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మ‌స్‌ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాలలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic Restrictions) విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

Viral Video: పిల్లి నాకిన పిండితో పరోటాలు, హైదరాబాద్ బండ్లగూడలోని ఓ హోటల్‌ నిర్వాకుడి ఘనకార్యం...వీడియో

Arun Charagonda

పిల్లి నాకిన పిండితో పరోటాలు... హైదరాబాద్-బండ్లగూడలోని ఓ హోటల్‌లో నిర్వాకం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓవైపు పరోటా పిండిని పిల్లి నాకుతుంటే, అదే పిండితో పరోటాలు చేశాడు హోటల్ నిర్వాహకుడు. కస్టమర్ తీసిన వీడియో ద్వారా విషయం బయటకు రాగా వైరల్‌గా మారింది.

Formula E Race Case: వీడియో ఇదిగో, తెలంగాణ ప్రభుత్వం మీద లండన్‌లో ఫార్ములా-ఈ కంపెనీ కేసు వేసింది, హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం మీద లండన్‌లో ఫార్ములా-ఈ కంపెనీ కేసు వేసిందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్థాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగిందని ఫార్ములా- ఈ వాళ్లు లండన్‌లో కేసు వేశారు.. రేపు వాళ్ళు అక్కడ కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం.

Advertisement

Hyderabad: పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనిబీటెక్ విద్యార్థి మృతి...ఒకరికి తీవ్ర గాయాలు

Arun Charagonda

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి బీటెక్ విద్యార్థి మృతి చెందారు. హైదరాబాద్ - పంజాగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీ పై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అతివేగంతో ఢీకొని అక్కడి నుంచి పరారయ్యాడు ప్రైవేట్ ట్రావెల్ బస్సు. లోకేష్ అనే 20 సంవత్సరాల బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక విద్యార్థికి తీవ్ర గాయాలు. అయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Relief For KTR: హైకోర్టులో కేటీఆర్‌కు రిలీఫ్, ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశించిన న్యాయస్థానం...తదుపరి విచారణ 27కు వాయిదా

Arun Charagonda

తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు ఊరట లభించింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందేనని..తదుపరి విచారణ 27 కు వాయిదా వేసింది హైకోర్టు.

Viral Video: పాల ప్యాకెట్ల దొంగ...హైదరాబాద్ మణికొండలో షాకింగ్ దొంగతనం, పాల ప్యాకెట్లు- పేపర్లు దొంగతనం...వైరల్ వీడియో

Arun Charagonda

హైదరాబాద్ మణికొండలో షాకింగ్ దొంగతనం జరిగింది. ఓ దొంగ ఏకంగా ఆటోలో వచ్చి పూల కుండీలు ,పాల ప్యాకెట్లు, పేపర్లు దొంగలించారు. మణికొండలోని అల్కపురి కాలనీలో జరిగిన ఈ షాకింగ్ దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

KTR Lawyer Sundaram: రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు, ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ లబ్ది పొందలేదు..ఈ కేసుతో ఏసీబీకి సంబంధం లేదన్న లాయర్ సుందరం

Arun Charagonda

రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు అన్నారు కేటీఆర్ లాయర్ సుందరం. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించిన న్యాయవాది సుందరం...అసలు కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారు? చెప్పాలన్నారు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండా కేసు రిజిస్టర్ చేయడం చట్ట విరుద్దం అన్నారు.

Advertisement

Andhra Pradesh: పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్, వలవేసి పట్టుకున్న పోలీసులు..ఏకంగా 450 కేజీల గంజాయి పట్టివేత..ఇద్దరు అరెస్ట్

Arun Charagonda

ఏపీలో పుష్ప సినిమా తరహాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. అల్లూరి జిల్లా గొలుగొండలో 450 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. వ్యాన్ పైకప్పులో టార్పలిన్లతో గుట్టుగా గంజాయిని ప్యాక్ చేశారు స్మగ్లర్లు. నర్సీపట్నం డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన్‌రావు ఆధ్వర్యంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

BRS Vs Congress: అసెంబ్లీలో దాడి ఎవరు చేశారో మీరే చూడండి అంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై రచ్చ

Hazarath Reddy

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి అసెంబ్లీ సమావేశంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంశంపై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు.

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అనుచరుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉందన్నారు.

Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌ కావడానికి ప్రమాదకర స్టంట్లు, గచ్చిబౌలిలో షాకింగ్ స్టంట్...వీడియో ఇదిగో

Arun Charagonda

సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నారు యువకులు. గచ్చిబౌలి వైపు ORR వద్ద గురువారం రోజు రాత్రి ఓ యువకుడు ప్రయాణం చేస్తున్న కారులో నుండి బయటకు వచ్చి ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Formula E Case Updates: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం...తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ, FIR కాపీతో పాటు నగదు బదిలీ వివరాలను అడిగిన ఈడీ

Arun Charagonda

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు HMDA అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు కోరింది ఈడీ. దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని...అలాగే ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది ఈడీ.

TTD Action On Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలకు సిద్ధమైన టీటీడీ, దర్శనాలు- గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్

Arun Charagonda

తిరుమల శ్రీవారిని గురువారం శ్రీనివాస్ గౌడ్ దర్శించుకునన్ సంగతి తెలిసిందే. తిరుమలలో టీటీడీ అవలంభిస్తున్న వైఖరిని తప్పుబట్టారు శ్రీనివాస్ గౌడ్. తిరుమలలో దర్శనాలు, గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారు..గడచిన పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఇప్పుడు ఇరురాష్ట్రాల ప్రజలను టీటీడీ సమానంగా చూడడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

KTR: అవినీతి జరగలేదని మంత్రులే చెప్పారు...ఈ కేసు నిలబడదన్న కేటీఆర్, అందరిని తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...కేసులను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పిన కేటీ రామారావు

Arun Charagonda

ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్...ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు.

Hyderabad: హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు...సికింద్రాబాద్‌లోని పలు రెస్టారెంట్లపై దాడులు, హోటళ్లపై కేసులు నమోదు

Arun Charagonda

సికింద్రాబాద్ లోని గోల్డెన్ డ్రాగన్ రెస్టారెంట్, సర్వి రెస్టారెంట్, చిల్లిస్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అన్నిట్లో నిబంధనలకు విరుద్ధంగా ఆహారోత్పత్తులు, బొద్దింకలు, అపరిశుభ్రతను గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని హోటళ్ళపై కేసులు నమోదు చేశారు.

Advertisement
Advertisement