తెలంగాణ
Transgender for Traffic Control: హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు.. ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారులకు ఆదేశం
Rudraహైదరాబాద్ లో ట్రాఫిక్ నిత్యనరకంగా మారిపోయింది. హోంగార్డుల తరహాలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
TSPSC Group 4 Provisional Selection List: తెలంగాణ గ్రూప్ -4 ఫలితాలు విడుదల,మొత్తం ఎంతమంది సెలక్ట్ అయ్యారంటే? పూర్తి వివరాలివిగో
VNSతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 4 అభ్యర్థుల కోసం ప్రొవిజనల్ ఆప్షన్ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఈ గ్రూపు 4 పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ప్రొవిజనల్ ఆప్షన్ జాబితాను చెక్ చేయాలనుకునే అభ్యర్థులు (tspsc.gov.in)లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు
Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, వాడి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డు మీద కొయ్యబోతున్నా, దిల్‌సుఖ్‌నగర్‌లో లేడీ అఘోరి హల్‌చల్...
Hazarath Reddyఒక వ్యక్తి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కొయ్యబోతున్నానంటూ తెలిపింది.దేవాలయాలపై, మహిళలపై, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరి తెలిపింది.
MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సర్‌ప్రైజ్, చిల్డ్రన్స్ డే సందర్భంగా తన వేషదారణలో వచ్చిన చిన్నారిని చూసి మురిసిపోయిన జీవన్ రెడ్డి...వీడియో ఇదిగో
Arun Charagondaజగిత్యాల జిల్లాలో చిల్డ్రన్స్ డే సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషధారణలో చిన్నారి అలరించారు. జగిత్యాల పట్టణంలోని బచ్పన్ స్కూల్ లో ముంజాల రఘువీర్ గౌడ్ కుమారుడు U కేజీ చిన్నారి వేదన్ష్ చిల్డ్రన్స్ డే వేడుకలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషధారణ ప్రదర్శన ఆకట్టుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో వేదన్ష్ కలసి తన వేషధారణ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సూచన
Arun Charagondaపదేళ్ల పైశాచిక పాలనలో BRS రైతులను మల్లన్నసగర్ గురించి అర్ధరాత్రి అరెస్టు చేశారు అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లాలో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు..కాంగ్రెస్ ప్రభుత్వం లో రేవంత్ రెడ్డి కూడా రైతులను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారు అన్నారు. మారింది కేవలం రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు అన్నారు.
Telangana Horror: సంగారెడ్డి జిల్లాలో దారుణం, అందరూ చూస్తుండగానే రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో నరికిన దుండగులు, పాతకక్షలే కారణం
Hazarath Reddyసంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుమ్మడిదల మండలం బొంతపల్లిలోని వీరభద్రకాలనీలో ఓ వ్యక్తి నడిరోడ్డుపైనే పాత కక్షలతో తల్లీకొడుకులను కత్తితో పొడిచి చంపేశాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి తల్లీకొడుకలను కత్తితో పొడిచి చంపేశాడు.
MP Dharmapuri Arvind: కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు.. అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడు, బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
Arun Charagondaబీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మీడియాతో మాట్లాడిన అరవింద్...కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదు అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడు అన్నారు. గతంలో నాపై జరిగిన దాడిలో కూడా కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు.
Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి
Arun Charagondaరాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన మీద, సోకాల్డ్ ప్రజాపాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభం అయ్యిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అనంతరం చర్లపల్లి జైల్ వద్ద మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు...మా భూముల మాకు కావాలని ఆ ప్రాంత ప్రజలు కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు పిలిచి మాట్లాడటం లేదు..గుండాలతో, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు అన్నారు.
Minister Ponnam Prabhakar: నయీం ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పొన్నం..కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసిన అధికారులు
Arun Charagondaగ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో సర్వే చేశారు. మహమ్మద్ నయీమ్ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు పొన్నం ప్రభాకర్.
Harishrao: చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి హరీశ్ రావు, ములాఖత్‌లో మాజీ ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్ పార్టీ బృందం...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిసి చర్లపల్లి జైలుకు వచ్చారు హరీశ్. ఈ సందర్భంగా పట్నంకు ధైర్యం చెప్పారు.
Telangana Shocker: సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో దారుణ హత్య... తల్లి-కొడుకును కత్తితో పొడిచి చంపిన నాగరాజు అనే వ్యక్తి...పాత కక్షలతో హత్య చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడి
Arun Charagondaసంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరభద్రనగర్ కాలనిలో తల్లి ,కొడుకును నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు నాగరాజు అనే 30 సంవత్సరాల వ్యక్తి. హంతకుడిది బీహార్ కాగా మృతులు తల్లి కొడుకు సరోజదేవి 50సం,,అనిల్ 30సం ఉత్తరప్రదేశ్ రాష్ట్రనికి చెందినవారు.
KTR: కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారని ప్రచారం?, భారీగా కేటీఆర్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు, ఎవనిదిరా కుట్ర..ఏంది ఆ కుట్ర? అని మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,నిజానికి ఉన్న దమ్మేంటో చూద్దామని సవాల్
Arun Charagondaతెలంగాణలోని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా పట్నం నరేందర్ రెడ్డి పేరును చేర్చగా మరో 20 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే లగచర్లలో కుట్రకు వ్యూహరచన చేసినట్లు పేర్కొనడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో బుక్ అయిన ట్రాఫిక్ ఏసీపీ, పోలీసులతో వాగ్వాదం...అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో
Arun Charagondaతాగి చిందులేసి పట్టుబడ్డారు ట్రాఫిక్ ఏసీపీ. హైదరాబాద్ మధురానగర్లో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్నారు ఏసీపీ. అంతేగాదు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Maharashtra: ముంబైలో సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం, ఆదిత్య ఠాక్రేతో కలిసి ఎన్నికల ప్రచారం, బాలాజీ ఆలయంలో పూజలు చేసిన రేవంత్ రెడ్డి
Arun Charagondaమహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వర్లి నియోజకవర్గంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ముందు వర్లిలోని తిరుపతి బాలాజీ ఆలయంలో పూజలు చేశారు రేవంత్ . ముంబై ప్రజల నుంచి రేవంత్‌కు ఘన స్వాగతం లభించింది.
Patnam Narender Reddy: కలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి, కస్టడీపై పిటిషన్‌పై ఇవాళ కోర్టులో వాదనలు, కలెక్టర్‌పై దాడి బయటివారి పనేనని పోలీసుల వెల్లడి
Arun Charagondaకలెక్టర్ పై దాడి కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి అని తెలిపారు ఐజీ సత్యనారాయణ. మీడియాతో మాట్లాడిన ఐజీ..దాడి ఘటనలో నరేందర్ రెడ్డి పాత్ర చాలా కీలకం అన్నారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశాం అని..ఇవాళ వాదనలు జరుగుతాయన్నారు. ఐడెంటిఫై చేసిన 42 మందిలో 19 మందికి భూమి లేదు అని తెలిపారు.
Hyderabad Car Accident: హైదరాబాద్‌లో కారు బీభత్సం, అర్థరాత్రి రెడ్ హిల్స్ రోడ్డు వద్ద పలువురిపై దూసుకెళ్లిన కారు..పోలీసుల రంగ ప్రవేశం
Arun Charagondaహైదరాబాద్‌లో బుధవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రెడ్ హిల్స్ రోడ్ వద్ద బీభత్సం సృష్టించింది షిఫ్ట్ కార్ . నీలాఫర్ కేఫ్ సమీపంలో ఉన్న వ్యక్తులపై దూసుకెళ్లగా పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
Revanth Reddy Vs KTR: తెలంగాణ రాజకీయాలు హస్తినకు...ఫార్ములా ఈ రేసు కేసులో ఢిల్లీ పెద్దల అనుమతి లభించేనా?, గవర్నర్ ఢిల్లీ టూర్ వెనుక మర్మం ఇదేనా?
Arun Charagondaతెలంగాణ రాజకీయాలు హస్తినకు చేరాయి. ఓ వైపు కేటీఆర్ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, ఆ తర్వాత గవర్నర్ వరుసగా ఢిల్లీకి చక్కర్లు కొడుతుండటంతో వాట్ నెక్ట్స్ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కీలక నేతలు, గవర్నర్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
Patnam Narender Reddy Remand Report: కలెక్టర్ పై దాడి ఘటన వెనుక కేటీఆర్ హస్తం! పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
VNSదాడి ఘటన వెనుక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఉన్నారని పట్నం నరేందర్‌రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో (remand report) పోలీసులు వెల్లడించారు. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించాం. నిందితుడు విశాల్ తోపాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో కలెక్టర్‌పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన కుట్రదారుడని తేలింది.
Animal Cruelty in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మూడు కుక్కలను విచక్షణారహితంగా కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు, కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి, వీడియో ఇదిగో...
Hazarath Reddyహైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్‌నగర్‌లో 3 కుక్కలను విచక్షణారహితంగా ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి చెందాయి.
Telangana: హైదరాబాద్ అబిడ్స్‌లో ఘరానా చోరి, కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లిన ఇద్దరు మైనర్లు...సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు
Arun Charagondaహైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గన్ ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్‌ను కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు మెనర్లు. అక్కడి నుండి వెళ్లి వాకింగ్ చేస్తున్న న్యాయవాది కళ్యాణ్ వద్ద ఉన్న సాంసంగ్ ఫోన్ కోసం కత్తితో బెదిరించారు. సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు కాగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.