Lamborghini car reportedly worth over Rs 3 crore was allegedly set on fire by unidentified persons Over some financial issues

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని లంబోర్గిని స్పోర్ట్స్​ కారును తగలపెట్టిన దుండగులు. మామిడి పల్లి పహాడిషరీఫ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో అప్పుగా ఇచ్చిన డబ్బులు చెల్లించడం లేదని విలువైన స్పోర్ట్స్​ కారును దుండగులు తగలబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నార్సింగ్‌ ప్రాంతానికి చెందిన నీరజ్ అనే వ్యాపారి రూ.3 కోట్ల విలువ కలిగిన లంబోర్ఘి అనే స్పోర్ట్స్ ​కారు‌ను సెకండ్ ​హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు. ఆ తరువాత కారును అమ్మేయాలనుకున్నాడు. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని వెనకు నుంచి తలపై గన్‌తో కాల్చిన బాలుడు, షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్

అయాన్ ​అనే వ్యక్తికి కారు విక్రయించే బాధ్యతను అప్పగించాడు. దీంతో అయాన్ తన స్నేహితుడైన హైదరాబాద్ పాతబస్తీ మొఘల్‌​పురా ప్రాంతానికి చెందిన అమన్‌ను సంప్రదించగా ఆయన కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని చెప్పాడు. అమన్‌ మిత్రుడు అహ్మద్ కారును చూసుకునేందుకు మామిడిపల్లి నుంచి శంషాబాద్ వెళ్ళే దారిలో ఉన్న తన ఫాం హౌజ్‌కు తీసుకురావాలని కోరారు. అయాన్ నీరజ్ దగ్గర నుంచి కారు తీసుకుని ఫాం హౌజ్‌కు వెళుతుండగా మార్గం మధ్యలో కారు ఆపాడు.

Here's Video

అక్కడ అహ్మద్ స్నేహితులు కొందరు కారు ఓనర్ నీరజ్ మాకు డబ్బులు ఇవ్వాలంటూ దూర్భూషలాడుతూ బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను స్పోర్ట్స్ కారుపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. అమన్ డయల్​100 కి ఫోన్​ చేసి ఫిర్యాదు చేయగా పహాడీషరీఫ్ ​పోలీసులు, ఫైర్​ఇంజన్​ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.