Adilabad, Dec 14: ఆదిలాబాద్ రిమ్స్(RIMS)లో విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటనలో రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్(Assistant Professor Kranti Kumar)ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు(dismissed) డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. వైద్యుడు క్రాంతి కుమార్ అర్ధరాత్రి సమయంలో కారులో ముగ్గురు గుండాలను తీసుకొచ్చి విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటన దురదృష్టకరమన్నారు
ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరుపుతున్నామని, ఐదుగురు సీనియర్ వైద్యులచే కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఐదు రోజుల్లో కమిటీ నివేదిక ఇస్తుందని బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భద్రతా సిబ్బందిని పెంచుతున్నట్లు స్పష్టం చేశారు.
తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఆందోళన కలిగించే సంఘటనలో, డిసెంబర్ 13 బుధవారం రాత్రి వైద్య విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడి చేశారు. దుండగులు కారులో క్యాంపస్‌లోకి ప్రవేశించారు. ఆరుగురు హౌస్ సర్జన్లపై దాడికి పాల్పడిన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ వైద్య విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను గుర్తించగా, ఇద్దరు అజ్ఞాతంలో ఉన్నారు.
Here's Videos
After 6 house surgeons of #RIMS #Adilabad were allegedly assaulted by 5 individuals, #MedicalStudents of the college staged a protest, demanding swift and decisive action against the accused.#Medicos alleged Kranthi Kumar, an Asst Professor, allegedly orchestrated the assault. pic.twitter.com/os8pGFOQjL
— Surya Reddy (@jsuryareddy) December 14, 2023
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వైట్ కలర్ క్రెటా, బండ్లపై వచ్చిన దుండగులు వైద్య విద్యార్థులను దారుణంగా కొట్టారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి విధులను నిలిపివేశారు.అర్ధరాత్రి క్యాంపస్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారని వైద్య విద్యార్థులు తెలిపారు. బయటి వ్యక్తులు గొడవ పెట్టుకోవడమే కాకుండా తమపై ఎలాంటి హెచ్చరికలు చేయకుండా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
తమపై బయటి వ్యక్తులు దాడి చేశారని ఆరోపించిన వైద్య విద్యార్థుల వివరాలను సేకరించారు. ఇంత జరుగుతున్నా రిమ్స్ అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థులు రిమ్స్ లో విధులు బహిష్కరించారు. దుండగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత విద్యార్థులు ప్లకార్డులు, దిష్టి బొమ్మతో రిమ్స్ వైద్య కళాశాల వరకు ర్యాలీ ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎమర్జెన్సీ విభాగం ఎదుట వినతిపత్రాలతో నిరసన తెలుపుతున్నారు.
రిమ్స్ లో మెడి కోల పై దాడి చేసిన వారి పై కేసు నమోదు చేశామని సిఐ అశోక్ అన్నారు. కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రాత్రి రిమ్స్ క్యాంపస్ లోకి వచ్చిన వారిలో ఇద్దరు రౌడీ షీటర్ లు ఉన్నారని స్పష్టంచేశారు. వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గొడవ కంటే ముందు రిమ్స్ డైరెక్టర్, మెడికో ల మధ్య వాగ్వాదం జరిగిందని తెలిసిందన్నారు. పూర్తి స్తాయి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.