Technology
Dunzo Salary Cuts: లేఆప్స్ నుంచి జీతాల కోతకు వచ్చిన కంపెనీలు, ఉద్యోగులకు 50 శాతం సాలరీని కట్ చేసిన స్వదేశీ కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో
Hazarath Reddyస్వదేశీ కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో కొంతమంది ఉద్యోగులకు 50 శాతం జీతం ఆలస్యం చేసినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. బిజినెస్ టుడే ప్రకారం, మూలాధారాలను ఉటంకిస్తూ, మేనేజర్, అంతకంటే ఎక్కువ గ్రేడ్ స్థాయిలలోని ఉద్యోగులకు జీతం కోతలు విధించబడ్డాయి." మేనేజర్ గ్రేడ్, అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులందరూ జూన్ జీతంలో 50 శాతం మాత్రమే పొందారు. కంపెనీ వారు దానిని తర్వాత చెల్లిస్తారని చెప్పారు.
Microsoft Layoffs: ఆగని లేఆప్స్, 276 మంది ఉద్యోగులను తీసేస్తున్న మైక్రోసాఫ్ట్, ముందు ముందు ఇంకా కోతలుంటాయని ప్రకటన
Hazarath Reddyఅమెజాన్, గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇంకా విడతల వారీగా తమ ఉద్యోగులకు లేఆఫ్స్ (Layoffs) ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక టాప్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
AI News Anchor Lisa: వీడియో ఇదిగో, తొలి ఏఐ యాంకర్‌ లీసా వచ్చేసింది, అవలీలగా వార్తలు చదివేస్తున్న మిషన్ లేడీ
Hazarath Reddyఒడిశా లోని OTV మీడియా సంస్థ ‘ లీసా’ పేరుతో తొలి ఏఐ యాంకర్‌ను పరిచయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.చీరకట్టుతో తెరపై అలవోకగా వార్తలు చదువుతున్న యాంకర్‌ను నెటిజన్లు ఔరా అంటున్నారు.
RBI: ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారికి అలర్ట్, రెండు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Hazarath Reddyరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. రెండు బ్యాంకుల వద్ద ప్రస్తుతం సరైన మూలధనం లేదని.. భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే సూచనలు లేవని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది.
Chandrayaan-3: ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్-3, కోట్లాది భారతీయుల ఆశలను చంద్రుని మీదకు తీసుకువెళ్లనున్న మిషన్, చంద్రయాన్-3 ప్రత్యేకతలు ఇవే..
Hazarath Reddyచంద్రయాన్-3 ప్రయోగ తేదీని ప్రకటించారు. నేటి నుంచి 8 రోజుల తర్వాత అంటే జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3 భారత్ ఆశలను మోసుకుంటూ నింగిలోకి దూసుకుపోతుంది. SDSC శ్రీహరికోట నుండి చంద్రయాన్-3 ప్రయోగించబడుతుంది
Threads App: ట్విట్టర్ మీద విరక్తి పుట్టిందా, థ్రెడ్స్ యాప్‌‌కు గంటల్లోనే కోటి మందికిపైగా యూజర్లు, ఎలా లాగిన్ కావాలంటే..
Hazarath Reddyట్విట్టర్‌కు పోటీగా తీసుకువచ్చిన మెటా కొత్త ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్ యాప్‌ దూసుకుపోతోంది. దీన్ని ప్రారంభించిన 7 గంటల్లోనే 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ట్విట్టర్‌‌ను థ్రెడ్స్‌ బీట్ చేస్తుందా? అనే చర్చ అప్పుడే మొదలైంది.
Threads App Launched: ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్ లాంచ్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వినియోగించి లాగిన్‌, ఐదు నిమిషాల పోస్ట్ చేయవచ్చు
Hazarath Reddyప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది.
Discounts on Smartphones: స్మార్ట్‌‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, Xiaomi 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ తగ్గింపులు, ఆఫర్ ఎప్పటివరకంటే..
Hazarath Reddyఎలక్ట్రానిక్‌ తయానీ దిగ్గజం షావోమీ (Xiaomi) 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్‌ సేల్‌ను ప్రారంభించింది. జూలై 6 నుంచి జూలై 10 వరకూ ఈ డిస్కౌంట్ సేల్‌ కొనసాగుతుంది.
Chandrayaan-3: చంద్ర‌యాన్‌-3 వీడియో ఇదిగో, ఈనెల 13వ తేదీన నింగిలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో, జీఎస్ఎల్వీ రాకెట్‌తో నేడు అనుసంధానం
Hazarath Reddyచంద్ర‌యాన్‌-3(Chandrayaan-3) స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 13వ తేదీన ఇస్రో ప్ర‌యోగించ‌నున్న విష‌యం తెలిసిందే.అందులో భాగంగా ఈ రోజు చంద్ర‌యాన్ పేలోడ్‌ ఉన్న క్యాప్సూల్‌ను .. జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఇవాళ అనుసంధానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ ఇస్రో త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది.
Twitter vs Threads: డేటా గోప్యత లేదు, విడుదలకు ముందే మెటా థ్రెడ్‌ యాప్‌కు ఎదురుదెబ్బ, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందన ఇదిగో..
Hazarath Reddyట్విటర్ తరహాలో థ్రెడ్స్‌ పేరుతో యాప్‌ను లాంఛ్‌ చేస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి విదితమే.అయితే విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్లో స్పందించారు.
Instagram Threads: ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్ ఇదిగో, థ్రెడ్స్‌ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకురానున్న మెటా
Hazarath Reddyప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను తీసుకురానుంది. ‘థ్రెడ్స్‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో అచ్చం ట్విటర్‌ తరహా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
FEMA Case: ఈడీ ముందుకు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ, స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్‌లలో రూ.814 కోట్లు, రూ.420 కోట్లు ట్యాక్స్‌ చెల్లించలేదంటూ ఈడీ నోటీసులు
Hazarath Reddyవిదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ( FEMA) ఉల్లంఘించారంటూ, వివిధ సెక్షన్ల కింద దాఖలైన తాజా కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుటకు రిలయన్స్‌ అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani) సతీమణి టీనా అంబానీ (Tina Ambani) హాజరయ్యారు
Jio Bharat V2: జియో భారత్‌ 4జీ ఫోన్‌ ఫీచర్లు ఇవిగో, రూ.999కే సరికొత్త అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ ప్లాన్‌తో స్మార్ట్‌ఫోన్, జియో భారత్‌ ఫోన్‌ల బీటా ట్రయల్ జూలై 7 నుండి ప్రారంభం
Hazarath Reddyముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ చౌక ధరలో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జియో 2 జీ ముక్త్‌ భారత్‌ విజన్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్‌ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. ఈ ఫోన్‌తో పాటు 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా కొత్త రూ. 123 ప్లాన్‌ ప్రకటించింది.
Twitter New Rules: ట్విట్టర్ లో కొత్త నిబంధనలు.. రోజుకు వెయ్యి ట్వీట్లే చూడొచ్చు.. కొత్త ఖాతా దారులకు 500 ట్వీట్లు మాత్రమే.. ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం వెనుక కారణం ఏంటంటే?
Rudraసామాజిక మాధ్యమం ట్విట్టర్ పిట్ట కూయందే రోజు గొడవని పరిస్థితి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్పులు చాలా వచ్చాయి. ఇప్పుడు ఇదీ అలాంటిదే.
Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్‌, వేల సంఖ్యలో ఫిర్యాదులు, ఎలాంటి ప్రకటన చేయని యాజమాన్యం, సోషల్ మీడియాలో ట్విట్టర్‌ పై మీమ్స్‌
VNSసోషల్ మీడియా వేదిక ‘ట్విట్టర్’లో ఎర్రర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొంత సేపు ట్విట్టర్ పని చేయలేదు. దీంతో సోషల్ మీడియా వేదికల మీద నెటిజన్లు ట్విట్టర్ యాజమాన్యంపై నిరసన తెలుపుతున్నారు. ట్విట్టర్ లోనూ `ట్విట్టర్ డౌన్ #Twitterdown` ట్రెండవుతున్నది. వేలాది మంది యూజర్లకు ట్విట్టర్ ఖాతాలు అందుబాటులోకి రాలేదు.
Whatsapp Chat Transfer: పాతఫోన్‌ నుంచి వాట్సాప్‌ చాట్‌ ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం చాలా ఈజీ, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు
VNSవాట్సాప్‌ యూజర్లు తరచూ ఎదుర్కొనే సమస్య చాట్‌ బ్యాకప్‌. డ్రైవ్‌లో స్పేస్‌ తక్కువగా ఉండటం వల్ల చాలామంది వాట్సాప్‌ చాట్‌ హిస్టరీని (Whatsapp Chat) బ్యాకప్‌ చేసుకోలేకపోతున్నారు. దీంతో రెగ్యులర్‌ టైమ్‌లో సమస్య లేకపోయినప్పటికీ.. ఫోన్‌ మార్చినప్పుడు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ డేటాను పాత ఫోన్‌లో నుంచి కొత్త ఫోన్‌లోకి మార్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.
HC Dismisses Twitter Plea: 45 రోజుల్లోగా రూ. 50 లక్షలు చెల్లించాలని ట్విట్టర్‌కు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు, ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటిషన్ తిరస్కరించిన ధర్మాసనం
Hazarath Reddyక‌ర్నాట‌క హైకోర్టు ట్విట్ట‌ర్ (Twitter) సంస్థ‌కు భారీ షాక్ ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ సంస్థ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. ఆ సంస్థ‌పై 50 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది.
Internet Shutdowns Cost in India: దేశంలో అల్లర్లతో ఇంటర్నెట్ షట్‌డౌన్‌‌, భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.15,590 కోట్లు నష్టం
Hazarath Reddyఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15,590 కోట్లు) నష్టం వాటిల్లిందని ఒక తాజా నివేదిక పేర్కొంది.
Niantic Layoffs: ఆగని లేఆప్స్, 230 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన పోకీమాన్ GO గేమ్ డెవలపర్ Niantic
Hazarath Reddyపోకీమాన్ GO గేమ్ డెవలపర్ Niantic దాదాపు 230 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. Niantic CEO జాన్ హాంకే గురువారం ఉద్యోగులకు ఒక ఇ-మెయిల్‌ను పంచుకున్నట్లు కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.