టెక్నాలజీ

Zoom Layoffs: జూమ్‌ యాప్ సంచలన నిర్ణయం, భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తూ ప్రకటన, మూడేళ్లలో కొత్త ఉద్యోగుల్ని తీసుకొని తప్పు చేశామంటూ పశ్చాత్తాపం

VNS

రెండేళ్లుగా భారీగా నియామకాలు చేసుకున్న జూమ్ కంపెనీ(Zoom)...తమ ఉద్యోగుల్లో 15 శాతం మందికి ఉద్వాసన పలుకనుంది. అంటే దాదాపు 1300 మంది ఉద్యోగులను తొలగించనుంది. కరోనా సమయంలో భారీగా సేవలు అందించాల్సిన అవసరం కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని నియమించుకున్నామని, ఇప్పుడు ఆర్ధిక భారం తగ్గించుకోవడంలో భాగంగా తొలగింపులు తప్పడం లేదని జూమ్‌ సీఈవో ఎరిక్ యువాన్ (Eric Yuan) తెలిపారు.

ChatGPT vs Bard: మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన గూగుల్, చాట్‌బాట్‌కి పోటీగా బార్డ్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన సుందర్ పిచాయ్

Hazarath Reddy

మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబ‌డులతో గూగుల్‌కి సవాల్‌గా తీసుకొచ్చిన చాట్‌జీపీటీకి పోటీగా (ChatGPT vs Bard) గూగుల్ సరికొత్త ఏఐ బేస్డ్ చాట్‌బాట్‌ ‘బార్డ్’ ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్‌ను కూడా మొదలు పెట్టింది. అతి త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

UPI Payments: యూజర్లకు ఫోన్ పే శుభవార్త, విదేశాలకు కూడా మీ ఫోన్ పే నుండి యూపీఐ లావాదేవీలు జరుపుకోవచ్చు, కొత్త ఫీచర్ లాంచ్ చేసిన PhonePe

Hazarath Reddy

యూజర్లకు ఫోన్ పే శుభవార్తను అందించింది. తమ వినియోగదారులు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్‌ను ఉపయోగించి యుఎఇ, నేపాల్, సింగపూర్‌తో సహా ఐదు దేశాల్లోని అంతర్జాతీయ మర్చంట్ అవుట్‌లెట్‌లకు ఇప్పుడు చెల్లించగలరని ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే మంగళవారం తెలిపింది

WhatsApp Feature Update: వాట్సప్ నుంచి కొత్త ఫీచర్స్, ఒకపై వాట్సాప్ స్టేటస్‌లో 30 సెకన్ల వరకు వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేసి షేర్ చేసుకోవచ్చు

Hazarath Reddy

'వాయిస్ స్టేటస్', 'స్టేటస్ రియాక్షన్స్'మరెన్నో ఫీచర్లు మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ మంగళవారం ప్రకటించింది. కొత్త ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభించాయి. రాబోయే వారాల్లో అందరికీ అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Boeing Begins Layoffs:ఆగని ఉద్యోగాల కోత, 2000 మంది ఉద్యోగులను తొలగించిన ఏవియేషన్ దిగ్గజం బోయింగ్

Hazarath Reddy

ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ ఈ ఏడాది ఫైనాన్స్ మరియు హెచ్‌ఆర్ వర్టికల్స్‌లో 2,000 ఉద్యోగాలను తొలగిస్తోంది. కంపెనీ వాటిలో మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ (టిసిఎస్)కి అప్పగించినట్లు మీడియా నివేదించింది.

Swiggy: తొలిసారిగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకున్న స్విగ్గీ, పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లికా శ్రీనివాసన్ స్వతంత్ర డైరక్టర్‌గా నియామకం

Hazarath Reddy

స్విగ్గీ సోమవారం తన బోర్డుకు ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించినట్లు ప్రకటించింది - పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లికా శ్రీనివాసన్, TAFE చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్; శైలేష్ హరిభక్తి & అసోసియేట్స్ ఛైర్మన్ శైలేష్ హరిభక్తి, ఢిల్లీవేరిలో మేనేజింగ్ డైరెక్టర్, CEO సాహిల్ బారువాలను స్వతంత్ర డైరక్టర్లుగా నియమించింది.

HAL's Helicopter Factory: దేశంలోనే అతిపెద్ద హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం, కర్ణాటకలోని తుమకూరులో ప్రారంభించిన ప్రధాని మోదీ

Hazarath Reddy

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కర్ణాటక తుమకూరులో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Stock Market Highlights: రూపాయి ఢమాల్, వరుసగా ఐదో రోజలు లాభాలకు బ్రేక్, నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Hazarath Reddy

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు ఆఖరి క్షణాల్లో కాస్త నష్టాల నుంచి కాస్త తేరుకున్నాయి. కాగా సెన్సెక్స్‌లో ఐదు సెషన్ల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్‌ 335 పాయింట్ల నష్టంతో 60507 వద్ద, నిఫ్టీ 89 పాయింట్లు నష్టంతో17764 వద్ద ముగిసాయి.

Advertisement

Adani Row: అదాని గ్రూపు మరో సంచలన నిర్ణయం, మెచ్యూరిటీ కంటే ముందే 1.1 బిలియన్‌ డాలర్ల ప్రీ-పే మొత్తాలను చెల్లిస్తామని ప్రకటన

Hazarath Reddy

అదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్‌ వివాదం దేశంలో ప్రకంపనలు రేకెత్తిస్తున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2024నాటికి చెల్లించాల్సిన ప్లెడ్జ్‌ షేర్ల రిలీజ్‌ కోసం భారీ మొత్తాన్ని ఆదాని కంపెనీ (Adani Group Companies Promoters) ముందుగానే చెల్లించనుంది.

Layoffs Season 2023: జనవరి నెలలో లక్షమంది ఉద్యోగులను తీసేసిన టెక్ కంపెనీలు, రెండేళ్లలో 2.5 లక్షల మందిని ఇంటికి సాగనంపిన దిగ్గజాలు, కారణాలు ఇవే..

Hazarath Reddy

టెక్ వర్కర్లకు అత్యంత అధ్వాన్నమైన నెలగా జనవరి నిలిచింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఇతర సంస్థల నుంచి ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో దాదాపు లక్ష మంది ఉద్యోగాలు (Layoffs Season 2023) కోల్పోయారు.

FarEye Layoffs: ఉద్యోగులకు పీకేసిన మరో కంపెనీ, 90 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన డెలివరీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఫార్‌ఐ

Hazarath Reddy

ఎండ్-టు-ఎండ్ గ్లోబల్ డెలివరీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ఫార్‌ఐ 90 మంది ఉద్యోగులను తొలగించింది, ఇది ఆర్థిక మాంద్యం మధ్య సుమారు ఎనిమిది నెలల్లో రెండవ తొలగింపులు.

Dell Layoffs: ఆగని ఉద్యోగుల తీసివేత, ఆరు వేల మంది ఉద్యోగులను తీసేసిన డెల్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

Hazarath Reddy

టెక్ కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఉద్యోగులకు ఇంటికి సాగనంపగా వీరి బాటలోనే టెక్ దిగ్గజం డెల్ కూడా చేసింది. ఆరు వేల మంది ఉద్యోగులను తీసేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి The Spectator Index కథనాన్ని వెలువరించింది. దూసుకొస్తున్న ఆర్థక మాంద్య భయంతో డెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

India Blocks Chinese Apps: చైనాకు భారత్ బిగ్ షాక్, 232 యాప్స్ ను నిషేదిస్తూ ప్రకటన, బ్యాన్ చేసి వాటిలో ఎక్కువగా బెట్టింగ్, లోన్ యాప్స్

VNS

మొత్తంగా చైనాతో సంబంధం ఉన్న 232 యాప్స్ పై కేంద్రం చర్యలు చేపట్టింది. వీటిని ప్లే స్టోర్ ని తొలగించింది. గతంలో టిక్ టాక్ (Tik tok) సహా పలు చైనాకు సంబంధించిన యాప్ లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా భారీగా చైనా యాప్స్ పై చర్యలు చేపట్టింది.

Instagram Blue Tick: ఇకపై ఇన్‌స్టాగ్రామ్ బ్లూ టిక్ కోసం కూడా చెల్లించాల్సిందే! ట్విట్టర్ దారిలోనే చార్జీలు పెట్టిన ఇన్ స్టాగ్రామ్

VNS

Twitter ప్రస్తుతం వెరిఫికేషన్ బ్యాడ్జ్, ఇతర బెనిఫిట్స్ కలిగి ఉన్న బ్లూ సబ్‌స్క్రిప్షన్ కోసం వెబ్ యూజర్లకు నెలకు 8 డాలర్లు ఛార్జ్ చేస్తోంది. iOS లేదా Android యూజర్లు నెలకు 11 డాలర్లు చెల్లించాలి. ప్రస్తుతం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూకే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్‌లలో అందుబాటులో ఉంది.

Recurring Defect In Car: కారు బ్రేకులు ఫెయిలయినందుకు రూ.60 లక్షలు జరిమానా, ఆడి కారు యజమానికి చెల్లించాలంటూ వోక్స్ వాగన్ డీలర్‌కు వినియోగదారుల కోర్టు ఆదేశం

VNS

కారులో లోపం కారణంగా ఒక వినియోగదారుడికి భారీగా జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది తమిళనాడు వినియోగదారుల కోర్టు. తమిళనాడు స్టేట్ కన్సుమర్ డిస్ప్యూట్ రెడ్సెస్సల్ కమిషన్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఒక కారు డీలర్ కు రూ. 60,08,000 జరిమానా విధించింది. వినియోగదారుడు కొన్న ఆడి కారులో బ్రేక్ మెకానిజంలో లోపం ఏర్పడింది.

Dilish Parekh Dies: రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్, కెమెరాల కింగ్ డిలీష్ పరేఖ్ కన్నుమూత, ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలు సేకరించిన వ్యక్తిగా పరేఖ్ రికార్డు

Hazarath Reddy

ప్రపంచంలోనే అత్యధిక కెమెరాలు సేకరించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కిన ముంబైకి చెందిన డిలీష్ పరేఖ్ కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. బుధవారం సాయంత్రం ఆయన మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Advertisement

DigiYatra At Vijayawada and Hyderabad Airports: విజయవాడ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లలో త్వరలో డిజీ యాత్ర సేవలు.. తగ్గనున్న వేచి చూసే సమయం.. ఎలా అంటే?

Rudra

వచ్చే నెలలోగా హైదరాబాద్, విజయవాడతో పాటు కోల్ కతా, పుణె విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర వైమానిక శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజీ యాత్ర సేవలను తీసుకొచ్చింది.

Uttar Pradesh: ఇన్‌స్టాగ్రాంలో లైవ్‌ పెట్టి యువకుడు ఆత్మహత్యాయత్నం, వీడియో చూసి అలర్ట్ అయిన ఫేస్‌బుక్‌ అధికారులు, పోలీసులకు సమాచారమివ్వడంతో 13 నిమిషాల్లో కాపాడిన ఘజియాబాద్ పోలీసులు

Hazarath Reddy

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ యువకుడు ఇన్‌స్టాగ్రాం లైవ్‌లో ఆత్మహత్యకు (Committing Suicide Live on Instagram) సిద్ధమవుతుండగా ఫేస్‌బుక్‌ అధికారులు (Police Officials) వెంటనే స్పందించి యూపీ పోలీసులకు సమాచారమిచ్చారు.

Google Bans 12 Android Apps: ప్లే స్టోర్ నుండి 12 యాప్‌లను తొలగించిన గూగుల్, వెంటనే వాటిని మీ మొబైల్స్ నుండి తీసేయాలని యూజర్లకు హెచ్చరిక

Hazarath Reddy

గూగుల్ తన ప్లేస్టోర్ నుండి 12 యాప్‌లను తీసివేసింది, ఆండ్రాయిడ్ యూజర్లు తక్షణమే వాటిని తీసేయాలని, ఈ యాప్‌లను తొలగించాలని హెచ్చరించింది. మిలియన్ల సార్లు డౌన్‌లోడ్ చేయబడిన ఈ యాప్‌లు ఫిట్‌నెస్, గేమింగ్ యాప్‌ల ముసుగులో ప్రమాదకర వెబ్‌సైట్‌ల లింక్‌లపై క్లిక్ చేయడానికి వినియోగదారులను ప్రలోభపెడుతున్నాయి.

Byju's Layoffs: 1000 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్, ఆర్థిక మాంద్య భయాలు, నిధుల కొరతతో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఎడ్‌టెక్ కంపెనీ

Hazarath Reddy

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ నెమ్మదిగా ఆదాయ వృద్ధి, నిధుల కొరతతో ఖర్చులను తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగా బైజూస్ మరో 1,000-1,200 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఇంజనీరింగ్, సేల్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ టీమ్‌ల నుండి ఉద్యోగులను తొలగిస్తోంది.

Advertisement
Advertisement