World
Priyanka Chopra: ప్రియాంకకు మరో అరుదైన గౌరవం.. ప్రఖ్యాత బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ కవర్ పేజీపై ఫోటో.. తొలి భారతీయ నటిగా గుర్తింపు
Rudraబాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే, 40 అంతర్జాతీయ మ్యాగజీన్ల కవర్ పేజీలపై కొలువుదీరిన ఈ మాజీ ప్రపంచ సుందరి తాజాగా మరో ఘనత సాధించింది. ప్రముఖ బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ కవర్ పేజీపై తళుకులీనింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ నటిగా గుర్తింపు పొందింది.
Aruna Miller: అమెరికాలో చరిత్ర సృష్టించిన హైదరాబాదీ మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్
Rudraఅమెరికాలోని మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్‌-అమెరికన్‌గా అరుణా మిల్లర్‌ అమెరికాలో చరిత్ర సృష్టించారు.
Belgium: అల్లాహు అక్బర్ అని అరుస్తూ ప్రయాణికులను నరికివేసిన తీవ్రవాది, బెల్జియంలో దారుణ ఘటన
Hazarath Reddyబెల్జియంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తీవ్రవాది నరమేథానికి తెగబడ్డాడు. 'అల్లాహు అక్బర్' అని అరుస్తూ తీవ్రవాది బ్రస్సెల్స్ రైలు స్టేషన్‌లో ప్రయాణికుడిని నరికివేశారు. ఈ దారుణ ఘటన అక్కడ సీసీటీవీ పుటేజీలో రికార్డ్ అయింది. ఈ దాడిలో బాధితుడి ముఖం, చేతులపై రక్తం కారింది.
Vladimir Putin Dead?: రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోయాడా, బతికి ఉన్నాడో లేదో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్, ఈ వ్యాఖ్యలపై మండిపడిన క్రెమ్లిన్
Hazarath Reddyవ్లాదిమిర్ పుతిన్ బతికి ఉన్నారో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను క్రెమ్లిన్ కొట్టి పారేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ జెలెన్స్కీకి పెద్ద సమస్యగా మారాడు కాబట్టే భయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది.
BBC Documentary on PM Modi: ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ, గుజరాత్ అల్లర్ల ప్రస్తావన ఉండటంతో మండిపడిన కేంద్రం, డాక్యుమెంటరీపై స్పందించిన యూకే ప్రధాని రిషి సునాక్‌
Hazarath Reddyప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై బీబీసీ ఛానల్ ‘India: The Modi Question’ పేరిట ప్రసారం చేసిన సిరీస్‌పై కేంద్రం తీవ్రంగా స్పందించింది.ఇది పక్షపాతంతో కూడిన ప్రచారంలో భాగమని తీవ్రంగా ఆక్షేపించింది.
New Zealand PM Resign: న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా, ప్రకటన చేస్తూ కన్నీటిపర్యంతమైన ప్రధాని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ సంచలన ప్రకటన, కరోనా టైమ్‌లో పాపులర్ అయిన నేత రాజీనామా వెనుక కారణాలివే!
VNSవచ్చేనెల మొదటి వారంలో తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు న్యూజిలాండ్‌ పీఎం జెసిండా ఆర్డెర్న్‌ (Jacinda Ardern) ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా(Resign as New Zealand Prime Minister) చేస్తున్నట్లు అధికార లేబర్‌ పార్టీ సమావేశంలో వెల్లడించారు.
Ukraine Helicopter Crash:ఘోర విమాన ప్రమాదంలో 16 మంది మృతి, హెలికాప్టర్‌ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వెలుపల ఘటన
Hazarath Reddyఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వెలుపల ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్‌ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్‌ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్‌ పోలీసులు తెలిపారు.
US woman Stabs Boyfriend: నిద్రపోతుండగా పక్కతడిపిన ప్రియుడు, కోపాన్ని ఆపుకోలేక కత్తితో పొడిచిన ప్రియురాలు, లూసియానాలో ఘటన
Hazarath Reddyయూఎస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రపోతున్న సమయంలో మంచంపై మూత్ర విసర్జన చేసినందుకు తన ప్రియుడిని ఓ యువతి కత్తితో (US woman Stabs Boyfriend) పొడిచి హత్యాయత్నానికి పాల్పడింది.
COVID-19 Surge: చైనాలో రోజుకు 36 వేల కరోనా మరణాలు, లూనార్ న్యూ ఇయర్ సెలవుల్లో వైరస్ తీవ్రరూపం దాల్చుతుందని తెలిపిన డేటా అనలిటిక్స్ కంపెనీ ఎయిర్‌ఫినిటీ
Hazarath Reddyలూనార్ న్యూ ఇయర్ సెలవుల్లో చైనా రోజుకు దాదాపు 36,000 మరణాలను (China Stares at 36,000 Coronavirus Deaths) చూడవచ్చని డేటా అనలిటిక్స్ కంపెనీ ఎయిర్‌ఫినిటీ అంచనా వేసింది. లూనార్ న్యూ ఇయర్ పండుగ జనవరి 7 న ప్రారంభమైంది. సెలవులు జనవరి 21 నుండి ప్రారంభమవుతాయి.
Lucile Randon Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు సిస్టర్ అండ్రే కన్నుమూత, ద్రలోనే చనిపోయారని తెలిపిన అధికార ప్రతినిధి
Hazarath Reddyవరల్డ్‌లో అత్యధికకాలం జీవించి ఉన్న మహిళగా రికార్డుల్లోకెక్కిన ఫ్రెంచ్ మహిళ సిస్టర్ అండ్రే మంగళవారం కన్నుమూశారు. ఆమె వయసు 118 సంవత్సరాలు. అండ్రే అసలు పేరు లూసిలి రాండన్.. టౌలన్ లోని తన నర్సింగ్ హోమ్ లో రాండన్ మంగళవారం నిద్రలోనే చనిపోయారని హోమ్ అధికార ప్రతినిధి చెప్పారు.
Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్, ఒకేసారి జాబ్స్ కోల్పోనున్న 11వేల మంది ఎంప్లాయిస్, రెండు విభాగాల్లోనే భారీగా ఉద్యోగాల కోతలు, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు ఊస్ట్
VNSఆర్ధిక మాంధ్యం భయాలు టెక్ కంపెనీలను వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగించగా, అదే బాటలో మరికొన్ని కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్‌ వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై వేటు వేయనుందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
‘Pakistan Has Learned Its Lesson’: భారత్‌తో యుద్దాలు చేసి చాలా నష్టపోయాం, పాక్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు, శాంతి కోసం ప్ర‌ధాని మోదీతో చ‌ర్చ‌లకు సిద్ధంగా ఉన్నామ‌ని వెల్లడి
Hazarath Reddyఆర్థిక సంక్షోభంలో నలిగిపోతున్న పాకిస్థాన్‌ (Pakistan).. తమకు సహాయం చేయాలని ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు.
Lalit Modi Health Update: వెంటిలేటర్‌పై ఆక్సిజన్ సపోర్టుతో లలిత్ మోడి, న్యూమోనియా కూడా అటాక్ చేయడంతో విషమించిన ఆరోగ్యం, రెండు వారాల్లో రెండు సార్లు కరోనా
Hazarath Reddyఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్‌ మోడీ ఆరోగ్యం (Lalit Modi Health Update) క్షీణించింది. గత రెండు వారాల్లో రెండుసార్లు కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం న్యుమోనియాతో బాధపడుతున్నారు.
UK’s PM Office Celebrating Pongal: యూకే ప్రధాని ఆఫీసులో సంక్రాంతి సెలబ్రేషన్స్, వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Hazarath ReddyUKలోని ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది పొంగల్ పండగను జరుపుకుంటున్నప్పుడు, రుచికరమైన తీపి వంటకం పొంగల్‌ను ఆస్వాదిస్తున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Dawood Ibrahim Divorce Row: అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు, విడాకుల వార్తలు అబద్దం, NIAకు దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడించిన దావూద్ మేనల్లుడు అలీషా పార్కర్
Hazarath Reddyపరారీలో ఉన్న అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim ) తన విడాకుల గురించి అబద్దాలు చెబుతున్నాడని,అతను మళ్లీ పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకున్నాడని హసీనా పార్కర్ కుమారుడు (Haseena Parkar's son), దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలీషా పార్కర్ జాతీయ దర్యాప్తు సంస్థకు తెలిపాడు.
Cigarette Butt: సిగిరెట్ తాగి పీక రోడ్డు మీద పడేశాడని రూ. 50 వేలు జరిమానా విధించిన లండన్ కోర్టు, రోడ్లన్నీ చెత్తాచెదారంగా తయారవుతున్నాయని తెలిపిన న్యాయమూర్తి
Hazarath Reddyరోడ్డుమీద సిగరెట్‌ పీక పడేసిన ఏకంగా రూ.55వేలు (558 పౌండ్లు) జరిమానా విధించింది లండన్ కోర్టు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని థోర్న్ బరీ టౌన్‌లో చోటు చేసుకుంది. అలెక్స్‌ డేవిస్‌ అనే వ్యక్తి.. సిగరెట్‌ తాగి దాని పీకను రోడ్డుపై పడేశాడు.
Abdul Rehman Makki: అంతర్జాతీయ ఉగ్రవాదిగా పాకిస్థాన్ టెర్రరిస్ట్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, నిషేధిత జాబితాలో అతన్ని చేర్చిన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి
Hazarath Reddyపాకిస్థాన్ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని.. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి(UNSC) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.మ‌క్కీపై నిషేధం విధిస్తూ అత‌ని పేరును బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. అత‌ని ఆస్తుల‌ను స్తంభింప చేయ‌డంతో పాటు ఆయుధాల స‌ర‌ఫ‌రా చేయ‌కుండా, ట్రావెల్ చేయ‌కుండా ఆంక్ష‌లు విధించింది.
Gender Restrictions In SL: శ్రీలంకలోని స్పా, మసాజ్ పార్లర్లలో త్వరలో కఠిన నిబంధనలు.. ఫీమేల్ స్పాలలో లేడీస్, మేల్ స్పాలలో జెంట్స్ మాత్రమే పనిచేసేలా నిర్ణయం.. వ్యభిచారం, ఎయిడ్స్ రోగాల్ని తగ్గించడానికే..
Rudraవ్యభిచారం, ఎయిడ్స్ తదితర రోగాల్ని తగ్గించడానికి శ్రీలంక ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనున్నది. ఫీమేల్ స్పాలలో లేడీస్, మేల్ స్పాలలో జెంట్స్ మాత్రమే పనిచేసేలా నిబంధనలు తీసుకురానున్నది.
Pilot Touches Her Father's Feet: వైరల్ అవుతున్న తండ్రీకూతుళ్ల బెస్సింగ్ వీడియో, విమానం ల్యాండ్ అయిన తరువాత తండ్రి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న పైలట్‌
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుమార్తె విజయాన్ని కళ్లారా చూసిన తండ్రి.. ఆనందంతో భావోద్వేగానికి గురయ్యాడు.ఎయిర్‌బస్ 320కి చెందిన పైలట్ క్రుతద్న్యా హేల్ నడుపుతున్న విమానంలో ఆమె తండ్రి ప్రయాణించాడు.
Fresh Covid Guidelines: కోవిడ్ కొత్త గైడ్‌లైన్స్, లక్షణాలు ఉంటే 10 రోజుల ఐసొలేషన్‌లో ఉండాల్సిందే, లక్షణాలు లేని వారు ఐదు రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(Coronavirus) వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనే వార్తల నేపథ్యంలో కొన్ని దేశాలు.. సంబంధిత ఆంక్షలను పూర్తిగా సడలిస్తున్నాయి, అయినప్పటికీ కరోనా మహమ్మారి భయాందోళనలు నెలకొనే ఉన్నాయి.