World

UK Coronavirus Strain: అరవై దేశాలకు పాకిన యుకె కరోనావైరస్, 23 దేశాలకు పాకిన దక్షిణాఫ్రికా రకం కరోనావైరస్, వారంలోనే 47 లక్షల కరోనా కేసులు, కొవిడ్ వారపు నివేదికను విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Hazarath Reddy

బ్రిటన్ కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ప్రపంచాన్ని ప్రస్తుతం కలవరపెడుతున్న సంగతి విదితమే. మన దేశానికీ కూడా అది విస్తరించింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలను బ్రిటన్ కరోనా (UK Coronavirus Strain) చుట్టేసిందని WHO తెలిపింది.

Jack Ma is Back: జాక్ మా వీడియోలో నిజమెంత? మూడు నెలల తర్వాత బయటకు వచ్చిన అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు, త్వరలో మిమ్మల్ని కలుస్తానంటున్న వీడియోను విడుదల చేసిన చైనా మీడియా

Hazarath Reddy

చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్‌ వ్యవస్థాపకుడు బిలియనీర్ జాక్‌ మా దాదాపు మూడు నెలలుగా కనిపించకుండా పోవడం కార్పొరేట్‌ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అదృశ్యం వెనకు చైనా ప్రభుత్వ హస్తం ఉందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో చైనా అధికారిక మీడియా బుధవారం ఓ వీడియోను (Alibaba Founder Makes First Public Appearance) విడుదల చేసింది.

Coronavirus in India: భూటాన్‌కు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా, నేటి నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఎగుమతి, దేశంలో తాజాగా 13,823 కేసులు నమోదు, తెలంగాణలో కొత్తగా 267 కరోనా కేసులు

Hazarath Reddy

పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఇండియా తయారు చేసిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ (coronavirus vaccine) ‘కొవిషీల్డ్‌’ 1.5లక్షల డోసులను భూటాన్‌కు తరలించారు. ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం తెల్లవారు జామున ఈ వ్యాక్సిన్లను తరలించారు.

'PM Modi in Pakistan': పాకిస్తాన్‌లో మార్మోగిన ప్రధాని మోదీ పేరు, పాక్‌ నుంచి స్వాతంత్య్రం కావాలంటున్న సింధీలు, అంతర్జాతీయ నేతల ఫొటోలు ఉన్న ప్లకార్డులతో ప్రదర్శనలు

Hazarath Reddy

పొరుగుదేశం పాకిస్థాన్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. తమకు పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కావాలని పోరాడుతున్న సింధీలు సోమవారం సింధ్‌ రాష్ట్రంలో నిర్వహించిన ర్యాలీలో మోదీ ఫొటోలు ఉన్న పోస్టర్లను (PM Naredra Modi's posters raised) పట్టుకొన్నారు. ప్రజలంతా ఆయన ఫ్లకార్డులు పట్టుకుని.. తమకు మద్దతునివ్వాల్సిందిగా (PM Modi Slogans In Pakistan) మోడీని అభ్యర్థించారు.

Advertisement

Russian Blogger: భర్తకు విడాకులు..సవతి కొడుకుతో పెళ్లి, కాపురం, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రష్యన్ బ్లాగర్, మళ్లీ సోషల్ మీడియాలోకి ఎక్కిన మెరీనా, ఇన్‌స్టాగ్రాంలో బేబీ ఫోటో షేర్

Hazarath Reddy

రష్యాలో ఓ సంచలన ఘటన గతేడాది సంచలన ఘటన చోటు చేసుకున్న సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ర‌ష్యాలో సోష‌ల్ మీడియా స్టార్‌ అయిన 35 ఏళ్ల మెరీనా బ‌ల్మ‌షేవ (marina balmasheva) వ్లాదిమిర్‌ వోయా అనే సవతి కొడుకును వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల గర్భవతి అయిన మెరీనా (Russian Blogger) సోమవారం పండంటి బిడ్డకు జన్మినిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది.

Kolam: అమెరికాలో దుమ్మురేపిన కోలం, జో బైడెన్, కమలా హారీస్‌లకు భారతీయ సంప్రదాయ ముగ్గులు ద్వారా అభినందనలు, ఈ నెల 20న అధ్యక్షుడిగా జోబైడెన్, ఉపాధ్యక్షుడిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడిగా న్నికైన జో బిడెన్ మరియు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కమలా హారిస్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. దీనికి ముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో (Joe Biden-Kamala Harris Inauguration Ceremony) భారతీయ కళారూపమైన కోలం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Covid in China: చైనా నుంచి మరో షాకింగ్ న్యూస్, 4,800 ఐస్ క్రీం బాక్సుల్లో కరోనావైరస్, అప్రమత్తమైన చైనా ప్రభుత్వం, టియాన్జియాన్‌ మున్సిపాలిటీలో ఘటన, సెల్ఫ్‌ ఐసొలేషన్‌లోకి 1,662 మంది ఉద్యోగులు

Hazarath Reddy

చైనా నుంచి మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ఐస్‌క్రీం బాక్సుల్లో కూడా కరోనా జాడను (Ice Cream Infected With Coronavirus) గుర్తించారు. 4,800 ఐస్‌క్రీం బాక్సుల్లో కరోనావైరస్ ఉందని చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం ఈ వైరస్‌ (Covid in China) ఎక్కడి నుంచి వచ్చింది? ఎందరికి వ్యాపించింది? అనే విషయాలపై ఆరా తీసే పనిలో పడింది.

Donald Trump Impeached: డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి రెండోసారి ప్రతినిధుల సభ ఆమోదం, సెనేట్ ఆమోదం పొందటమే తరువాయి! బైడెన్ ప్రమాణస్వీకారం రోజున విధ్వంసాలు? ప్రశాంతంగా ఉండాలని ట్రంప్ పిలుపు

Team Latestly

మరోవైపు జనవరి 20న జో బిడెన్ ప్రమాణస్వీకారోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా సాయుధ హింసకు అవకాశం ఉందని భద్రతా సంస్థలు నివేదించడంతో అందరూ సంయమనం పాటించాలని ట్రంప్ కోరారు. "చట్టాన్ని ఉల్లంఘించే ఎలాంటి హింసాత్మక దాడులు మరియు ఎలాంటి విధ్వంసాలు జరగకూడదు నేను కోరుతున్నాను" అని ట్రంప్ బుధవారం....

Advertisement

Gorillas Test Positive for Covid: తొలిసారిగా గొరిల్లాలకు కరోనావైరస్, అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులో ఎనిమిది గొరిల్లాలకి కోవిడ్, వెల్లడించిన జూ అధికారులు

Hazarath Reddy

ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో మనుషుల నుంచి గొరిల్లాలకి కరోనా వైరస్‌ సోకింది. అమెరికాలోని శాన్‌డియోగో సఫారి పార్కులోని ఎనిమిది గొరిల్లాలకి కోవిడ్ (Gorillas Test Positive for Covid) సోకినట్టుగా పార్క్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లిసా పీటర్సన్‌ సోమవారం వెల్లడించారు. కరోనా ( Coronavirus) సోకిన వాటిలో కొన్ని గొరిల్లాలు బాగా దగ్గుతున్నాయని చెప్పారు. కాగా పార్కులోని జంతు సంరక్షణ బృందంలోని ఒక వ్యక్తి నుంచి వైరస్‌ గొరిల్లాలకి సంక్రమించి ఉంటుందని పీటర్సన్‌ అనుమానం వ్యక్తం చేశారు.

US Capitol Violence Row: డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ మీద షాకులు, తాజాగా యూట్యాబ్ ఛానల్‌పై వారం పాటు వేటు, హింసను ప్రేరేపించేలా కంటెంట్, ఇప్పటికే ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విచ్, రెడ్డిట్‌ అకౌంట్లపై నిషేధం

Hazarath Reddy

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై సోష‌ల్ మీడియా సంస్థ‌లు, టెక్ కంపెనీలు త‌మ ప్ర‌తాపాన్ని కొన‌సాగిస్తున్నాయి. ట్రంప్‌ సోషల్‌ మీడియా ఖాతాలపై వేటు వేస్తున్న సంస్థల్లో తాజాగా యూ ట్యూబ్‌ (YouTube Bars Donald Trump From Uploading Videos) కూడా చేరింది. ట్రంప్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌ను హింసను (US Capitol Riot) రెచ్చగొడుతున్నట్టుగా ఉందని ఆరోపణల​ నేపథ్యంలో యూట్యూబ్ కొరడా ఝళిపించింది. ట్రంప్ ఛానెల్‌ను (Donald Trump YouTube Channel) కనీసం ఒక వారం సస్పెండ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

Covid in China: చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. దేశాన్ని వణికిస్తున్న కరోనా, అయిదు నెలల తరువాత రెట్టింపు సంఖ్యలో కేసులు, నాలుగు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ అమలు, జనవరి 14న చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం

Hazarath Reddy

కరోనా పుట్టినిల్లుగా చెప్పబడుతున్న చైనాలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు జోరందుకున్నాయి. దాదాపు అయిదు నెల‌ల త‌ర్వాత‌ కోవిడ్ కేసుల సంఖ్య మ‌ళ్లీ రెట్టింపు (China Records Biggest Daily Jump) అయ్యింది. దీంతో దేశంలోని నాలుగు న‌గ‌రాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించారు. హుబేయ్‌లోని షిజియాజువాంగ్‌, జింగ్టాయి, లాంగ్‌ఫాంట్ న‌గ‌రాల్లో లాక్‌డౌన్ (4 Cities in Lockdown) అమ‌లు చేస్తున్నారు.

WHO Team to Visit China: కరోనావైరస్ చైనాలోనే పుట్టిందా? నిజాలను నిగ్గు తేల్చేందుకు రెడీ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, 10 మందితో కూడిన బృందం ఈ నెల 14వ తేదీన చైనాకు..

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనావైరస్ చైనాలోనే పుట్టిందని ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్ముతున్న సంగతి విదితమే. చైనా ప్రభుత్వం (China Govt) ఉద్దేశపూర్వకంగా ఈ వైరస్‌ను సృష్టించి, ప్రపంచం పైకి వదిలిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఈ వైరస్ నిజంగా చైనాలో (China) పుట్టిందా లేదా అనే విషయం తేల్చడానికి 10 మంది నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం ఈ నెల 14వ తేదీన చైనాకు (WHO Team to Visit China) చేరుకోనుంది.

Advertisement

Balakot Airstrike Update: పాక్ వక్ర బుద్ది మళ్లీ తెరపైకి, బాలకోట్‌ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతం, సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అఘా హిలలీ

Hazarath Reddy

ఓ ఉర్దు చానెల్‌ డిబెట్‌లో పాక్‌ దౌత్యవేత్త ఆఘా హిలాలీ (Former Pakistan Diplomat Agha Hilaly) మాట్లాడుతూ.. ‘భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును దాటి.. ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఈ ఘటనలో కనీసం 300 మంది మరణించారు. ఇందుకు మేం బదులు తీర్చుకుంటాం.

Covid US Variant: బ్రిటన్ వైరస్‌కు తోడయిన మరో యుఎస్ కొత్త వైరస్, అమెరికాలో 24 గంటల్లో 3 లక్షల పాజిటివ్ కేసులు, 3 వేల మంది మృత్యువాత, రూపాంతరం చెందుతున్న కరోనా వైరస్ రకాలు

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాలో కరోనావిలయానికి అల్లాడిపోతోంది. కొన్ని నెలల కిందట వరకు అమెరికా ప్రాణాంతక వైరస్ ప్రభావంతో విలవిల్లాడింది.ఇక ఇటీవలే అమెరికాలో బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కూడా ప్రవేశించింది. అయితే, బ్రిటన్ రకం కరోనాకు తోడు మరో కొత్తరకం స్ట్రెయిన్ (Covid US variant) అమెరికాలో వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది.

Donald Trump: గొంతు నొక్కేందుకు జరుగుతున్న కుట్ర, తన ట్విట్టర్ ఖాతా బ్యాన్‌పై స్పందించిన డొనాల్డ్ ట్రంప్, త్వరలో కీలక ప్రకటన చేస్తామని వెల్లడి, సొంత వేదికను ఏర్పాటు చేసే దిశగా అడుగులు

Hazarath Reddy

తన పదవీకాలం మరి కొద్ది రోజుల్లో ముగియనున్నా కూడా ట్రంప్ (Donald Trump) మాత్రం తన తీరు మార్చుకునేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా ట్విటర్ తనపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా కొత్త వ్యూహాలు పన్నుతున్నారు. తన ఖాతాపై శాశ్వత నిషేధం విధించిన ట్విటర్‌ (Twitter ban) నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. సోషల్‌ మీడియా దిగ్గజ తీరుపై మండిపడిన ఆయన.. ఇలాంటిదేదో జరుగుతుందని తాను ముందే ఊహించానన్నారు.

China Covid Update: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, రెండు ప్రధాన నగరాలు పూర్తిగా మూసివేత, తాజాగా 127 కరోనావైరస్ కేసులు, 183 మందిలో అసింప్టోమాటిక్ లక్షణాలు

Hazarath Reddy

మరోసారి కరోనా చైనాలో కల్లోలం రేపుతుండటంతో రెండు నగరాలను పూర్తిగా మూసివేసింది. రెండు నగరాలపై ఆ దేశం తీసుకున్న కఠిన చర్యలను తీసుకునేందుకు రెడీ అయింది. తాజాగా బీజింగ్ కు దక్షిణాన ఉన్న రెండు సిటీలను చైనా పూర్తిగా సీజ్ చేసింది. ఆ నగరాలకు రవాణా వ్యవస్థను కూడా ఆపేసింది. బయటి వారు అక్కడకు వెళ్లడానికి, అక్కడున్న వారు బయటకు రావడానికి వీల్లేకుండా చేసింది.

Advertisement

US Congress Certifies Biden's Win: జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడిగా అధికారికంగా ధ్రువీకరించిన యూఎస్ కాంగ్రెస్, ఎట్టకేలకు తలవంచిన ట్రంప్.. అధికార బదిలీకి సుముఖత, జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం

Team Latestly

తన ఎత్తులేమి పారకపోవడంతో ఇక డొనాల్డ్ ట్రంప్ దిగిరాక తప్పలేదు, ఎట్టకేలకు ఆయన దిగివస్తూ జో బైడెన్ కు అమెరికా అధ్యక్షుడిగా అధికార బదిలీకి చట్టబద్ధంగా సహకరిస్తానని ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ....

US Capital Violence: డొనాల్డ్ ట్రంప్ మద్ధతుదారుల అరాచకం, యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద హింసాత్మకంగా మారిన నిరసనలు, అల్లర్లలో నలుగురి మృతి, అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు

Team Latestly

కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్ డీసీ మేయర్ నగరంలో కర్ఫ్యూ విధించారు, అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ కూడా బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను కొంత మంది పాటించలేదు, దీంతో వాషింగ్టన్ డీసీలో 15 రోజుల పాటు ఎమెర్జెన్సీ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.....

Pfizer Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న నర్సు రెండు రోజులకే మృతి, పోర్చుగీస్‌లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సు ఆకస్మిక మరణానికి కారణం తెలపాలని కోరిన తండ్రి, విషాదం వ్యక్తం చేసిన పోర్చుగీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ

Hazarath Reddy

కరోనా వ్యాక్సిన్ వస్తుందనే ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో విషాదకర వార్త బయటకు వచ్చింది. పోర్చుగీసులో ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న నర్సు రెండు రోజుల తర్వాత (Portuguese Woman Dies) చనిపోయారు. ఈ విషయాన్ని డెయిల్ మెయిల్ రిపోర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ ( Pfizer Vaccine) పనితీరు పట్ల మరిన్నిఅనుమానుల, భయాలు రేకెత్తుతున్నాయి.

Jack Ma Suspected Missing: చైనా ప్రభుత్వంపై విమర్శలు, అలీబాబా ఫౌండర్ జాక్ మా మిస్సింగ్, గతేడాది అక్టోబర్‌ 24న చైనీస్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చైనీస్ బిలియనీర్

Hazarath Reddy

చైనా ప్రభుత్వంపై విమర్శలు చేసిన తరువాత చైనీస్‌ బిలియనీర్‌, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా కనిపించడం (Jack Ma Suspected Missing) మానేశారు. చైనా విధానాలు, దేశీయ బ్యాంకు పాలసీల గురించి జాక్‌ మా బహిరంగంగా విమర్శలు చేసిన నాటి నుంచి ఆయన మిస్ అయ్యారు. గతేడాది అక్టోబర్‌ 24న జాక్‌ మా షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో చైనీస్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement