World

Viral Video: భార్య బికినీ ధరించేందుకు ఏకంగా ఓ ఐలాండ్‌ను కొనేసిన భర్త, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Vikas M

తన భార్య బికినీ ధరించేందుకు వీలుగా ఓ భర్త ఏకంగా ఒక ఐలాండ్‌ను కొనేశాడు.దుబాయ్‌కి చెందిన సౌదీ అల్ నదక్ అనే 26 ఏళ్ల మహిళ ఈ విషయాన్ని చెప్పింది. ‘‘మీరు బికినీ ధరించాలని కోరుకున్నారు... మీ మిలియనీర్ భర్త ఐలాండ్ కొనేశాడు’’ అని ఆమె పేర్కొంది. ‘‘నా భర్త బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇదే’’ అనే పోస్టుపై క్యాప్షన్‌ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సౌదీ అల్ నదక్ ఈ వీడియోను పంచుకుంది.

Hindu Temple Defaced in US: అమెరికాలో మరో ఆలయంపై దాడి, హిందువులు దేశం వదిలి వెళ్లిపోవాలని గోడపై మెసేజ్‌లు, బాప్స్‌ శ్రీ స్వామి నారాయణ మందిరం ధ్వంసం

Hazarath Reddy

USలో ద్వేషపూరిత నేరాల సంఘటనలో, కాలిఫోర్నియాలోని BAPS శ్రీ స్వామినారాయణ్ మందిర్‌ను బుధవారం (సెప్టెంబర్ 25) హిందూ వ్యతిరేక గ్రాఫిటీ ధ్వంసం చేసింది, ఇది USలో 10 రోజులలో రెండవ సంఘటనగా గుర్తించబడింది.

Ai Powered Spam Detection Solution: స్పామ్ కాల్స్, మేసేజ్ ల‌కు చెక్ పెట్టేందుకు ఎయిర్ టెల్ సూప‌ర్ ప్లాన్, ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ తో ప‌నిచేసే వ్య‌వ‌స్థ ఏర్పాటు

VNS

“దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్‌వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను (Ai Powered Spam Detection) ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్‌హౌస్‌ టూల్‌గా ఎయిర్‌టెల్‌ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్‌, మెసేజ్‌లపై కస్టమర్‌లకు రియల్‌-టైమ్‌ అలర్ట్స్‌ను అందిస్తుంది.

Lebanon Blasts: లెబనాన్‌లో ఆగని వైమానిక దాడులు, జర్నలిస్టు ఇంటిపై పడ్డ మిస్సైల్..వీడియో ఇదిగో

Arun Charagonda

లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైవ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు ఇంటిపై మిస్సైల్ ప‌డింది. ఆ స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టు ఫాది బౌద‌యా వెనుక ఉన్న నిర్మాణ భాగం కూలిపోయింది.

Advertisement

Israel's Strikes in Lebanon: లెబ‌నాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు, 182 మంది మృతి, మరో 727 మందికి గాయాలు

Hazarath Reddy

లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇటీవలే పేజర్స్, వాకీ టాకీలను పేల్చివేసిన ఇజ్రాయెల్... తాజాగా భీకర వైమానిక దాడులు (Israel's Strikes in Lebanon) నిర్వహించింది. లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన వందలాది స్థావరాలపై విరుచుకుపడింది.

Anura Kumara Dissanayake: శ్రీలంక అధ్యక్షుడిగా తొలిసారిగా లెఫ్ట్ పార్టీ నేత, ప్రమాణ స్వీకారం చేసిన వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే, శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ

Hazarath Reddy

శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే (55) ప్రమాణస్వీకారం చేశారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు. కొలంబోలోని అధ్యక్ష సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Modi Hugs Devi Sri Prasad: ప్ర‌ధాని మోదీ సభ‌లో ఊర్రూత‌లూగించిన దేవిశ్రీ ప్ర‌సాద్‌.. గుండెలకు హత్తుకున్న ప్రధాని (వీడియో)

Rudra

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌నలో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఇండో-అమెరికన్ క‌మ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెద‌ర్' కార్యక్రమంలో పాల్గొన్న రాక్‌ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ (డీఎస్పీ) సందడి చేశారు.

US Presidential Election 2024: వచ్చే నవంబర్ లో జరిగే ఎన్నికల్లో నేను గనుక ఓడిపోతే ఇకపై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

Rudra

మరో 45 రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తమ శక్తినంతా ధారపోస్తున్నారు.

Advertisement

Israeli Air Strike On School: గాజాలో స్కూల్ పై విరుచుకుప‌డ్డ ఇజ్రాయిల్ సైన్యం, ఏడుగురు మృతి, భీతావ‌హంగా దృశ్యాలు

VNS

గాజా నగరంలోని ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల నేపథ్యంలో మృతులంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే, పాఠశాల ఆవరణలో ఉగ్రవాదులను ఇజ్రాయెల్‌ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. ఆదివారం ఉదయం సమయంలో కాఫర్‌ ఖాస్సెమ్‌ పాఠశాలపై దాడి జరిగిందని పాలస్తీన అధికారులు తెలిపారు.

Lebanon Pager Blasts: లెబనాన్ పేజర్ల పేలుడు కేసులో కేరళకు లింక్, పేజర్లను సరఫరా కంపెనీ కేరళ వ్యక్తిదే...అజ్ఞాతంలోకి వెళ్లిన రిన్సన్ జోస్!

Arun Charagonda

లెబనాన్ పేజర్ల పేలుడు కేసులో కేరళకు లింక్ వెలుగులోకి వచ్చింది. పేజర్లను సరఫరా చేసిన బల్గేరియా కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు కేరళలోని వాయనాడ్ కు చెందిన రిన్సన్ జోస్. కేరళ నుంచి నార్వేకు వలస వెళ్లారు 37 ఏళ్ల రిన్సన్ జోస్. తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ ట్రేడ్ మార్క్ లైసెన్స్ తో పేజర్ల తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రిన్సన్ జోస్.

Israel Strikes Hezbollah Targets: వీడియో ఇదిగో, హిజ్బొల్లా స్థావరాలపై మిలిటరీ రాకెట్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, పెద్ద ఎత్తున తగలబడుతున్న దృశ్యాలు వైరల్

Hazarath Reddy

లెబనాన్ లోని హిజ్బొల్లా లక్ష్యంగా గురువారం ఇజ్రాయెల్ మిలటరీ రాకెట్లతో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బొల్లాకు చెందిన పలు స్థావరాలను రాకెట్లతో ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ భూభాగంపైకి ప్రయోగానికి సిద్ధంగా ఉన్న 150 లాంచర్ బ్యారెల్స్, మిలటరీ మౌలిక సదుపాయాలు, భవనాలు, ఆయుధ గోడౌన్లను నాశనం చేసింది.

Reasons For NRIs Not Returning To India: ఇండియాలో నచ్చిన ఉద్యోగం దొరికే పరిస్థితిలేదు, రెడ్డిట్‌లో వైరల్ అవుతున్న ఎన్ఆర్ఐల డిబేట్

Hazarath Reddy

ఉన్నత విద్య కోసం, మంచి ఉద్యోగం కోసం ఏటా మన దేశం నుంచి వేలాది మంది విదేశాలకు వెళుతున్నారు.. అయితే, వెళ్లిన వారిలో తిరిగి వచ్చే వారి సంఖ్య మాత్రం వందల్లోనే ఉంటోంది.వెళ్లిన వాళ్లు అక్కడే స్థిరపడిపోతున్నారు.

Advertisement

Lebanon Pager Explosion: పేజర్లే కాదు పేలిన వాకీటాకీలు, ల్యాండ్ ఫోన్లు, వరుస పేలుళ్లతో లెబనాన్‌లో యుద్ధమేఘాలు, ఇజ్రాయెల్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని హిజ్బుల్లా హెచ్చరిక

Arun Charagonda

లెబనాన్‌లో వరుస పేలుళ్లతో కలకలం చోటు చేసుకుంది. మంగళవారం ;పేజర్ల పేలుళ్ల సంఘటన మర్చిపోకముందే మరోసారి వాకీటాకీలు, ల్యాండ్ ఫోన్లు పేలి 14 మంది మృతిచెందారు. పేజర్ పేలుళ్లల్లో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనల్లో 14 మంది మృతి చెందారని, 450 మంది గాయపడ్డారని తెలిపింది.

New Covid Variant XEC Symptoms: కొత్త కోవిడ్ వేరియంట్ XEC లక్షణాలు ఇవే, దీనికి విరుగుడు చికిత్స ఏంటంటే...

Vikas M

ప్ర‌మాద‌క‌ర‌మైన కోవిడ్ వేరియంట్ XEC (XEC Covid Variant) ప్ర‌స్తుతం ప్రపంచానికి ఆందోళనకరంగా మారింది. దీని ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని శాస్త్ర‌వేత్త‌లు వార్నింగ్ బెల్స్ మోగించారు. యూరోప్‌లో ఈ వైర‌స్ వేగంగా విస్తరిస్తూ డామినెంట్ స్ట్రెయిన్‌గా మారింది.

Donald Trump 3rd Assassination Attempt: డొనాల్డ్ ట్రంప్‌పై 3వసారి హత్యాయత్నం, కారు సమీపంలో భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Vikas M

లాంగ్ ఐలాండ్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో కారులో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొనడంతో మరో హత్యాయత్నం విఫలమైంది. సెప్టెంబరు 18, బుధవారం సాయంత్రం ట్రంప్ షెడ్యూల్ చేసిన ప్రసంగానికి కొన్ని గంటల ముందు కారు ర్యాలీ ప్రదేశానికి సమీపంలో పోలీసులు ఈ పధార్థాలను కనుగొన్నారు.

Walkie-Talkie Blasts in Lebanon: నిన్న పేజ‌ర్లు..ఇవాళ వాకీటాకీలు..లెబ‌నాన్ లో వ‌రుస పేలుళ్లు, వాకీ టాకీలు పేలి ముగ్గురు మృతి, ప‌లువురికి గాయాలు (వీడియో ఇదుగో)

VNS

లెబనాన్‌ (Lebanon)లో మరోసారి అనూహ్య దాడులు చోటుచేసుకున్నాయి. వేలాది పేజర్లు పేలిపోయిన ఘటన నుంచి తేరుకోకముందే.. తాజాగా వాకీటాకీ (Walkie Talkies)లు పేలినట్లు సమాచారం. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతి చెందిన ముగ్గురు హెజ్‌బొల్లా సభ్యులు, ఓ చిన్నారి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం

Advertisement

New XEC Covid Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పటికీ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. కోవిడ్-19 వైరస్ కాలానుగుణంగా అనేక విధాలుగా రూపాంతరం చెంది, వేరియంట్లు, సబ్ వేరియంట్లుగా వ్యాపిస్తోంది. తాజాగా, కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇది 27 దేశాలకు పాకడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

Pagers Explode: లెబనాన్‌లో పేలిన పేజర్లు, 9 మంది మృతి..2800 మందికి పైగా గాయాలు, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా ప్రకటన

Arun Charagonda

లెబనాన్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లా సంస్థ సభ్యులు వాడుతున్న పేజర్లు పేలాయి. లెబనాన్ దేశ వ్యాప్తంగా పలు చోట్ల పేలుళ్లు సంభవించగా ఈ ఘటనల్లో 9 మంది మృతి చెందగా 2800 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ అధికారులు వెల్లడించారు.

Typhoon Bebinca: గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్‌తో చైనా విలవిల, ఆర్థిక నగరం షాంఘై అస్తవ్యస్తం, రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు

Hazarath Reddy

గత 75 ఏండ్లలో ఎన్నడూ లేనంత భీకరమైన తుఫాన్‌ చైనాను తాకింది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో ప్రమాదకర టైఫూన్ తీరాన్ని దాటింది. బెబింకా కేటగిరీ-1 తుఫాను కావడంతో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసాయి.

Typhoon Yagi: మయన్మార్‌‌ను అతలాకుతలం చేసిన యాగీ తుపాను, వరదల బీభత్సానికి 226 మంది మృతి, మరో 77 మంది గల్లంతు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారీ వరదలతో మయన్మార్‌ (Myanmar) అతలాకుతలమైంది. యాగీ తుపాను (Typhoon Yagi) విరుచుకుపడటంతో దేశాన్ని వరదలు పోటెత్తాయి. దీంతో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 226 మంది మృతి చెందారు. మరో 77 మంది గల్లంతైనట్లు అధికారిక మీడియా వెల్లడించింది.

Advertisement
Advertisement