G20 Summit 2022: భారత్ చేతికి జీ20 దేశాల పగ్గాలు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి స్వీకరించిన ప్రధాని మోదీ, వచ్చే ఏడాది భారత్‌లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు
G20 Summit 2022 (Photo-Twitter/Video Grab)

Bali, Nov 17: జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు భారత్ కు చేతిలోకి వచ్చాయి.ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండో రోజు సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలను నరేంద్ర మోదీ స్వీకరించారు. ఏడాది పాటు (డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 20 దాకా) భారత్ జీ20 అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. వచ్చే ఏడాది భారత్ లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.

శాంతి కోసం ప్రపంచ నేతల సహకారం అవసరం, జీ20 సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రసంగం

బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా బుధవారం సభ్య దేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. జీ20 అధ్యక్ష బాధ్యతలు ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.

Here's Video

వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తామని కూడా మోదీ చెప్పుకొచ్చారు.