World’s First Living Robots Xenobots: పిల్లల్ని కనే రోబోలు వచ్చేశాయ్, మెరాకిల్ చేసిన అమెరికన్ సైంటిస్టులు, జీవమున్న రోబోలను సృష్టించి రికార్డ్‌

New York December 01: జీవం ఉన్న రోబోలు(Robots) వచ్చేశాయ్అవును మీరు విన్నది నిజమే! ప్రపంచంలోనే మొట్టమొదటి లివింగ్ రోబోట్స్(Living Robots) ను తయారు చేశారు శాస్త్రవేత్తలు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ తయారు చేసిన జీనోబాట్స్(Xenobots) అనే బుల్లిరోబోలుబేబీ రోబోలను(Baby Robots) ఉత్పత్తి(replicate) చేశాయి.

వందలాది జీనోబాట్‌లు ఒకదగ్గరగా చేరి బేబీ జీనోబాట్‌(Xenobots)లను ఉత్పత్తి చేశాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వెర్మాంట్‌(University of Vermont and Harvard ), టఫ్ట్స్‌ యూనివర్సిటీ, వైస్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు తెలిపారు. వీరు తొలిసారిగా 2020లో జీవమున్న రోబోను సృష్టించారు. 0.04 అంగుళం పరిమాణం అంటే మిల్లీమీటర్‌ కన్నా తక్కువ సైజున్న ఈ రోబోకు జీనోబాట్‌’(Xenobots) అని పేరు పెట్టారు. ఆఫ్రికన్‌ కప్ప పిండం నుంచి సేకరించిన మూలకణాలతో వారు ఈ బాట్‌ను తయారుచేశారు. అనంతరం కృత్రిమ మేధ సాయంతో ఈ రోబోకు విజయవంతంగా ప్రోగ్రామింగ్‌ను ప్రాసెస్‌ చేశారు. ఇలా జీనోబాట్‌ ఓ సజీవ రోబోగా తయారైంది.

Robotic Nurses in TN: తమిళనాడులో కరోనా కల్లోలం, రోబోలే నర్సులు, కరోనా రోగులకు ఆహారం, మందులు ఇచ్చేందుకు రంగంలోకి దిగిన రోబోలు, 411కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య

కప్ప పిండంతో తయారైన ఈ సజీవ రోబో.. తన హృదయ కణాల ప్రకంపనల సాయంతో కదలడంతో పాటు ఈదుతాయి. ఆహారం లేకుండా వారాల తరబడి బతకగలవు. గుంపులుగా కలిసి పనిచేయగలవు. అవసరాలకు తగినట్టుగా ప్రోగ్రామింగ్‌ చేసి వినియోగించుకోవచ్చు.

జీనోబాట్‌ తయారీ ప్రయోగం ఎంతో క్లిష్టంగా సాగింది. కప్ప పిండం నుంచి సేకరించిన మూలకణాలను పొదిగిన శాస్త్రవేత్తలు ఆ జీవమున్న కణాలను ముక్కలుగా చేసి.. సూపర్‌ కంప్యూటర్ల సాయంతో నిర్ణీత రూపాల్లోకి మార్చారు. సాధారణంగా ఇలా ముక్క లు చేసినప్పుడు ఏ కణమైన తన జీవాన్ని కోల్పోతుంది. అయితే, అనూహ్యంగా జీనోబాట్‌లు తమకు జరిగిన గాయాలను తమంతటతామే మాన్పుకొన్నాయి. అందుకే వీటిని సజీవ యంత్రాలుగా అభివర్ణిస్తున్నారు.

జీనోబాట్‌ల సాయంతో పుట్టుకతో వచ్చే లోపాలను కణ పరిశోధనల సాయంతో నివారించవచ్చు. శరీరంలో ఏర్పడ్డ అవాంఛనీయ గడ్డలను సాధారణ కణాలుగా రీప్రోగ్రామింగ్‌ చేయవచ్చు. అవసరమైన శరీర భాగాలకు మందులు చేరవేయొచ్చు. రక్తనాళాల్లోని కొవ్వును తొలగించవచ్చు. వృద్ధాప్యాన్ని కూడా జయించే అవకాశమున్నదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.