Entertainment

Tamannaah Bhatia: కుర్రకారు మతి పోగొడుతున్న తమన్నా భాటియా, అరణ్మనై 4 ప్రమోషన్‌ కోసం సరికొత్తగా..

Vikas M

తమన్నా భాటియా తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని రుజువు చేస్తోంది! అరణ్మనై 4 ప్రమోషన్ల కోసం ఈ నటి తన అద్భుతమైన లుక్‌తో అభిమానుల నోరు మూయించింది . సాధారణ రెడ్ కార్పెట్ గౌన్‌లను వదులుతూ, ఆమె హౌస్ ఆఫ్ మసాబా కస్టమ్-డిజైన్ చేసిన ఆకర్షణీయమైన సమిష్టిని ఎంచుకుంది.

Jabardasth Show: జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్, ఇక‌పై ఆ షో ఉండ‌దు, క‌న్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్, ర‌ష్మీ

VNS

ప్రస్తుతం గురు, శుక్ర వారాలు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వస్తున్నాయి. అయితే ఎక్స్‌ట్రా జబర్దస్త్ తీసేసి ఒకే పేరు జబర్దస్త్ తో శుక్ర, శని వారాలు రెండు ఎపిసోడ్స్ గా రానున్నట్టు తాజా ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రష్మీ తెలిపింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్ షో తీసేస్తుండటంతో యాంకర్ రష్మీ (Rashmi) ఏడ్చేసింది. రష్మీతో పాటు పలువురు కంటెస్టెంట్స్, జడ్జిలు కూడా ఎమోషనల్ అయ్యారు.

Ajith Kumar Rides His Superbike in Hyderabad: వీడియో ఇదిగో, తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొట్టిన హీరో అజిత్‌ కుమార్

Vikas M

స్టార్ హీరో అజిత్ కుమార్ సోమవారం సాయంత్రం తన సూపర్‌బైక్‌పై హైదరాబాద్‌ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కాగా అజిత్ తాజాగా నటిస్తోన్న యాక్షన్‌ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)’. మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని అధిక్‌ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు

NTR's 101st Birth Anniversary: ఎన్టీఆర్‌ 101వ జయంతి, ఘనంగా నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఎమోషనల్ ట్వీట్ ఇదిగో..

Vikas M

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ (NTR) 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో నటులు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, పురందేశ్వరి అంజలి ఘటించారు

Advertisement

NTR's 101st Birth Anniversary: ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చిరంజీవి డిమాండ్, ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపిన మెగాస్టార్

Vikas M

నేడు ఎన్‌టీఆర్‌ 101వ జయంతి సంద‌ర్భంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు నివాళులు ఆర్పిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్‌టీఆర్‌ను స్మరించుకుంటూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం సముచితమని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Johnny Wactor Shot Dead: హలీవుడ్‌ ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్‌పై కాల్పులు జరిపిన దుండగులు, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Vikas M

హలీవుడ్‌ ప్రముఖ యాక్టర్ జానీ వాక్టర్‌(37)ను కొందరు దండగులు కాల్చిచంపారు. లాస్ ఏంజిల్స్‌లోని పికో బౌలేవార్డ్, హోప్ స్ట్రీట్ ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన వాక్టర్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు నిర్ధారించారు.

Balakrishna Met CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌, మ‌ర్యాద‌పూర్వ‌క భేటీనా? ట్ర‌స్ట్ ప‌నికోస‌మేనా?

VNS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (Revanth reddy) తెలుగుదేశం పార్టీ నేత టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉద‌యం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంత‌రం ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.

Anasuya Bharadwaj: వామ్మో.. అనసూయ ఇలా తయ్యారైంది ఏంటి అంటూ అవాక్కవుతున్న నెటిజన్లు, తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తూ..

Vikas M

Advertisement

Laila Khan Murder Case: ప్రముఖ నటి లైలా ఖాన్ హత్య కేసులో సవతి తండ్రికి ఉరిశిక్ష, 13 సంవత్సరాల తర్వాత కీలక తీర్పును వెలువరించిన ధర్మాసనం

Hazarath Reddy

మే 24న సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తీర్పులో, ముంబైలోని సెషన్స్ కోర్టు 2011లో తన సవతి కూతురు, ఐదుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసినందుకు నటి లైలా ఖాన్ సవతి తండ్రి పర్వేజ్ తక్‌కు మరణశిక్ష విధించింది. 13 సంవత్సరాల క్రితం వారి ఇగత్‌పురి ఫామ్‌హౌస్‌లో జరిగిన మారణకాండ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Bengaluru Rave Party Case: బెంగళూరు రేవ్‌ పార్టీ దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు, ఇద్దరు తెలుగు నటీనటులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో 103 మందికి డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. పలువురు నటుల రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలిపారు

Pushpa 2 Sooseki Song: సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి, పుష్ప 2 నుండి రెండో సాంగ్ అప్‌డేట్ వచ్చేసింది, మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్

Vikas M

Bharateeyudu 2 First Song: గూస్ బంప్స్ తెప్పిస్తున్న భారతీయుడు 2 శౌర సాంగ్, జులై 12న సరికొత్త రికార్డు సెట్ చేసేందుకు రెడీ అవుతున్న మూవీ

Vikas M

స్టార్ హీరె క‌మ‌ల్ హాస‌న్‌ .. దర్శకుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.

Advertisement

Indian 2 - Paaraa Lyric Video: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఇండియన్ 2 పారా సాంగ్, జులై 12న సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్న మూవీ

Vikas M

స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌ .. దర్శకుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘ భార‌తీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.

Shah Rukh Khan Hospitalised: అస్వ‌స్థ‌తకు గురైన షారుక్ ఖాన్, అహ్మ‌దాబాద్ ఆస్ప‌త్రిలో ట్రీట్ మెంట్, ప్లే ఆఫ్స్ మ్యాచ్ సంద‌ర్భంగా అనారోగ్యం

VNS

బాలీవుడ్‌ నటుడు, కోల్‌కతా ఐపీఎల్‌ జట్టు సహ యజమాని షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కోల్‌కతా (KKR), సన్‌ రైజర్స్‌ (SRH) హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కోసం అహ్మదాబాద్‌కు వచ్చిన ఆయనకు ఎండ వేడిమి వల్ల వడదెబ్బ తగిలినట్లు (Sun Stroke) తెలుస్తోంది.

Indian 2 Paraa Song Promo: ఇండియన్‌-2 నుంచి పారా ఫస్ట్ సింగిల్‌ ప్రోమో వచ్చేసింది, రేపు సాయంత్రం 5 గంటలకు పుల్ సాంగ్ విడుదల

Vikas M

కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్‌లో లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. తాజాగా ఈ మూవీ నుంచి పారా అనే ఫస్ట్ సింగిల్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ఫుల్‌ సాంగ్‌ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.

Jaya Jaya He Telangana: ఒకటిన్నర నిమిషం నిడివిలో జయ జయహే తెలంగాణ, సంగీతం అందించనున్న సంగీత దర్శకుడు కీరవాణి, జూన్2న రాష్ట్ర ప్రజలకు అంకితం

Vikas M

ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివిలో ఈ గీతం సిద్ధం అవుతోంది. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. కాగా తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీకి కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది.

Advertisement

Naga Chaitanya Porsche Car: దాదాపు రూ.3.51 కోట్లు పెట్టి పోర్షే కారును కొనుగోలు చేసిన నాగచైతన్య, సోషల్ మీడియాలో కారు ఫోటోలు వైరల్

Vikas M

సౌత్ ఇండియన్ హీరో అక్కినేని నాగ చైతన్యకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని కొత్త కార్లు కొనుగోలు చేస్తుంటారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కారు ప్రియులకు కలల యంత్రం అయిన పోర్షే 911 GT3 RSని కొనుగోలు చేశారు. మే 17న రిజిస్టర్ అయిన ఈ కారు భారతదేశంలో దాదాపు రూ.3.51 కోట్ల భారీ ధరను కలిగి ఉంది.

Bengaluru Rave Party: వీడియో ఇదిగో, బెంగుళూరు రేవ్ పార్టీలో నేను లేను, అతను నాలాగే ఉన్నాడు, చూసి షాకయ్యానని తెలిపిన హీరో శ్రీకాంత్

Vikas M

బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తాను అస‌లు ఆ పార్టీలకు ఏనాడూ వెళ్లలేదేని సినీ న‌టుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విష‌యంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ త‌న ఇంట్లో నుంచి ప్రత్యేకంగా వీడియోను విడుద‌ల చేశారు. రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే సంస్కృతి తనది కాదని వెల్లడించారు.

Viral Video: స్టార్‌ హీరోయిన్ తాప్సీ ఎదురుగా ఉన్నా పట్టించుకోని స్విగ్గీ డెలివరీ బాయ్‌, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Vikas M

ముంబయిలోని ఓ సెలూన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. ఇంతలో ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అనుకోకుండా అదే సమయంలో సెలూన్‌ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్‌ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్‌ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు.

Bengaluru: బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ తెలుగు హీరోలు, సుమారు 15 విలువైన కార్లను సీజ్‌, వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ కలకలం రేపింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌ అనేది హైదరాబాద్‌‌కు చెందిన గోపాల్‌ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది.

Advertisement
Advertisement