ఎంటర్టైన్మెంట్
Vishwak Sen Getting Married: పెళ్లిపీటలెక్కనున్న మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్, ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్, త్వరలోనే పూర్తి వివరాలంటూ సస్పెన్స్‌
VNSటాలీవుడ్ ఒక్కో యంగ్ హీరో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇటీవల శర్వానంద్ (Sharwanand) ఏడడుగులు వేయగా, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ రింగ్ మార్చుకొని మూడు ముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కూడా పెళ్ళికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
Google Doodle: అతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. శ్రీదేవి గౌరవార్థం గూగుల్ స్పెషల్ డూడుల్ లోగో విడుదల
Rudraఅతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. శ్రీదేవి గౌరవార్థం గూగుల్ స్పెషల్ డూడుల్ లోగో విడుదల చేసింది. దాన్ని మీరూ చూడండి.
Rajinikanth in Himalayas: నాలుగేళ్ల తర్వాత హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్, ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్
Hazarath Reddyక‌రోనా వ‌ల్ల గ‌త నాలుగు సంవ‌త్సరాలు హిమాలయాల‌కు దూరంగా ఉన్న ర‌జినీ త‌న తాజా సినిమా జైల‌ర్ విడుద‌ల‌కు ముందు హిమాలయాలకు వెళ్లారు.త‌న స్నేహితుల‌తో క‌లిసి ర‌జనీ హిమాలయాలకు వెళ్లగా.. వంతెనపై త‌న స్నేహితులతో క‌లిసి ఫోటోలు దిగాడు.
Actress Jaya Prada: జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించిన చెన్నై కోర్టు, కార్మికులకు ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించలేదని కేసు పెట్టిన కార్మిక బీమా కార్పోరేషన్‌
Hazarath Reddyసీనియర్‌ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు చెన్నై ఎగ్మోర్‌ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది.దీంతో పాటుగా జరిమానా కూడా విధించింది
Adipurush on OTT: అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన ఆది పురుష్, ప్రైమ్ ఖాతాదారులు అదనంగా రూ.279 కడితేనే సినిమా చూసేందుకు అవకాశం
Hazarath Reddyరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర 'ఆదిపురుష్'. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించగా జానకి పాత్రలో కృతీ సనన్ నటించింది.
Bholaa Shankar Movie: భోళా శంకర్ టికెట్ల ధర పెంపు వార్తలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన, ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం, నమ్మవద్దని సూచన
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు అందించాలంటూ నిర్మాణ సంస్థను కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని తెలిపింది.
Bhola shankar Movie: భోళా శంకర్ సినిమా నిలిపివేత, అనుమతి లేకుండా అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారంటూ సినిమాను అడ్డుకున్న పోలీసులు
Hazarath Reddyభోళా శంకర్ సినిమాకు బాపట్లలో ఎదురుదెబ్బ తగిలింది. బాపట్లలోని SSV థియేటర్లో భోళాశంకర్ సినిమా అనుమతి లేకపోయినా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ సినిమాను పోలీసులు అడ్డుకున్నారు.
Bhola Shankar: గూగుల్ మ్యాప్ రూట్‌లో చిరంజీవి, వినూత్నంగా అభిమానం చాటుకున్న అభిమానులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదిగో..
Hazarath Reddyచిరంజీవిపై అభిమానులు సరికొత్తగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్‌ మ్యాప్స్‌లో ఆయన చిత్రాన్ని గీసి మెగాస్టార్ పట్ల తమకున్న అభిమానం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.మెగాస్టార్‌ ముఖాకృతిని పోలేలా గూగుల్ రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు
Bholaa Shankar Twitter Review: భోళా శంకర్ రివ్యూ ఇదిగో, ట్విట్టర్లో సినిమాపై అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, మరి వారేమంటున్నారో ట్వీట్లలో చూసేయండి
Hazarath Reddyమెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘వేదాళం’కు తెలుగు రీమేక్‌ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేశ్‌, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు.
Jailer Movie Review: జైలర్ సినిమాతో రజనీకాంత్ హిట్ కొట్టాడా, సినిమా కథనం ఎలా ఉంది, పాత్రలు ఎవరివి ఎలా ఉన్నాయి, తలైవా జైలర్ రివ్యూ ఇదిగో..
Hazarath Reddyచాలా రోజుల నుంచి తలైవా రజనీకాంత్ సూపర్ హిట్ కోసం చూస్తున్నాడు. తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంపై చాలా బజ్ క్రియేట్ అయింది. జైలర్ తో తలైవా హిట్ అందుకున్నాడా? సినిమా ఎలా ఉంది? రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌ కీలక పాత్రల్లో నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన ఈ చిత్రం నేడు ధియేటర్లలో విడుదలైంది.
Chiranjeevi Comments Ruckus: చిరంజీవి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం, ప్రత్యేక హోదా వెనుక ఇంత కథ దాగుందా, బీజేపీ మద్దతు ఇవ్వడంపై రాజకీయాల్లో మొదలైన చర్చ
Hazarath Reddyఏపీలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో నటుడు చిరంజీవి చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేశాయి. ఆయన వ్యాఖ్యలు నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లుగా తెలుస్తోంది.
Bholashankar's Movie: చిరంజీవి భోళాశంకర్ మూవీకి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిరాకరించిన జగన్ సర్కారు
Hazarath Reddyఈ నెల 11న రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు.
Dhanush Tweet on Jailer: భార్యకు దూరంగా ఉన్నా మామ మీద ప్రేమను మరోసారి చాటుకున్న ధనుష్, ఇట్స్‌ జైలర్‌ వీక్‌ అంటూ ట్విట్టర్లో ట్వీట్
Hazarath Reddyకోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్‌.. రజనీకాంత్ కొత్త సినిమా జైలర్ గురించి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇట్స్‌ జైలర్‌ వీక్‌ (ఇది జైలర్‌ వారం) అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ధనుష్‌ అభిమానులు తాను ముందు రజనీకాంత్‌ అభిమాని అని.. ఆ తర్వాతే అన్నీ అని ధనుష్‌ మరోసారి నిరూపించారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు
Jr NTR's New Look: జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ఇదిగో, గుబురు గడ్డం, కళ్ళకి గ్లాసెస్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న ఫోటో
Hazarath Reddyఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుబురు గడ్డం, కళ్ళకి గ్లాసెస్‌తో ఎన్టీఆర్ కూర్చున్న తీరు చూస్తుంటే.. టైగర్ తీక్షణంగా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఈ ఫోటోని అలీమ్ హకీమ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్ అవుతుంది
Bhola Shankar: భోళా శంకర్‌ మూవీకి షాక్, నా డబ్బులు తిరిగి ఇచ్చే వరకు విడుదల ఆపాలని కోర్టు మెట్లెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతల నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
Hazarath Reddyభోళా శంకర్‌ సినిమాను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టు మెట్లెక్కారు. తాజాగా తనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. పిటిషన్‌ వెనక్కు తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు.
Guntur Kaaram Poster: మాస్‌ లుక్‌లో మహేష్ బాబు, గుంటూరు కారం నుంచి ఫస్ట్ మాస్‌ లుక్‌ పోస్టర్ విడుదల, సూపర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా హీటెక్కిస్తున్న గుంటూరు కారం
VNSమహేష్ బాబు (Mahesh babu) అంటేనే క్లాస్‌. రెండు, మూడు మాస్‌ సినిమాలు చేసిన కామన్‌ ఆడియెన్స్‌ మాత్రం మహేష్‌ను క్లాస్‌ హీరోగానే చూస్తుంటారు. విజిల్స్‌ వేయించే ఫైట్స్‌, ఈలలు వేయించే డైలాగ్స్‌ ఎన్ని చెప్పినా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలలో క్లాస్‌ అంటే గుర్తొచ్చేది ఆయనే. పైగా ఈ మధ్య మహేష్‌ నుంచి సాలిడ్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమానే రాలేద.
Chiranjeevi: వైరల్ అవుతున్న చిరంజీవి వ్యాఖ్యలు, జనసేనకు సపోర్ట్ చేస్తారనే వార్తలకు ఈ కామెంట్లు బలం చేకూరినట్లేనా..
Hazarath Reddyమీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం గురించి ఆలోచించాలని, సంక్షేమ పథకాలు, ఉద్యోగ-ఉపాధి అంశాలపై దృష్టిసారించాలన్నారు. పేదరికం కడుపు నింపే దిశగా ఆలోచించాలని, అలాచేసినప్పుడే ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని ఆగ్రహం వ్యక్తంచేశారు
Pushpa 2 Update: పుష్ప 2 విలన్ పాత్ర పోస్టర్ విడుదల చేసిన టీం, సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్న ఫహాద్ ఫాజిల్
Hazarath Reddyఈ రోజు ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ టీమ్ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘పుష్ప ది రూల్’ నుంచి ఫహాద్ లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్నాడు నటుడు
Women Danced to Naatu Naatu: లండన్ వీధుల్లో చీరలు కట్టుకుని నాటు నాటు పాటకు డ్యాన్స్ వేసిన 700 మంది మహిళలు, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం
Hazarath Reddyలండన్ వీధుల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన 700 మంది మహిళలు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్లోని 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద నాటు నాటు పాటకు 700 మంది మహిళలు చక్కగా చీర కట్టుకొని స్టెప్పులేస్తూ సందడి చేశారు. వీడియో ఇదిగో..
Malayalam Director Siddique: మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ కు గుండెపోటు... పరిస్థితి విషమం
Rudraమలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ గుండెపోటుతో కొచ్చిలోని ఆసుపత్రిలో చేరారు. 69 ఏళ్ల ఈ దర్శకుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.