సినిమా
CCL 2023, Bengal Tigers vs Telugu Warriors: మరోసారి దుమ్ము లేపిన అఖిల్ అక్కినేని, బెంగాల్ టైగర్స్ జట్టును చిత్తు చేసిన తెలుగు వారియర్స్ జట్టు..
kanhaసెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా శనివారం బెంగాల్ టైగర్స్ తో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో, తెలుగు వారియర్స్ జట్టు భారీ విజయం నమోదు చేసింది.
RRR: అంతర్జాతీయ వేదికలపై 'ఆర్ఆర్ఆర్' సత్తా.. హాలీవుడ్ క్రిటెక్స్ అవార్డుల్లో ఏకంగా ఐదు పురస్కారాలు సొంతం
Rudraజూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. తాజాగా ఈరోజు అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టేసి ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.
Surprise Offer: అమృత గానంతో అలరించిన ఆ బీహారీ ఇటుకబట్టీ కార్మికుడు గుర్తున్నాడా? ఇప్పుడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సినిమాలో పాడబోతున్నాడు..
Rudraఅమర్‌జీత్ వీడియోను చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఫతే’ చిత్రంలో అతడికి పాడే అవకాశాన్ని కల్పించారు.
Harvey Weinstein: హోటల్ గదిలో 80 మంది హీరోయిన్లపై ప్రముఖ నిర్మాత అత్యాచారం, 16 ఏళ్ళు జైలు శిక్ష విధించిన కోర్టు, ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్న హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌
Hazarath Reddyహాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌(70) లైంగిక వేధింపుల వ్యవహారంలో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పదేళ్ల కిత్రం యూరోయపిన్‌ నటిపై బెవర్లీ హిల్స్‌ హోటల్‌ గదిలో అత్యాచారానికి పాల్పడినందుకు లాస్‌ ఏంజెల్స్‌ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది.
Ram Charan @ GMA3: పుట్టబోయే పిలల్లను ఎలా పెంచుతానంటే? అమెరికన్ షోలో ఆసక్తికర అంశాలను పంచుకున్న రామ్ చరణ్, న్యూయార్క్ లో చెర్రీ క్రేజ్ మామూలుగా లేదుగా..
VNSఇంతవరకు టాలీవుడ్ లో మరెవరికీ ఈ ఘనత దక్కలేదు. RRR సినిమాతో పాటూ తన పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు విషయాలను షేర్ చేసుకున్నారు రామ్ చరణ్‌. తనకు పుట్టబోయే పిల్లలను ఎలా పెంచాలనుకుంటున్నాను, తన వైఫ్ ఉపాసన (Upasana) గురించి పలు ఆసక్తికరమైన అంశాలను ఈ షోలో పంచుకున్నారు.
Mark Antony Movie: వీడియో ఇదే.. చావుకు దగ్గరగా వెళ్లిన హీరో విశాల్, అదుపుతప్పి వేగంగా వచ్చిన ట్రక్కు, హీరో పక్క నుంచే వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న యూనిట్
Hazarath Reddyకోలీవుడ్‌ హీరో విశాల్‌ మార్క్‌ ఆంటోని' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి విదితమే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు.. కింద పడి ఉన్న విశాల్‌ పక్క నుంచే వెళ్లింది.
Prabhu Health Update: ప్రముఖ సినీ నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి, యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు తెలిపిన వైద్యులు
Hazarath Reddyప్రముఖ సినీ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన (Tollywood Veteran actor Prabhu) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో (kidney stones treatment) బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
Oscars 2023: ఆస్కార్ అవార్డు కోసమేనా.. 20 రోజులు ముందుగానే అమెరికాకు రామ్ చరణ్, నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటున్న అభిమానులు
Hazarath Reddyమార్చి 12న ఆస్కార్‌ అవార్డుల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అమెరికాకు వెళ్లాడు. ఈ కార్యక్రమానికి సూమారు 20 రోజులు ముందుగానే రామ్‌ చరణ్‌ అమెరికాకు వెళ్లడం గమనార్హం.ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే.
G.G. Krishna Rao Dies: తారకరత్న మరణం మరువక ముందే..సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ప్రముఖులు
Hazarath Reddyసినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌ పని చేసిన జీజీ కృష్ణారావు(87) ఈ రోజు ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Dadasaheb Phalke International Film Festival Awards 2023: ఉత్తమ నటుడు రణ్‌బీర్, ఉత్తమ నటి అలియా.. మన ఆర్ఆర్ఆర్ కూ అవార్డు.. దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితా ఏమిటంటే??
Rudraదాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల పురస్కార వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ లో పలువురు స్టార్స్ అలియా భట్, వరుణ్ ధావన్, అనుపమ్ ఖేర్, రేఖ, దుల్కర్ సల్మాన్ తో పాటు కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి తదితరులు హాజరయ్యి సందడి చేశారు.
Attack On Sonu Nigam: స్టార్ సింగర్ సోనూ నిగమ్ పై దాడి.. ఆసుపత్రికి తరలింపు.. వీడియో
Rudraప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ పై దాడి జరిగింది. ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోను నిగమ్ బృందంపై కొంతమంది దాడికి పాల్పడ్డారు.
Taraka Ratna Last Rites: ముగిసిన తారకరత్న అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తండ్రి మోహన కృష్ణ, మహాప్రస్థానంలో తారకరత్నకు కన్నీటి వీడ్కోలు
Hazarath Reddyనందమూరి తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. తండ్రి మోహన కృష్ణ కుమారుడికి అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. హైదరాబాద్ మహా ప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, నారా లోకేష్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
Bandla Ganesh Tweet: పక్క పక్కనే కూర్చున్న విజయసాయి రెడ్డి, చంద్రబాబు, ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేసిన నిర్మాత బండ్ల గణేశ్, తప్పుబడుతూ కామెంట్
Hazarath Reddyనందమూరి తారకరత్న భౌతిక కాయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాళి అర్పించారు. కాగా ఈ ఇద్దరూ చాలా సేపు తారకరత్న నివాసంలో ఉన్నారు. ఒకే సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Director Bhagavan Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, దిగ్గజ కన్నడ దర్శకుడు ఎస్కే భగవాన్ కన్నుమూత, సంతాపం తెలిపిన కర్ణాటక సీఎం బొమ్మై
Hazarath Reddyకన్నడ సినీ దర్శకుడు ఎస్కే భగవాన్ బెంగళూరులో కన్నుమూశారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్‌కే భగవాన్ మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబానికి ఈ బాధను భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు.
RRR Awards: ఆర్ఆర్ఆర్ చిత్రానికి మరో రెండు విదేశీ అవార్డులు.. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ పురస్కారాల్లో ఉత్తమ విదేశీ చిత్రంగా అవార్డ్ కైవసం
Rudraదిగ్గజ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలిచి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ రేసులో ఉన్న ఈ చిత్రం తాజాగా, మరో రెండు విదేశీ అవార్డులనూ కొల్లగొట్టింది. హూస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచింది.
Taraka Ratna No More: హైదరాబాద్ చేరుకున్న తారకరత్న పార్దీవదేహం.. ప్రముఖుల సంతాపం.. భౌతిక కాయాన్ని చూడటానికి క్యూకట్టిన అభిమానులు, రేపు అంత్యక్రియలు.. వీడియోతో
Rudraతెలుగు సినీ నటుడు నందమూరి తారకరత్న గత నెల 27న తీవ్ర గుండెపోటుకు గురై, గత 23 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. తారకరత్న భౌతిక కాయం బెంగళూరు నుంచి ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకున్నది.
Taraka Ratna Death: నందమూరి తారకరత్న కన్నుమూత, 23 రోజుల పాటూ మృత్యువుతో పోరాటం, రేపు హైదరాబాద్ కు తారకరత్న భౌతికకాయం
VNSసినీ నటుడు నందమూరి తారకతరత్న (Taraka ratna) కన్నుమూశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో 23 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన…పరిస్థితి విషమించడంతో మరణించారు (Taraka ratna Death). కుప్పంలో లోకేశ్ యాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన ఆయన్ను….మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అక్కడ నిపుణుల బృందం ఆయనకు ట్రీట్ మెంట్ చేసినప్పటికీ….ఫలితం కనిపించలేదు
Kangana Supports Rajamouli: మతం వివాదంలో దర్శకధీరుడు రాజమౌళి, సోషల్ మీడియాలో ట్రోలింగ్, జక్కన్నకు మద్దతుగా వరుస ట్వీట్లు చేసిన కంగనా
VNSఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రామాయణం, మహాభారతం మీ చిత్రాలను ఎలా ప్రభావితం చేశాయి అంటూ విలేకరి ప్రశ్నించగా, రాజమౌళి బదులిస్తూ.. నా చిన్నతనంలో ఆ గ్రంధాల్లోని కథలు వింటూ, చదువుతూ పెరిగాను.
Project K Biggest Update: ప్రభాస్ కొత్త మూవీ బిగ్గెస్ట్ అప్‌డేట్! వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రెబల్ స్టార్, రిలీజ్ డేట్ ప్రకటించిన ప్రాజెక్ట్ కే
VNSయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (PRABHAS) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కే (Project K) కు సంబంధించి బిగ్ అప్‌ డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది టీమ్. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ప్రాజెక్ట్ కే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ (PRABHAS) సరసన దీపికా పదుకొనె (DEEPIKA) నటిస్తోంది.
James Cameron: రామ్ చరణ్ పై దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రశంసలు... పుత్రోత్సాహంతో చిరంజీవి ట్వీట్
Rudraఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో ఉంది. ఈ క్రమంలో హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ పై మరోసారి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలో రామ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నదని పేర్కొన్నారు.