Mahesh-Rajamouli: కొత్త ఏడాది ఆరంభంలోనే రాజమౌళితో సెట్స్ పైకి మహేశ్ మూవీ.. మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు.. ఈ నెలలోనే మొదలుకానున్న ప్రాజెక్టు.. తరువాత ప్రాజెక్టు రాజమౌళితో.. జనవరి 26వ తేదీన లాంచ్ చేసే ఆలోచన

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 28వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ వారంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఆ తరువాత సినిమాను రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది.

Mahesh-Rajamouli: కొత్త ఏడాది ఆరంభంలోనే రాజమౌళితో సెట్స్ పైకి మహేశ్ మూవీ.. మహేశ్ 28వ సినిమాకి సన్నాహాలు.. ఈ నెలలోనే మొదలుకానున్న ప్రాజెక్టు.. తరువాత ప్రాజెక్టు రాజమౌళితో.. జనవరి 26వ తేదీన లాంచ్ చేసే ఆలోచన

Hyderabad, September 12: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం తన 28వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించనున్నాడు. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ వారంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ (Regular Shooting) మొదలవుతుందని అంటున్నారు. ఆ తరువాత సినిమాను రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది.

పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య, దుర్గం చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న సాయి, విషాదంలో ఇండస్ట్రీ, ఉద్యోగం కోసం కాళ్లు అరిగేలా తిరిగిన సాయికుమార్

జనవరి 26వ తేదీన ఈ సినిమా షూటింగును లాంఛనంగా ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఆ దిశ గానే పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది దక్షిణాఫ్రికా (South Africa) నేపథ్యంలో నడిచే అడ్వెంచర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పవలసిన పనే లేదు.

(The above story first appeared on LatestLY on Sep 12, 2022 10:51 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).