Kishan Reddy Met Balakrishna:

కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో కలిసి, పద్మభూషణ్ అవార్డును అందుకున్నందుకు అభినందించారు. ఇక నందమూరి బాలకృష్ణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పద్మభూషణ్ అవార్డుకు పూర్తిగా అర్హులంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తెలుగు సినిమాకు అందించిన సేవలకు సరైన గుర్తింపు లభించిందన్నారు. అజిత్ కుమార్‌ సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా పద్మ అవార్డులకు ఎంపికైన శోభన, శేఖర్ కపూర్‌, అనంత్‌ నాగ్‌లకు అభినందనలు తెలిపారు. పద్మ అవార్డులు సాధించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. కళల విభాగంలో గుర్తింపు దక్కడం నా హృదయాన్ని సంతోషంతో నింపిందని అల్లు అర్జున్‌ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ‍ప్రకటించింది.

వీడియో ఇదిగో, మరోసారి సింగర్ అవతారం ఎత్తిన బాలయ్య, పక్కనున్న లేడీ సింగర్‌ని లాగి మరీ పాడిన నందమూరి నటసింహం

సినీ రంగానికి చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం తనకు పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించడం పట్ల కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నాకు పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించిన సందర్భంగా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాతో పాలుపంచుకున్న తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, కుటుంబ సభ్యులు, యావత్‌ చలన చిత్ర రంగానికీ ధన్యవాదాలు.

Kishan Reddy Met Balakrishna:

Allu Arjun Tweet

నా తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు నుంచి ఆయన వారసుడిగా నేటి వరకు నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటా’’ అని పేర్కొన్నారు (Balakrishna About Padmabhushan Honour). ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. ఇక బాలయ్య పద్మభూషణ్‌ పురస్కారం దక్కించుకోవడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీతారలు నాని, సాయి దుర్గా తేజ్, రామ్‌ పోతినేని, వరుణ్‌ తేజ్, బాబీ, వై.వి.ఎస్‌.చౌదరి, ప్రశాంత్‌ వర్మ, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తదితరులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు అభినందనలు తెలిపారు.