Hyd, Jan 26: రాష్ట్రంలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతు భరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ(New Ration Cards) వంటి పథకాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. అర్ధరాత్రి 12 గంటల తర్వాత డబ్బులు జమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద.. ఒక్కో ఎకరానికి రూ.6 వేల చొప్పున, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రైతు కూలీల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున డబ్బులు టకీ టకీమని జమవుతాయని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల(Telangana Farmers) రుణమాఫీలో ముందంజ వేసిందని చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రూ.2 లక్షల వరకూ రుణమాఫీ చేశాం అని... 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21,000 కోట్ల నిధులు జమచేశాం అని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు కోసం గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. రిపబ్లిక్ డే.. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న యువకులు.. తాటి చెట్టుపైకి ఎక్కి త్రివర్ణ పతకం ఆవిష్కరణ, వీడియో ఇదిగో
కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ కూడా మార్చి 31వరకు నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందించటమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లోకి అధికారులు డబ్బులు జమ చేసి.. ఆ తర్వాత గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులు సంగతి తేలుస్తారని చెప్పుకొచ్చారు.