Actress Swsika Vijay Remarriage

Thiruvananthapuram, JAN 26: ఎటు చూసినా నువ్వే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మలయాళ ముద్దుగుమ్మ స్వాసికా విజయ్‌ (Swsika Vijay). ఈ భామ గతేడాది జనవరి 26న తన చిరకాల ప్రియుడు, యాక్టర్ ప్రేమ్‌ (Prem)ను పెళ్లి చేసుకుంది. కేరళ సంప్రదాయ పద్దతిలో ఈ ఇద్దరి వివాహ వేడుక జరిగింది. అయితే ఈ క్రేజీ కపుల్‌ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని విభిన్నంగా జరుపుకోవాలనుకున్నారు. మరోసారి తమిళ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

SSMB 29: సింహాన్ని లాక్‌ చేశా.. మహేశ్‌తో మూవీపై అదిరే అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి.. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే విననన్న మహేశ్‌ బాబు 

ఇంకేంటి అనుకున్నదే తడవుగా ఈ ఇద్దరు సంప్రదాయ వస్త్రధారణలో నూతన వధూవరుల్లా ముస్తాబయ్యారు. స్వాసికతో కలిసి ఏడడుగులు వేసిన ప్రేమ్‌.. తన భార్య కాలికి మెట్టలు తొడిగాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Swaswika (@swasikavj)

ఈ క్రేజీ కపుల్‌ వెడ్డింగ్‌ వీడియో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్వాసిక విజయ్ ప్రస్తుతం ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో వస్తోన్న సూర్య 45 చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.