టెలివిజన్

Ashwini Dutt: ఆ సినిమాతో కోలుకోలేని దెబ్బతగిలింది.. సినీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నా.. సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఏమిటా సినిమా?

Rudra

2011 సంవత్సరంలో ఎన్టీఆర్‌తో చేసిన భారీ బడ్జెట్ చిత్రం శక్తి వల్ల ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలని అనుకున్నట్లు సీనియర్ నిర్మాత అశ్వినీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Jr. NTR On TV Screen Again: మరోసారి బుల్లితెరపై అలరించనున్న ఎన్టీఆర్.. రియాల్టీ షో కోసం తారక్ సిద్ధం.. వివరాలు ఇవే!

Rudra

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‏.. వెండితెరపైనే గాక, బుల్లితెర మీద కూడా తన సత్తా చాటుకున్నారు. తారక్ మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ రియాల్టీ షోతో ఆయన మళ్లీ తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారట.

Salman Khan on Women Dress Code: స్త్రీలు తమ శరీరాలను దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పుకుంటే అంత మంచిది, సల్మాన్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

స్త్రీల శరీరాలు ఎంతో విలువైనవని, వాటిని వారు దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ప్రసారమైన ‘ఆప్‌ కీ అదాలత్‌’ టీవీ కార్యక్రమంలో సల్మాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Choreographer Chaitanya Suicide Case: ఢీ టైటిల్ కొట్టలేదనే బాధే కారణమా, కొరియోగ్రాఫర్‌ చైతన్య ఆత్మహత్యలో మరో కోణం, పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఢీ షో కొరియోగ్రాఫర్‌ చావా చైతన్య(32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియో తీసుకున్నారు. అందులో ‘అమ్మా నాన్న.. చెల్లీ.. నన్ను క్షమించండి.. కొరియోగ్రాఫర్లూ.. మిమ్మల్ని హర్ట్‌ చేస్తున్నాను.. అప్పులు ఎక్కువయ్యాయి. చెల్లించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Advertisement

‘Miss Shetty Mr Polishetty’ teaser: శెట్టి - పొలిశెట్టి.. కామెడీ టైమింగ్‌ పర్‌ఫెక్ట్‌.. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి సిద్ధమయ్యారోచ్!!

Rudra

'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.మహేష్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

Rudra

'విరూపాక్ష' చిత్రం వచ్చే నెల 20 వ తారీఖు నుండి తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని 15 కోట్ల రూపాయలతో అన్నీ భాషలకు కలిపి కొనుగోలు చేసిందట.

Dhee Choreographer Suicide: ఢీ కొరియోగ్రాఫర్ లైవ్‌ సూసైడ్‌, అప్పులు కట్టలేక చనిపోతున్నా అంటూ వీడియో, ఢీ షో కంటే జబర్ధస్త్‌లోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయ్!

VNS

ఢీ షోలో (Dhee show) డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్‌ లో సూసైడ్ చేసుకున్నాడు. అంతకుముందు ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. యువ డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్యకు (Committed Suicide) పాల్పడిన ఘటన అందరినీ విషాదంలో నెట్టేసింది. ఢీ షో (Dhee show) డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌ చైతన్య (Chaitanya) ఆత్మహత్య చేసుకున్నాడు.

Kantara 2: ఫుల్ స్వింగ్‌లో కాంతార 2 పనులు.. భూతకోలలో పాల్గొన్న రిషబ్‌ శెట్టి

Rudra

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Dil Raju On Sakunthalam Result: నా పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం.. 'శాకుంతలం' ఫలితంపై దిల్ రాజు

Rudra

'శాకుంతలం' సినిమా ఫ్లాప్ కావడంపై దిల్ రాజు స్పందిస్తూ... తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో ఇదే అతి పెద్ద నష్టం అని అన్నారు. సోమవారం, మంగళవారానికే కలెక్షన్లు లేవంటే ఫలితం ఏమిటో తమకు అర్థమైపోయిందని చెప్పారు.

RRR Dancer Arrest: 'ఆర్ఆర్ఆర్' సినిమాలో సైడ్ డ్యాన్సర్ అరెస్ట్.. మరో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మందు తాగుతూ గొడవ.. వాచ్ మెన్ ను మూడో అంతస్తు నుంచి తోసివేసిన వైనం

Rudra

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో 'ఎత్తర జెండా' పాటలో సైడ్ డ్యాన్సర్ గా చేసిన మణికంఠన్ ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

68th Hyundai Filmfare Awards 2023: అట్టహాసంగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డుల వేడుక.. ఉత్తమ నటీనటులుగా అలియాభట్, రాజ్‌కుమార్‌రావ్.. హాజరైన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు.. విజేతల పూర్తి జాబితా ఇదిగో..

Rudra

68వ హుందై ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్ 2023 వేడుక గత రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది. సల్మాన్‌ఖాన్, మనీశ్ పాల్ హోస్టులుగా వ్యవహరించిన ఈ అవార్డుల వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ‘గంగూబాయి కథియావాడి’, ‘బాదాయ్ దో’ సినిమాలకు అవార్డులు వచ్చి పడ్డాయి.

Threat To Singer Sunitha Husband: సింగర్ సునీత భర్తకు బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

Rudra

ప్రముఖ సినీ గాయని సునీత భర్త వీరపనేని రామ్ కు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

Virupaksha Theatre Attacked: సినిమా ఆలస్యం అయ్యిందని.. థియేటర్ పై దాడి చేసిన సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్.. ఎక్కడంటే??

Rudra

హైదరాబాద్‌ మూసాపేట లో ఉన్న లక్ష్మికళ థియేటర్ పై తేజ్ ఫ్యాన్స్ నిన్న దాడి చేశారు. టికెట్ కొనుకొని థియేటర్ లోకి వెళ్లిన తర్వాత రెండు గంటలైనా సినిమా వేయకపోవడంపై ఫాన్స్ ఫైర్ అయ్యారు.

Chalaki Chanti Hospitalized: జబర్దస్త్ చలాకీ చంటికి గుండెపోటు, స్టంట్‌ వేసిన వైద్యులు, ప్రముఖ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స

VNS

కొద్ది రోజుల క్రితం చంటికి తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందించారట. ఆపరేషన్ చేసి స్టంట్ వేసారని సమాచారం. ప్రస్తుతం అతని అరోగ్యం బాగానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇటీవల కొన్ని రోజులుగా చంటి ఏమయ్యాడు అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే తాజాగా చంటి సన్నిహితులు ఈ విషయాన్ని తెలిపారు.

Sharath Babu Health Update: విషమంగా నటుడు శరత్‌బాబు ఆరోగ్యం.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో సతమతం

Rudra

ప్రముఖ చలనచిత్ర నటుడు శరత్‌బాబు(71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు.

Pawan OG Movie Update: డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో .. స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ గా పవన్ 'ఓజీ' సినిమా... ‘సముద్రఖని’ తమిళ రీమేక్ పూర్తిచేసిన పవన్

Rudra

డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగులో పవన్ పాల్గొన్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ముంబైలో మొదలైంది. కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ కూడా షూటింగుకి హాజరైంది. 'ఓజీ' టైటిల్ తో ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి.

Advertisement

PS2 Pre-Release Event: 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం.. ఈ నెల 28న 'పొన్నియిన్ సెల్వన్ 2' రిలీజ్.. ఈ నెల 23న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్.. వేదికగా నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్

Rudra

ఈ నెల 23వ తేదీన 'నోవాటెల్' కన్వెన్షన్ సెంటర్ లో 'పొన్నియిన్ సెల్వన్ 2' తెలుగు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ మొదలుకానుంది.

Prabhas Instagram: ఇన్‏స్టా‏లో 9.4 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్న డార్లింగ్ ప్రభాస్.. కేవలం ఆ 15 మందినే ఫాలో అవుతున్నారు.. ఇంతకీ ఎవరెవరో తెలుసా?

Rudra

గ్లోబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 9.4 మిలియన్స్ గా ఉంది. కానీ డార్లింగ్ మాత్రం కేవలం 15 మందినే ఫాలో అవుతున్నారు. ఇందులో ఎక్కువమంది ప్రభాస్ తన సినిమాలకు తనతోపాటు పనిచేసివారే కావడం గమనార్హం.

Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్.. కారణం ఇదే!

Rudra

దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.

Sumitra Pampana: ప్రముఖ టీవీ నటి సుమిత్ర ఇంట్లో భారీ చోరీ.. 1.2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు.. ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు

Rudra

ప్రముఖ టీవీ నటి సుమిత్ర పంపన ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివసించే ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. నటి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement