తాజా వార్తలు
Woman blackmails Men: మగాళ్ల న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్‌మెయిల్, విశాఖట్నంలో ఘటన, అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaమగాళ్ల న్యూడ్ వీడియోలతో ఓ యువతి చేస్తున్న బ్లాక్‌మెయిల్ దందా వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో జాయ్ అనే యువతి సంపన్నులు, సొసైటిలో పలుకుబడి ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్ చేస్తూ ముగ్గులోకి దింపుతుంది. మత్తు పదార్థులు ఇచ్చి స్పృహ తప్పగానే తన టీంతో వీడియోలు, ఫొటోలు రికార్డు చేసి డబ్బలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతోంది. భీమిలి పోలీసులు జాయ్‌ని అరెస్టు చేశారు.
Jainoor Tribal Woman: ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన జైనూర్ బాధిత మహిళ, బాధితురాలి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించిన మంత్రి సీతక్క
Arun Charagondaఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు జైనూర్ బాధిత మహిళ. గత నెల రోజులుగా గాంధీ ఆసుపత్రిలో వైద్యం అందుతుండగా బాధితురాలికి అందించే వైద్యం, ఇతర సౌకర్యాల పై ప్రత్యేక శ్రద్ధ చూపారు మంత్రి సీతక్క. డిశ్చార్జ్ సందర్భంగా మహిళకు నూతన వస్త్రాలు బహుకరించి కొంత నగదును అందజేశారు సీతక్క. బాధిత కుటుంబ సభ్యులు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.
Bathukamma Festival: బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించిన అమెరికా, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించిన అమెరికాలోని పలు రాష్ట్రాలు
Arun Charagondaబతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించింది అమెరికా. బతుకమ్మ సంబరాల వారాన్ని అధికారికంగా బతుకమ్మ పండగ వారం, తెలంగాణ హెరిటేజ్ వీక్‌గా ప్రకటించాయి అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్, వర్జీనియా రాష్ట్రాలు.
Bigg Boss Tamil 8: ఈసారి హోస్ట్‌గా విజయ్ సేతుపతి, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న తమిళ బిగ్ బాస్..వివరాలివే
Arun Charagondaబుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. వివిధ భాషల్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండగా తెలుగులో ఐదోవారంలోకి ఎంటరైంది. ఇక తమిళంలో 8వ సీజన్ నేటి నుండి ప్రారంభంకానుంది. ఈసారి హోస్ట్‌గా కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి వ్యవహరించనుండగా పలు మార్పులు చేశారు నిర్వాహకులు.
Goddess Kanyaka Parameswari: రూ.6 కోట్లతో అమ్మవారి అలంకరణ, మహబూబ్‌నగర్ జిల్లా వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక అలంకరణ..వైరల్ వీడియో
Arun Charagondaమహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బ్రాహ్మణవాడలో వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమివ్వనుండగా ప్రత్యేకంగా రూ.6,66,66,666.66తో అలంకరించారు. రూ. 6 కోట్ల నగదు చూసి భక్తులు ఆశ్యర్యపోయారు.
California: కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం, ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు, ఫైరింజన్ల సాయంతో అదుపులోకి మంటలు...వీడియో
Arun Charagondaకాలిఫోర్నియాలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్ వెళ్తున్న ఓ విమానం హ్యారీ రీడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న క్రమంలో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Minister Komatireddy Dance: డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaడీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ క్యాన్సర్ రన్-2024ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజే టిల్లు పాటకు ఆయన డాన్స్ వేశారు.
Viral Video: పార్కు వద్ద మూత్రం పోయొద్దన్నందుకు గొడవ, ఓ వ్యక్తిని కర్రతో కొట్టిన మరో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు...వీడియో ఇదిగో
Arun Charagondaపార్క్ వద్ద మూత్రం పోయొద్దన్నందుకు వ్యక్తిని కర్రతో చితకబాదాడు యువకుడు. నార్త్ ఢిల్లీలో ఓ పార్క్ వద్ద ఆర్యన్ అనే యువకుడు మూత్రం పోస్తుండగా, రామ్ పాల్ అనే వ్యక్తి పక్కనే తాను పని చేస్తున్న షాప్ ఉందని అక్కడ మూత్రం పోయొద్దని మందలించాడు.
Tirupati Airport: తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపుతో కలకలం
Arun Charagondaబ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. బాంబు బెదిరింపుతో పోలీసులు అప్రమత్తమై రాత్రికి రాత్రే విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
Criminals Arrest: సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది అరెస్ట్,దేశ వ్యాప్తంగా 435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్ నేరగాళ్లు, ముంబై కేంద్రంగా మోసాలు
Arun Charagondaదేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 435 కేసుల్లో నిందితులుగా ఉన్నారు సైబర్ నేరగాళ్లు. ముంబై కేంద్రంగా ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతుండగా హైదరాబాద్ లో ఏకంగా రూ.7 కోట్లకుపైగానే కాజేశారు కేటుగాళ్లు.
Israel Attack On Gaza Mosque: గాజాపై మరోసారి విరుచుకపడ్డ ఇజ్రాయెల్, మసీదుపై వైమానిక దాడి, 21 మంది మృతి...వీడియో ఇదిగో
Arun Charagondaగాజాపై మరోసారి భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి. చేయగా ఈ దాడిలో 21 మంది పాలస్తీయన్లు మృతి చెందారు. మసీదును హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్ గా వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ దాడికి పాల్పడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Modi On Rythu Runa Mafi: రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్, తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీస్తున్నారన్న మోడీ
Arun Charagondaతెలంగాణలో రుణమాఫీఐ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన కామెంట్ చేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఇప్పటికి మాఫీ కాలేదన్నారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా రుణమాఫీ చేయకపోవడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అని తెలిపారు మోడీ.
Mumbai Fire Accident: ముంబైలో ఘోరం.. షార్ట్ సర్క్యూట్ తో భవనంలో మంటలు.. ఏడుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు (వీడియో)
Rudraముంబైలో ఘోరం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి చెంబూరు ప్రాంతంలోని ఓ ఇల్లు ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, వరద సాయం పెంపుతో పాటు కాంగ్రెస్ పెద్దలను కలవనున్న తెలంగాణ సీఎం
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలవనున్నారు సీఎం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భేటీ కానుండగా ఈ సమావేశానికి హాజరుకానున్నా రేవంత్ రెడ్డి.
IndiGo Faces Tech Glitch: మొరాయించిన ఇండిగో సాంకేతిక వ్యవస్థ.. రైల్వే స్టేషన్లను తలపించిన ఎయిర్ పోర్ట్స్ (వీడియో)
Rudraపండుగల వేళ బస్సులు, రైల్వే స్టేషన్లు రద్దీగా కూరగాయల మార్కెట్ ను తలపించేలా ఉంటాయి. అయితే, ఎయిర్ పోర్టులు కూడా అలా ఉంటాయంటే నమ్ముతారా? అయితే, శనివారం దేశ వ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులలో ఇదే సీన్ కనిపించింది.
Hyderabad: వీపు రుద్దమన్నందుకు భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసిన భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
Arun Charagondaహైదరాబాద్ కేపీహెచ్‌బీలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన వీపు రుద్దాలని గట్టిగా భార్యపై అరిచాడు భర్త శివ. గట్టిగా అరవకండి చుట్టూ ఉన్న వాళ్లు చూస్తే బాగోదు అంటూ భర్తతో చెప్పినా వినలేదు. దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భర్త తలపై ఐరన్ రాడ్‌తో దాడి చేసింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో భర్త శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Zomato Shares: ఉద్యోగుల పట్ల జొమాటో పెద్ద మనసు.. రూ. 330.17 కోట్ల విలువైన షేర్లు కేటాయించిన కంపెనీ
Rudraతన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పెద్ద మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్ లను తన ఉద్యోగులకు జొమాటో కేటాయించింది.
Hydra To Extend Districts: ఇకపై జిల్లాలకు హైడ్రా, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ప్రకటన..కాంగ్రెస్ నేతలు కబ్జా చేసిన వదలమని హెచ్చరిక
Arun Charagondaహైడ్రా ఈ పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా హైడ్రా విస్తరణపై కీలక కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం అని...హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం.. మా కుటుంబసభ్యులు కబ్జా చేసినా కూల్చేయండన్నారు. కాంగ్రెస్ నేతలు ఆక్రమించిన వదిలిపెట్టమని తేల్చిచెప్పారు.
Modi in Mumbai Metro: ముంబై మెట్రోలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో మాటామంతీ (వీడియో)
Rudraముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి మెట్రో లైన్-3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రోలో ఆయన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు లాడ్కీ బహిన్ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Youtuber Harshasai Case: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు
Rudraముంబై కి చెందిన ఓ నటిపై లైంగిక దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. ఆయనపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.