తాజా వార్తలు

Andhra Pradesh Shocker: అనంతపురంలో యువతి దారుణ హత్య, హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల సమీపంలో శనివారం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. మృతురాలు గుమ్మగట్ట మండలనికి చెందిన శిరీషగా గుర్తించారు. అనంతపురం లోని ఓ ఆర్ట్స్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతుండగా హత్యకు ప్రేమ వ్యవహారమా ? లేక ఇంకేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు

Hyderabad: ట్రాఫిక్ పోలీస్ ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్

Arun Charagonda

హైదరాబాద్ ఆర్ధిక ఇబ్బందులతో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట్‌కేసర్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు గోపాలాపురం ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహరాజు.

Ganesh Chaturthi Celebrations: వినాయకుడి ముందు 35వేల మంది మహిళలు,దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో వినాయక నామస్మరణ..వీడియో

Arun Charagonda

మహారాష్ట్రలోని పుణేలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దగ్ధుషేత్ హల్వాయి గణపతి ఆలయంలో దాదాపు 35వేల మంది మహిళలు ఓం గం గణపతయే నమ: గణపతి బప్పా మోరియా అంటూ అథర్వశీర్ష పఠనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Rain Alert in AP: ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.. పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

ఇటీవలి వరదలతో అతలాకుతలమైన ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

Advertisement

Delhi Metro: ఢిల్లీ మెట్రో ట్రాక్‌పై యువతి పరుగులు, కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది..వీడియో వైరల్

Arun Charagonda

ఢిల్లీలోని రాజేంద్రనగర్ మెట్రో స్టేషన్లో కలకలం చోటు చేసుకుంది. రైలు వస్తుండగా యువతి ట్రాక్‌ పై పరుగులు పెట్టింది. వెంటనే ఆమెను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పజెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telangana Rains Updates: రెయిన్ అలర్ట్..తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్!

Arun Charagonda

తెలంగాణకు మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలు అతలాకుతలం కాగా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

HYDRA Action in Dundigal: దుండిగల్ లో విల్లాలను కూల్చేస్తున్న హైడ్రా.. లింగంపల్లి సున్నం చెరువులోనూ అక్రమ నిర్మాణాల తొలగింపు

Rudra

హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో భాగంగా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మునిసిపాలిటీలో ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభించింది.

Peacock Dance at Nallamala: నల్లమల అడవిలో శ్రీశైలం ఘాట్ రోడ్డులో మయూరాల నృత్యం హేళ.. వీడియో మీరూ చూడండి!

Rudra

చిరుజల్లుల సవ్వడులు ఒకవైపు.. నల్లమల ఫారెస్టు అందాలు మరోవైపు.. దీంతో అడవుల్లో నుంచి బయటకు వచ్చిన మయూరాలు అనంద పరవశమయ్యాయి.

Advertisement

Bowenpally ka Raja RUDRA Ganesha: హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా మారిన బోయిన్ పల్లి కా రాజా.. ‘రుద్ర యూత్ గణేశా’.. ముంబై లాల్‌ బాగ్‌ గణేశాకు తీసిపోని విధంగా వైభోగం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేశ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Sonu Sood Helps Flood Victims: తెలుగు రాష్ట్రాలకు సోనూ సూద్ చేయూత, దుప్పట్లు, బకెట్లు పంపిణీ చేసిన సోనూ టీం..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ చేసింది సోనూసూద్ టీం. ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ నుండి కృషి చేస్తానని తెలి సోనూసూద్ తెలిపిన సంగతి తెలిసిందే.

HYDRA Notices to Senior Actor: టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీ మోహన్‌ కు హైడ్రా నోటీసులు.. కూల్చకపోతే కూల్చేస్తాం అంటూ హెచ్చరిక

Rudra

ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడం, హైదరాబాద్ లో కుచించుకుపోయిన జలవనరులను కాపాడటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న హైడ్రా తాజాగా టాలీవుడ్‌ సీనియర్ నటుడికి నోటీసులు పంపింది.

West Bengal rape case : అత్యాచార నిందితుడికి మరణశిక్ష, బెంగాల్‌లోని సిలిగురి కోర్టు సంచలన తీర్పు, చర్చనీయాంశంగా న్యాయస్థానం తీర్పు

Arun Charagonda

అత్యాచారం, హత్య కేసులో బెంగాల్‌లోని సిలిగురి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్​ బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన నిందితుడి మరణ శిక్ష విధించింది. పశ్చిమ్​ బెంగాల్​లోని ఓ కోర్టు మరణ శిక్ష విధించింది. 2023 ఆగస్టు 21న పాఠశాలకు వెళ్తున్న మైనర్ బాలికను అత్యాచారం, హత్య చేశారు నిందితుడు ఎండీ అబ్బాస్. ఈ ఘటన జరిగిన ఆరు గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు

Advertisement

Fire at Ganesh Pandal: హైదరాబాద్ దిల్‌ సుఖ్‌ నగర్ లోని గణేష్ మండపం వద్ద భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియోతో)

Rudra

హైదరాబాద్ లోని దిల్‌ సుఖ్‌ నగర్ పీఎన్టీ కాలనీలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు.

Moving Ganesha in Nellore: నెల్లూరులో ఆకట్టుకుంటున్న 'కదిలే వినాయకుడు'.. వీడియో మీరూ చూడండి!

Rudra

గణేశ్ ఉత్సవాలతో ఊరూ-వాడా గొప్ప సంబురంగా ఉన్నది. నెల్లూరు జిల్లాలో కొలువుదీరిన గణపతులు చూడ ముచ్చటగా ఉన్నాయి.

Tirumala Srivari Laddu: హైదరాబాద్‌ లో ఉండి కూడా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రుచి చూడొచ్చు.. ఇకపై నగరంలో ప్రతి రోజూ లడ్డూ ప్రసాదం విక్రయాలు.. కీలక ప్రకటన చేసిన టీటీడీ

Rudra

ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం రుచికి సాటి మరొకటి రాదు. తిరుపతికి వెళ్లిన ప్రతీ ఒక్కరూ ఈ లడ్డును కచ్చితంగా తీసుకోకుండా ఉండలేరు.

Jailer Villain Arrested: జైల‌ర్ విల‌న్ మ‌రోసారి అరెస్ట్, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నందుకు అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు (వీడియో ఇదుగోండి)

VNS

జైలర్‌ నటుడు వినాయకన్‌ను (Vinayakan arrested) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్‌ (Central Industrial Security Force) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్‌.. కొచ్చి నుంచి హైదరాబాద్‌ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

Advertisement

Puja Khedkar Dismissed From IAS: పూజా ఖేద్క‌ర్ కు కేంద్రం షాక్! అఖిల భార‌త సర్వీసుల నుంచి పూజా ఖేద్క‌ర్ తొల‌గింపు, వెంట‌నే అమల్లోకి ఉత్త‌ర్వులు

VNS

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ (Puja Khedkar Dismissed) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (IAS) నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

Flood Disaster Loss in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌ర‌ద బీభ‌త్సం మిగిల్చిన న‌ష్టంపై నివేదిక సిద్ధం, ఏయే శాఖ‌కు ఎంత న‌ష్టం వాటిల్లిందో పూర్తి వివ‌రాలు రెడీ చేసిన ప్ర‌భుత్వం

VNS

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో కురిసిన భారీ వర్షం, వరద విపత్తు (Flood disaster) వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని రాష్ట్రప్రభుత్వం (Government) వెల్లడించింది. సుమారు రూ. 6,882 కోట్ల నష్టం జరిగిందని పేర్కొంది. ఈ మేరకు కేంద్రానికి పంపేందుకు నివేదికను సిద్ధం చేసింది.

Deepthi Jeevanji: పారాలంపియ‌న్ దీప్తికి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫ‌ర్, కోటి రూపాయ‌ల న‌గ‌దు, గ్రూప్-2 ఉద్యోగం ప్ర‌క‌ట‌న‌

VNS

పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని (Deepthi Jeevanji) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్‌లో 500 గజాల స్థలం, కోచ్‌కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు.

Whiskey Ice Cream Racket Busted: అక్క‌డ అమ్మేది చాకొలెట్ ఐస్ క్రీం కాదు, విస్కీ ఐస్ క్రీం! జూబ్లీహిల్స్ లో ముఠా అరెస్ట్, పార్టీ ఆర్డ‌ర్ కోసం ఏకంగా 23 కేజీలు రెడీ చేసిన అరికో కెఫే

VNS

పోలీసుల నిఘా పెరగడంతో మత్తుగాళ్లు కొత్త దారులు (Drugs) వెత్తుక్కుంటున్నారు. చివరికి చిన్న పిల్లలు ఎక్కువగాతినే ఐస్ క్రీములను తమ దందాకు వాడుకుంటున్నారు. హైదరాబాద్ లో ఐస్ క్రీముల్లో విస్కీ (Whiskey Ice Cream) కలిపి విక్రయిస్తున్న మత్తుదందా గుట్టురట్టయింది

Advertisement
Advertisement