తాజా వార్తలు

Allu Arjun on Rajinikanth: రజనీకాంత్ నా గురించి అలా అనేసరికి షాకయ్యాను, అల్లు అర్జున్‌ మాటల్లో..

Vikas M

గంగోంత్రితో సినిమా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారి జాతీయ ఉత్తమనటుడిగా ఎదిగాడు. ఈ ఐకాన్ స్టార్ రజనీకాంత్ తనని గుర్తుపట్టడంపై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్ ప్రస్తావిస్తూ ‘ఒకసారి చెన్నయ్‌కి దర్శకుడు సుకుమార్‌తో కలిసి వెళ్లాను.

Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్‌ సింగర్‌తో హార్దిక్‌ పాండ్యా డేటింగ్‌ ? ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు

Vikas M

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగ‌ర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్న‌ట్లు రూమ‌ర్లు వ‌స్తున్నాయి.

Latest ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ ఇవిగో, నంబర్ వన్ స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్‌ అజామ్‌, రెండవ స్థానంలో రోహిత్‌ శర్మ, మూడో స్థానానికి పడిపోయిన శుభ్‌మన్ గిల్

Vikas M

టీమ్‌ఇండియా స్టార్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ రాణించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 157 పరుగులు చేశాడు.

Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా, గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌

Vikas M

టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌(Morne Morkel)ను నియ‌మించారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ద్రువీక‌రించారు. సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌.. గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రిగిన స‌మ‌యంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.

Advertisement

Duleep Trophy 2024 Squads Announced: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటించిన బీసీసీఐ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మిస్ అవుట్, కెప్టెన్లు ఎవరెవరంటే..

Vikas M

చాలా అంచనాల తర్వాత, BCCI యొక్క సెలక్షన్ కమిటీ బుధవారం దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ కోసం జట్టులను ప్రకటించింది. దేశవాళీ సీజన్‌లో రెడ్-బాల్ క్రికెట్‌కు నాంది పలికే దులీప్ ట్రోఫీ, అంతర్జాతీయ అత్యుత్తమ ఆటగాళ్లను చూడనుంది. సర్క్యూట్, కొంతమంది యువకులు,టాలెంట్ నిరూపించుకోవాలనుకునే ప్రతిభావంతులు అత్యున్నత స్థాయిలో పోటీ పడుతున్నారు.

Horrific Accident in Bijnor: షాకింగ్ వీడియో, రీల్స్ చేస్తూ బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన కారు, అమాంతం ఎగిరి అవతల పడిన ఇద్దరు యువకులు

Hazarath Reddy

బిజ్నోర్‌లోని ఢిల్లీ – పౌరి నేషనల్‌ హైవేపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డు మధ్యలో నుంచి కుడివైపుకు వెళ్లసాగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.

Independence Day 2024: ఎర్రకోట నుండి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, నాయకత్వం వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యేక అతిథులుగా 6 వేల మంది

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దేశానికి నాయకత్వం వహిస్తారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ థీమ్ 'విక్షిత్ భారత్ @ 2047'

Telangana Governor Quota MLC: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు, ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే ప్రభుత్వ హక్కులు హరించినట్లేనని వ్యాఖ్య

Arun Charagonda

సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురైంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టేటస్ కో విధించాలని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Nagole Metro:నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ఆందోళన, ఎల్‌ అండ్ టీ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు, ఉద్రిక్తత

Arun Charagonda

హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ ప్రయాణీకుల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. నాగోల్‌లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి, డబ్బులు వసూలు చేస్తుండడంతో మెట్రో ప్రయాణికులు ఆగ్రహంం వ్యక్తం చేశారు. మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ డీజీపీ షాక్, హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో లేని ఐపీఎస్‍లకు మెమో, 16 మంది అధికారులకు షాకిచ్చిన డీజీపీ

Arun Charagonda

ఏపీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు షాకిచ్చారు డీజీపీ. వెయిటింగ్‍లో ఉంటూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండని ఐపీఎస్‍లకు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‍ లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్‍లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

Independence Day 2024: తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డ్‌, ఎందుకు ప్రదానం చేశారంటే..

Hazarath Reddy

తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్‌ అధికారి యాదయ్యకు దక్కడం విశేషం

Emergency Trailer Out: ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఎలా చూపించబోతున్నారు, కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్ ఇదిగో..

Vikas M

బాలీవుడ్ న‌టి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుద‌లైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా మూవీ వస్తోంది, ప్ర‌ధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగన కనిపిస్తారు.

Advertisement

Independence Day Quotes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

Vikas M

బ్రిటిష్ వారి రాక్షస పాలన నుంచి భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది కొరడా దెబ్బలు తిన్నారు. ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.

Jr NTR Road Accident: జూనియర్‌ ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం వదంతులు, క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ టీమ్, వదంతులు నమ్మొద్దని వినతి

Arun Charagonda

జూనియర్ ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. ఎన్టీఆర్‌కు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదు. కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా తారక్ ఎడమ చేయి మణికట్టు బెణికిందని క్లారిటీ ఇచ్చింది.

Independence Day Wishes in Telugu: భారత స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పేయండి

Vikas M

భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది.

Independence Day 2024 Wishes in Telugu: మీ స్నేహితులకు బంధుమిత్రులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలపండి

sajaya

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఎందరో వీరుల త్యాగఫలం 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించింది. బ్రిటిష్ పరిపాలకులు మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు బానిసలుగా పరిపాలించారు. వారి నుంచి మన దేశం జాతీయోద్యమం ద్వారా ఈ స్వాతంత్రాన్ని పొందడంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర పోషించింది.

Advertisement

Har Ghar Tiranga railey:హైదరాబాద్ పాతబస్తీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ, చాంద్రయణగుట్ట నుండి చార్మినార్ వరకు ర్యాలీ, వీడియో

Arun Charagonda

దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. సిఆర్‌పిఎఫ్ క్యాంపస్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఫలకనుమ, శాలిబండ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమానికి సిఆర్‌పిఎఫ్ డీజీపీ విజయ్ భాస్కర్ బిళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఈ ఎండు ద్రాక్ష వాటర్ తాగాల్సిందే.

sajaya

వర్షాకాలంలో రకరకాల అయిన ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ ,బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వంటి వాటితో అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, మలేరియా, డెంగ్యూ సమస్యలతో ఇబ్బంది పడతారు.

Independence Day 2024 Speech in Telugu: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి ఉపన్యాసం ఇవ్వాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసం

sajaya

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ స్కూల్లోనూ కాలేజీలోనూ కార్యాలయంలోనూ లేదా బహిరంగ ప్రదేశాల్లో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి మంచి ఉపన్యాసం ఇవ్వాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ సులభమైన పదాలతో ఒక చక్కటి స్పీచ్ను మేము రూపొందించాం.

Independence Day 2024: హర్‌ ఘర్ తిరంగా సర్టిఫికెట్‌ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి, అయితే మీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Arun Charagonda

భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9 నుండి హర్ ఘర్ తిరంగ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమం జరగనుండగా ప్రతి వ్యక్తి తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

Advertisement
Advertisement