తాజా వార్తలు
Delhi Excise Policy Scam Case: మధ్యంతర బెయిల్ ఇవ్వలేం, ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది.
Health Tips: ప్రతిరోజు బార్లీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaబార్లీలో గింజలలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి, తక్షణ శక్తిని అందించడానికి ఈ బార్లీ సహకరిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Mumbai Horror: ప్రియుడు మోజులో ఘాతుకం, శివసేన సీనియర్ నేతను దారుణంగా చంపిన భార్య, డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని మరీ..
Hazarath Reddyమహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఖందేశ్వర్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత విష్ణు గౌలి (58) దారుణ హత్యకు గురయ్యారు. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Telangana Shocker: దారుణం, కొడుకు జైలుకు వెళ్లాడని తల్లీకూతుళ్లతో మాట్లాడని గ్రామస్తులు, తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య
Hazarath Reddyమెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో ఎవరూ మాట్లాడటం లేదని తల్లీకూతుళ్ల ఆత్మహత్య చేసుకున్నారు.కాగా పది నెలల క్రితం కోడలిని హత్య చేసిన కొడుకు జైలుకు వెళ్లాడు. ఇదే కేసులో జైలుకి వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు
CM Revanth Reddy In Hyderabad: సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం, భారీ ర్యాలీతో స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెట్టుబడులే లక్ష్యంగా సాగిన రేవంత్ టూర్
Arun Charagondaతెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పర్యటన సాగింది.
Andhra Pradesh: కుటుంబ కలహాల నేపథ్యంలో కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య, బతకడం ఇష్టం లేదంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో
Hazarath Reddyకుటుంబ కలహాల నేపథ్యంలో కాలువలో దూకి యువకుడు ఆత్మహత్య.. మాచర్ల పట్టణానికి చెందిన చక్క రాజేష్ 30 సంవత్సరాలు, రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో తన కుటుంబంలో కలహాలు ఉన్నట్లు, ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోను పోస్ట్ చేశారు.
Manish Sisodia Padayatra: ఆప్ నేత మనీష్ సిసోడియా 'పాదయాత్ర' వాయిదా,భద్రతా కారణాల రీత్యా పోలీసుల సూచనతో వాయిదా, కేజ్రీవాల్ బర్త్ డే రోజు పాదయాత్ర ప్రారంభం
Arun Charagondaఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో 17 నెలల జైలు శిక్ష తర్వాత ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 17 నెలలు జైలులో పెట్టిన సత్యాన్ని ఓడించలేకపోయారన్నారు సిసోడియా. ఇక జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత దూకుడు పెంచారు మనీష్.
Chitrakoot: వీడియో ఇదిగో, స్కూలులో అందరిముందే తన్నుకున్న టీచర్లు, బిత్తరపోయి చూస్తుండిపోయిన విద్యార్థులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు శారీరక వాగ్వాదానికి దిగిన సంఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 14న పోస్ట్ చేసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. మహిళా టీచర్ సప్నా శుక్లా, పురుష టీచర్ ఆదేశ్ తివారీ మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన సంఘటనను ఇది సంగ్రహిస్తుంది.
Sperm Donor Has No Legal Right on Child: వీర్యం, అండ దానం చేసిన వారికి పిల్లలపై ఎలాంటి హక్కు ఉండదు, కీలక తీర్పును వెలువరించిన బాంబే హైకోర్టు
Hazarath Reddyవీర్యం, అండ దానం చేసిన దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వారిని పిల్లలకు జీవ సంబంధ(బయలాజికల్) తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని తెలిపింది. తన కవల కూతుళ్లను చూసేందుకు అనుమతించాలని ఓ మహిళ వేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Air India Flight Suffers Bird-Hit: టేకాఫ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి, వెంటనే అప్రమత్తమై టేకాఫ్‌ను రన్‌వే వద్ద నిలిపివేసిన సిబ్బంది
Hazarath Reddyఎయిర్ ఇండియా విమానానికి (Air India flight)పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో పక్షి ఢీ (bird hit) కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే టేకాఫ్‌ను నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Andhra Pradesh: తెలంగాణ స్థానికత ఉన్న 122 మంది ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం, ఇకపై సొంత రాష్ట్రంలోనే పని చేయనున్న ఉద్యోగులు
Hazarath Reddyతెలంగాణ స్థానికత ఉన్న 122 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఇకపై తెలంగాణలో పని చేయనున్నారు.
Rajasthan Horror: షాకింగ్ వీడియో ఇదిగో, భార్యను బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లిన తాగుబోతు భర్త, సోదరి ఇంటికి వెళ్తానని ఆమె చెప్పడమే కారణం
Hazarath Reddyరాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఓ మహిళను మోటార్‌సైకిల్‌కు కట్టేసి, రాతి నేల మీదుగా ఈడ్చుకెళ్లిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 40 సెకన్ల వీడియోలో, ముగ్గురు వ్యక్తులు-మరో మహిళ సంఘటనను రికార్డ్ చేస్తున్న వ్యక్తితో సహా-కనిపిస్తున్నారు, అయినప్పటికీ వారిలో ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు.
KTR Questions CM Revanth Reddy: పడకేసిన పల్లెలు, కంపు కొడుతున్న పట్టణాలు?, ఇదేనా ప్రజా పాలన అంటే మండిపడ్డ కేటీఆర్
Arun Charagondaరాష్ట్రంలో పల్లెలు పడకేశాయన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు.
RG Kar Doctor Rape-Murder Case: ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం, పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు, దర్యాప్తు కోసం కోల్‌కతా చేరుకున్న సీబీఐ
Hazarath Reddyకోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్యురాలిపై దారుణ అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది.ఈ కేసులో ఇప్పటికే కొత్త సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్‌కతా చేరుకుంది.
SC on Royalty Issue: గనులు కలిగిన భూములపై రాయల్టీ, కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు బకాయిలు చెల్లించాలని కీలక తీర్పు
Hazarath Reddyఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు విషయంలో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పును వెలువరించిన సంగతి విదితమే. ఖనిజాలు, గనుల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు పూర్తిస్థాయి అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Nalgonda: వాగులో చిక్కుకుపోయిన ఎస్సై వెంకట్ రెడ్డి, స్థానికుల సాయంతో బయటపడ్డ ఎస్సై, వీడియో వైరల్
Arun Charagondaనల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలకు గట్టుప్పల్, పుట్టపాక మధ్యలోని ఆరుమాళ్ల వాగు పొంగి పొర్లింది. దీంతో సొంతూరు వెళ్తూ వాగులో చిక్కుకుపోయారు గట్టుప్పల్ ఎస్సై గుత్త వెంకట్ రెడ్డి. సిబ్బంది, స్థానికుల సహాయంతో బయయటపడ్డారు ఎస్సై.
Sheikh Hasina Seeks Justice: నాకు న్యాయం కావాలి,ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలి ప్రకటన చేసిన హసీనా,బంగ్లా విధ్వంసంపై దర్యాప్తు చేయాలని డిమాండ్
Arun Charagondaబంగ్లాదేశ్ రిజర్వేషన్ల అంశం తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు షేక్ హసీనా. ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లిన తర్వాత సోషల్ మీడియా ద్వారా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొదటి ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో నిరసనల సందర్భంగా జరిగిన హింస, విధ్వంసంపై దర్యాప్తు చేయాలని కోరారు.
Duvvada Srinivas: క్లాసికల్ డ్యాన్స్ వీడియో రిలీజ్ చేసిన మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఘటన నేపథ్యంలో మాధురి ట్వీట్ వైరల్
Arun Charagondaతెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. మాధురి ఆత్మహత్య యత్నం చేసుకోగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో తన క్లాసికల్ డ్యాన్స్ చూడాలనుకునేవారి కోసం వీడియో రిలీజ్ చేసింది మాధురి.
Train Hits Goats At Vikarabad: 50 మేకలను ఢీ కొట్టిన ట్రైన్స్, అక్కడికక్కడే మేకలు మృతి,వీడియో వైరల్
Arun Charagondaవికారాబాద్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 50 మేకల్ని ఢీకొట్టాయి రెండు రైళ్లు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండల్ డీకే తండాకు చెందిన రైతులు మేకల్ని తీసుకొస్తుండగా ఘటన చోటు చేసుకుంది. అడవి పందుల గుంపు ఎదురవడంతో రైలు పట్టాలపైకి వెళ్లాయి మేకలు. 50 మేకలు మృత్యువాత పడ్డాయి.
Andhra Pradesh Shocker: వైరల్ వీడియో.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన స్నేహితులు, ఆస్పత్రిలో చేరిక, చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడి తల్లి ఆరోపణ
Arun Charagondaఆంధ్రప్రదేశ్ లో దాడుల సంస్కృతి పెరిగిపోతోంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం, చిన్నపరిమి గ్రామంలో ఆగస్టు 6వ తేదీన ఓ వ్యక్తిని తీసుకెళ్లి, అతని స్నేహితులు దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తన కుమారుడిని కొట్టిన వ్యక్తులు మళ్లీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తన కొడుకును చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది