తాజా వార్తలు
Bangladesh Protest: వీడియో ఇదిగో, భారత్ చేరుకున్న షేక్ హసీనా, లండన్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వార్తలు, భారత్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం
Hazarath Reddyబంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత్‌కు చేరుకున్నారు. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్ అధికారులకు ఆమె స్వాగతం పలికారు. అయితే, ఆమె భారత్ నుంచి లండన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
YS Jagan: తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో జగన్ పిటిషన్
Hazarath Reddyఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రత విషయంలో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ జగన్ పిటిషన్లో కోరారు. అలాగే, కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Bangladesh Protests: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హైఅలర్ట్, సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ ఆదేశాలు
Hazarath Reddyబంగ్లాదేశ్ (Bangladesh) లో రాజకీయ సంక్షోభం (Political crisis) నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ (High alert) ప్రకటించింది.
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఎందుకీ ఆందోళనలు? విద్యార్థులు చేపట్టిన ఉద్యమం రాజకీయ నిరసనగా ఎందుకు మారింది, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానంపై ఎవరేమన్నారు ?
Hazarath Reddyహసీనా దేశం విడిచి వెళ్లిపోయారని సైన్యం ప్రకటించగానే.. రోడ్ల మీదకు చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది
Paris Olympics 2024 Live Updates: కాంస్య పతక రేసులో అనంత్ జీత్ సింగ్ - మహేశ్వరి చౌహాన్, ఒలింపిక్స్‌లో మరో పతకం దిశగా భారత్
Arun Charagondaపారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించే దిశగా భారత్ దూసుకెళ్తొంది. షూటింగ్ విభాగంలో మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లో ఆనంత్ జీత్ సింగ్ సింగ్ , మహేశ్వరి చౌహాన్ కాంస్య పతక రేసులో నిలిచారు. తొలి రౌండ్లో అనంత్ జీత్ సింగ్ నరుకా 25/25తో స్కోర్ చేయగా, మహేశ్వరి చౌహాన్ 24/25తో భారత్ స్కోరు 49కి పాయింట్లు సాధించారు.
Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపిన ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్
Hazarath Reddyబంగ్లాదేశ్ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు.
Kannappa: సోమవారం అప్డేట్ వచ్చేసింది, ముండడుగా దేవరాజ్, సర్ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు
Arun Charagondaమంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కన్నప్ప. డిసెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా మంచు ఫ్యామిలీ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.
Beware Of Parcel Fraud: పార్సిల్ లేదా కొరియర్ కాల్స్‌తో జాగ్రత్త.. నకిలీ కాల్స్ నమ్మి మోసపోకండి!
Arun Charagondaరోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా పంజా విసిరేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా పార్సిల్ లేదా కొరియర్ కాల్స్ స్కాంకు తెగబడ్డారు. మీ పేరిట వచ్చిన కొరియర్లో నిషేధిత, మత్తు పదార్థాలు ఉన్నాయని, మీపై కేసులు నమోదయ్యాయని సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని బురిడీ కొట్టించి, టెన్షన్ లో పెట్టి డబ్బులు గుంజుతారు.
Excise Policy Case: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ని కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఢిల్లీ మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే, బెయిల్ పిటిషన్‌ను సైతం కోర్టు తిరస్కరించింది. ఎలాంటి కారణం లేకుండా అరెస్టు చేశారని, చట్టవిరుద్ధమని చెప్పలేమని కోర్టు పేర్కొంది.
Vemulawada Temple VIP Darshan: వేములవాడ రాజన్న ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభం, టికెట్ ధర ఎంతో తెలుసా?
Arun Charagondaదక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న దేవాలయం(రాజరాజేశ్వర స్వామి)లో వీఐపీ బ్రేక్ దర్శనం నేటి నుండి ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రారంభించారు. వీఐపీ బ్రేక దర్శన టికెట్ ధర రూ.300గా ఉండగా ఈ టికెట్ తీసుకున్న వారికి ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వనున్నారు.
Supreme Court: అవి కోచింగ్ సెంటర్లు కాదు డెత్ ఛాంబర్స్ సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు,విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కోచింగ్ సెంటర్లు అని కామెంట్
Arun Charagondaభారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించిన విషయం తెలిసిందే. సెల్లార్లో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తుండగా గత నెల 27న రాత్రి భారీ వర్షాలకు రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా దీనిపై పెద్ద దుమారం చెలరేగింది.
Astrology: ఆగస్టు 6 కుజ గ్రహం రాశి మార్పు కారణంగా ఈ 5 రాశుల వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది.ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం కుజ గ్రహం ఎంతో బలమైనది. శక్తివంతమైనదిగా ఉంటుంది. ఆగస్టు 6 ఉదయం 7 గంటల నుంచి కుజ గ్రహం రాశి మార్పు కారణంగా అన్ని రాశుల పైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారి పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీనివల్ల వీరు దురదృష్టాన్ని పొందుతారు
Astrology: 90 ఏళ్ల తర్వాత వచ్చే చతుర్ గ్రహియోగం ఆగస్టు 19న..ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అపార సంపదలు పెరుగుతాయి.
sajayaఆగస్టు 19న 90 ఏళ్లకు ఒకసారి వచ్చే చతుర్ గ్రహీయోగం ఏర్పడుతుంది. సర్వార్థ సిద్ధియోగం, రవియోగం, సౌభాగ్య యోగం, శోభనయోగం ఈ శ్రావణమాసంలో ఏర్పడబోతోంది. దాదాపు 90 ఏళ్ల క్రితం ఇటువంటి వింత జరిగింది.
Bangladesh Protests: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా, చెలరేగిన హింస నేపథ్యంలో తలదాచుకోవడానికి భారత్ బయలుదేరినట్లుగా వార్తలు
Hazarath Reddyబంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వివాదం హింసాత్మకంగా మారడంతో ఆ ఆదేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో దేశం అట్టుడుకుతోంది.
Astrology: ఆగస్టు 13 శని అనుగ్రహంతో ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది కష్టాలు పోతాయి.
sajayaఆగస్టు 13 రాత్రి 10 గంటలకు శనిగ్రహం పూర్వభద్ర నక్షత్రం ద్వితీయ స్థానం నుండి మొదటి స్థానంలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్పు కారణంగా అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Telangana: సీఐ పుట్టినరోజు వేడుకలు, భవనం మూడో అంతస్తు పై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతి, కూకట్‌పల్లిలో విషాదకర ఘటన
Hazarath Reddyప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి హెడ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన కూకట్‌పల్లిలోని దేవినగర్‌లో చోటుచేసుకుంది.రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో సీఐగా పనిచేస్తున్న శేఖర్ పుట్టినరోజు వేడుకకు హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ సహా 30 మంది స్నేహితులు వెళ్లారు.
Telangana Runamafi: మీకు రుణమాఫీ కాలేదా, అయితే మీకోసమే బీఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్, రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు నిద్రపోనివ్వంటున్న గులాబీ నేతలు
Arun Charagondaతెలంగాణ రాష్ట్రం లో రైతులు గౌరవంగా బతకగలమని గుండె మీద చేయి వేసుకుని చెప్పేలా కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి....కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయం ఇచ్చి సంపూర్ణ రక్షణ వలయం ఏర్పాటు చేశారు...వ్యవసాయ శాస్త్రవేత్త దివంగత స్వామి నాథన్ సైతం కేసీఆర్ తీసుకున్న చర్యలను మెచ్చుకున్నారు అన్నారు.
Anand Mahindra: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, కీలక నిర్ణయం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyయంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా పేరును న్యూయార్క్‌లో ఎన్నారైల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం మాట్లాడుతూ... యువతలో నైపుణ్యతను పెంపొందించడం కోసం తమ ప్రభుత్వం కొత్త యూనివర్సిటీని తీసుకువచ్చిందన్నారు.
KTR On MLAs Disqualification: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు, త్వరలో ఉప ఎన్నిక ఖాయమన్న కేటీఆర్
Arun Charagondaపార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు అని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందంతో కలిసి రాజ్యంగ నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నట్లు తేల్చి చెప్పారు.