జాతీయం

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.

sajaya

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలలో కాలేయం ఒకటి. కాలేయం సక్రమంగా పనిచేయడం ద్వారా మన ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్, లివర్ డ్యామేజ్ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.

Dallas Accident:అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ స‌హా న‌లుగురు యువ‌కులు మృతి

VNS

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కారును ట్రక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. డల్లాస్ (Dallas Accident) నుంచి బెంటెన్‌విల్లేకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు

Telangana Rains: వీడియో ఇదిగో, శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు, తృటిలో తప్పించుకున్న కార్లు

Hazarath Reddy

శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు

Hazarath Reddy

గతరాత్రి 40 మంది ప్రయాణికులతో వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరద నీటిలో చిక్కుకుపోయింది. అలాగే నాగర్ కర్నూల్ లోని నాగనూల్ వాగులో కొట్టుకుపోయి చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు సాహసోపేతంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Advertisement

Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, నీట మునిగిన విజయవాడ, భారీ వర్షాలకు మంగళగిరిలో విరిగిపడిన చెట్లు , నేలకొరిగిన కరెంట్ స్తంభాలు

Hazarath Reddy

భారీ వర్షాలకు విజయవాడ మంగళగిరి రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి , కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేట ప్రస్తుత వరద పరిస్థితి.

Hyderabad Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, రాష్ డ్రైవింగ్ తో పాదచారుల దూసుకొచ్చిన కారు, ఒకరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం ngos కాలనీ వివేకానంద పార్క్ ముందు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ డ్రైవింగ్ తో పాదచారుల పైకి కారు ఒక్కసారిగా దూసుకు వచ్చింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కాలువలో కొట్టుకొచ్చిన రెండు కార్లు, ఓ కారులో కోదాడ వాసి మృతి

Hazarath Reddy

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక కోదాడలో భారీ వర్షానికి రెండు కార్లు కాలువలొ కొట్టుకు వచ్చాయి.. ఓ కారులో ఒకరు మృతి చెంది కనిపించారు

Kalyan Horror: ముంబైలో దారుణం, చాక్లెట్ ఆశ చూపి రెండేళ్ల పసిపాపపై కామాంధుడు అత్యాచారం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఇటీవలి కాలంలో చిన్నారులు సహా మహిళలపై అత్యాచారాలు, హత్యలతో సహా నేరాల కేసులు పెరిగిపోతున్నాయి. తాజా ఘటనలో టిట్వాలా సమీపంలో ఓ వ్యక్తి రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. 35 ఏళ్ల నిందితుడిని కళ్యాణ్ రూరల్ పోలీసులు ఆగస్టు 30, శుక్రవారం అరెస్టు చేశారు

Advertisement

CM Revanth Reddy On Rains: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని అధికారులకు సూచన

Arun Charagonda

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడిన సీఎం... ముఖ్యంగా మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాల‌ని సీఎస్‌ శాంతికుమారికి సూచించారు.

RTC Bus Stuck In Water: వాగులో చిక్కుపోయిన ఆర్టీసీ బస్సు, కాపాడండి అంటూ ప్రయాణీకుల ఆర్తనాదాలు, రాత్రి నుండి వర్షంలోనే ఉన్నామని ఆవేదన..వీడియో

Arun Charagonda

మహబూబాబాద్ - నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాగు వరదలో చిక్కుకుపోయింది ఆర్టీసీ బస్సు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను వేడుకుంటున్నారు ప్రయాణికులు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Railway Track Destroyed Due To Rains: భారీ వర్షం, కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మహబూబాబాద్‌లో ఘటన, నిలిచిపోయిన పలు రైళ్లు, తప్పిన పెను ప్రమాదం

Arun Charagonda

మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపేశారు రైల్వే అధికారులు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ కొట్టుకుపోగా తక్షణమే రైల్వే సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Andhra Pradesh: గుడ్లవల్లేరు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం, ఎస్సైను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, బాధితులతో అలాంటి ప్రవర్తన సరికాదని హెచ్చరిక

Arun Charagonda

గుడ్లవల్లేరు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల అహంకారంతో దురుసుగా మాట్లాడిన ఎస్ఐను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. విద్యార్థినుల ఆవేదనను బాధను అర్థం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించకుండా విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించడం సరికాదని ..వారి భాదను అర్దం చేసుకుని భరోసా ఇచ్చేలా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అన్నారు.

Advertisement

Viral Video: తండాను ముంచేసిన వాన.. మహబూబాబాద్ జిల్లాలో నీటమునిగిన బొడ్డి తండా ఇళ్లు (వైరల్ వీడియో)

Rudra

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజాజీవితం అస్తవ్యస్తమవుతున్నది. భా మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని బొడ్డి తండాలో భారీ వర్షానికి ఇళ్లు మొత్తం మునిగిపోయాయి.

Commercial LPG Gas: వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు షాక్.. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్‌ ధర రూ.39 మేర పెంపు.. సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి..

Rudra

ఒకటో తేదీనే వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.39 మేర పెంచాయి.

Viral Video: ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లా వ్యక్తి నిర్లక్ష్య ప్రయాణం.. తర్వాత ఏమైంది? (వీడియోతో)

Rudra

వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉప్పొంగిన వరద నీటిలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్య ప్రయాణంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Vijayawada Rains: జలదిగ్బంధంలో విజయవాడ.. గడిచిన 20 ఏండ్లలో ఎన్నడూ చూడనంత వర్షం.. ఆరుగురు మృతి.. నీటిలో తేలియాడుతున్న బస్సులు (వీడియో)

Rudra

విజయవాడలో భారీవర్షం విళయం సృష్టిస్తున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఒక పక్క కుండపోత వర్షం మరోవైపు పొంగిన రోడ్లు జలమయమైన రహదారులుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Advertisement

Railway Track Destroyed: భారీ వర్షానికి ధ్వంసమైన రైల్వే ట్రాక్.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన.. నిలిచిపోయిన పలు రైళ్లు (వీడియో)

Rudra

భారీ వర్షాలతో తెలంగాణవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

Viral Video: వాన నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు.. ఏరుకుని సంచిలో వేసుకున్న స్థానికులు.. హైదరాబాద్ వైరల్ వీడియో

Rudra

హైదరాబాద్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వానధాటికి ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఇలా నగరంలోని ఓ రైతు బజార్లో వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని కూరగాయలు, ఆకుకూరలు నీటిలో కొట్టుకుపోయాయి.

Weather Update: హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. తెలంగాణలో మరో 6 రోజులపాటు వర్షాలు.. నేడు, రేపు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటన

Rudra

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతున్నది. రానున్న మరో ఆరు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.

Traffic Diversion In Kodad: హైద‌రాబాద్- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై భారీ ట్రాఫిక్ జామ్, కోదాడ వ‌ద్ద వాహ‌నాల మ‌ళ్లింపు, నందిగామ వ‌ద్ద రోడ్డుపై ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న వాగు

VNS

సూర్యాపేట జిల్లా కోదాడలో (Suryapet -kodad Highway) భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి చేరిన వరద నీరు చేరింది. దాంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలను ఖమ్మం వైపుగా అధికారులు మళ్లించారు.

Advertisement
Advertisement