జాతీయం

New Excise Policy In AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నూత‌న మ‌ద్యం విధానం కోసం 6 రాష్ట్రాల్లో అధ్య‌య‌నం, బెస్ట్ పాల‌సీ కోసం బృందాల‌ను పంపిన ప్ర‌భుత్వం

VNS

ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు బృందాలను(Four Teams) ఏర్పాటు చేసింది. నాటి వైసీపీ ప్రభుత్వం(YCP Government) మద్యం కొనుగోలు, విక్రయాల్లో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, జే బ్రాండ్‌ (J Brand) తో నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారని కూటమి నేతలు ఆరోపించారు.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో కొన‌సాగుతున్న హాకీ జ‌ట్టు జైత్ర‌యాత్ర‌, చివ‌రి గ్రూప్ మ్యాచ్ లోనూ విజ‌యం సాధించిన టీమ్ ఇండియా

VNS

పారిస్ ఒలింపిక్స్‌ గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో భారత హాకీ (Indian Men's Hockey Team) జట్టు గెలుపొందింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 3-2 తేడాతో విజయ ఢంకా మోగించింది. 1972 నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ (India) ఓడించడం ఇదే మొదటిసారి. పూల్‌ బీ నుంచి భారత్‌తో పాటు బెల్జియం, ఆసీస్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాయి.

Devara Second Single: ప్రమోష‌న్స్ వేగం పెంచిన దేవ‌ర‌, పూర్తిగా ల‌వ‌ర్ బాయ్ లా మారిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్, దేవ‌ర నుంచి సెకండ్ సింగిల్ విడుద‌ల డేట్ ఖరారు

VNS

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఫ‌స్ట్ సింగిల్ ఫియర్‌ సాంగ్ (Fear song) విడుద‌ల చేయ‌గా.. యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను ఆగ‌ష్టు 05న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో మ‌రో ప‌త‌కం దిశ‌గా భార‌త్, ఆర్చ‌రీలో సెమీస్ కు దూసుకెళ్లిన ధీర‌జ్, అంకిత జోడీ

VNS

హోరాహోరీగా సాగిన నాలుగు సెట్ల పోరులో స్పెయిన్ జంట‌పై ధీర‌జ్, అంకిత ద్వ‌యం 37-36తో గెలుపొందింది. చివ‌రి సెట్‌లో చివ‌రి సెట్‌లో ధీర‌జ్ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తూ వ‌రుస‌గా 10, 10 పాయింట్లు సాధించాడు. అంకిత సైతం వ‌రుస‌గా 9, 8 పాయింట్లతో మెరిసింది.

Advertisement

Danam Nagender Comments Row: తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన దానం నాగేందర్, వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన, తన పనితీరు గురించి అందరికీ తెలుసని వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశమివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు

Telangana Job Calendar: తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటన, పూర్తి వివరాలివే, చివరి రోజు కీలక బిల్లులకు అమోదం,అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు పలు కీలక బిల్లులకు అమోదం తెలిపింది ప్రభుత్వం. ప్రధానంగా చివరి రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటన, ధరణి పేరు భూమాతగా మార్చడం, మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో మీమ్స్ చేసిన వారిపై చర్యలు వంటి వాటితో వాడివేడిగా సాగింది.

Telangana Politics: దానం నాగేందర్ బూతుల వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన నాగేందర్

Hazarath Reddy

అసెంబ్లీలో నీ అమ్మ అని మాట్లాడటం కరెక్ట్ కాదు, జనాలకు రాంగ్ మెసేజ్ పోతుంది.. ఎమ్మెల్యే దానం నాగేందర్ బేషరతుగా అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.

Telangana Shocker: నిర్మల్ జిల్లాలో దారుణం, మద్యం మత్తులో తండ్రిని కర్రతో కొట్టి చంపేసిన కొడుకు,తాగి వచ్చి ఇంట్లో గొడవెందుకు చేస్తున్నావని అడగటమే కారణం

Hazarath Reddy

నిర్మల్ జిల్లా : కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన కుడిమెత అనిల్ నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ పెడుతున్నాడని తండ్రి కుడిమెత మధు మందలించాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.

Advertisement

MLA Danam Nagender: అసెంబ్లీలో బూతులతో రెచ్చిపోయిన దానం నాగేందర్, తోలు తీస్తా, బయట తిరగనియ్య అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.

Road Accident Video: గుంటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై టైర్ కు పంచర్ వేయించేందుకు లారీని రోడ్డుపై ఆపారు. ఈ క్రమంలో గుంటూరు నుండి వేగంగా వస్తున్న ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు

Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై ఆరోపణలు

Hazarath Reddy

వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ( Vallabhaneni Vamsi Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

UN Praises India's Digital Revolution: భారత్‌లో డిజిటల్ విప్లవంపై ఐక్యరాజ్యసమితి ప్రశంసలు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడి

Hazarath Reddy

డిజిటల్ రివల్యూషన్ ద్వారా గత ఐదారేళ్లలో భారత ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలను కేవలం స్మార్ట్‌ఫోన్ల వాడకం ద్వారా పేదరికం నుంచి బయటపడేసిందని (80 crore out of poverty) ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ (Dennis Francis) పేర్కొన్నారు

Advertisement

Nithin Gadkari On Cashless Treatment: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స, పైలట్ ప్రాజెక్టుగా ఆ రెండు రాష్ట్రాల్లో అమలు,నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

Arun Charagonda

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మోటారు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారి కోసం నగదు రహిత చికిత్స అందించేందుకు ఈ కొత్త పథకాన్ని రూపొందించామన్నారు. ప్రయోగాత్మకంగా అస్సాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

Khammam Road Accident: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారిని ఢీకొట్టి ముగ్గురు అక్కడికక్కడే మృతి, వీడియో

Arun Charagonda

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనకనుంచి వచ్చి డీ కొట్టారు ముగ్గురు యువకులు. అక్కడికక్కడే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సత్తుపల్లి మండలం.. బి. గంగారం వద్ద జరుగగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు

Visakha Local Bodies Election: విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, అధికారికంగా ప్రకటించిన జగన్, ఆగస్టు 30న పోలింగ్, సెప్టెంబరు 3న ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎంపిక చేస్తూవైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్‌ రావు బహిరంగలేఖ, ఉపాధ్యాయ బదిలీలు - పదోన్నతులపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్

Arun Charagonda

తెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యారంగ పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూనే విద్యారంగ ప్రయోజనాల గురించి కీలక సూచనలు చేశారు.

Advertisement

Director Ajay Sastry Dies: తెలుగు సినీ పరిశ్రమలో విషాదం, నేను మీకు తెలుసా దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూత, నా బెస్ట్ ఫ్రెండ్ ఇకలేరంటూ మంచు మనోజ్ ట్వీట్

Hazarath Reddy

టాలీవుడ్ దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. అజయ్ శాస్త్రి గతంలో మంచు మనోజ్ హీరోగా 'నేను మీకు తెలుసా?' సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్ శాస్త్రి స్వస్థలం హైదరాబాద్. మొదట్లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద రాఖీ, డేంజర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు.

Air India Cancels All Flights to Israel: పశ్చిమాసియాలో తీవ్రమైన ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు బంద్‌

Hazarath Reddy

పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతుండటంతో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్ల‌డించింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి శ్రీశైలం ఆలయంలో విధులకు వచ్చిన ఉద్యోగి, పట్టుకుని చితకబాదిన భక్తులు

Hazarath Reddy

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని భక్తులు పట్టుకుని చితకబాదారు. క్యూ కంపార్టుమెంట్‌లో గురువారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

Wayanad Landslide: వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు, కేరళకు సాయం అందించేందుకు ముందుకొస్తున్న సినీ నటులు!

Arun Charagonda

కేరళను ఓ వైపు వర్షం మరోవైపు కొండ చరియలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇక మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 289 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటుండగా హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement