News

India vs New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్ కోసం భారత్ షెడ్యూల్ ఇదే, అక్టోబ‌ర్ 24న మొద‌టి వ‌న్డే ఆడనున్న టీమిండియా మహిళల జట్టు

Vikas M

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెమీస్ ముంగిట ఓడిన భార‌త జ‌ట్టు (Team India) త్వ‌ర‌లోనే సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది.UAE లో వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసిన వెంట‌నే న్యూజిలాండ్‌ (Newzealand)తో వ‌న్డే స‌మ‌రం మొద‌ల‌వ్వ‌నుంది.

New AI Scam: గూగుల్‌ యూజర్లకు అలర్ట్‌, అకౌంట్‌ రికవరీ పేరిట ఏఐ రూపంలో కొత్త స్కాములు, ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి

Vikas M

మీరు Gmail ఉపయోగిస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న Gmail వినియోగదారులు ప్రస్తుతం హ్యాకర్ల లక్ష్యంగా ఉన్నందున అలర్ట్ కావాల్సిందే. ఈసారి సైబర్ దుండగులు వారిని బాధితులుగా మార్చడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. AIని ఉపయోగిస్తున్నారు.

HC on Rape: ఇద్దరూ చాన్నాళ్ల పాటు ఏకాభిప్రాయంతో సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం కిందకు రాదు, అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇదిగో..

Hazarath Reddy

భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 375 ప్రకారం ఎటువంటి మోసపూరిత అంశాలు లేకుండా దీర్ఘకాలంగా ఏకాభిప్రాయంతో కూడిన వ్యభిచార శారీరక సంబంధం రేప్‌గా పరిగణించబడదని అలహాబాద్ హైకోర్టు ఇటీవల పేర్కొంది.

Astrology: అక్టోబర్ 26 శుక్రుడు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశులు వారికి ధనయోగం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో ప్రేమకు సంపదకు కలలకు బాధ్యత వహించే గ్రహంగా శుక్ర గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్ర గ్రహం ప్రతి 27 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది.

Advertisement

Astrology: అక్టోబర్ 15 న చంద్రుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశం..మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు 9 గ్రహాలలో తన వేగాన్ని అత్యధికంగా మార్చుకునే ఏకైక గ్రహం చంద్రుడు మాత్రమే.

Chalaki Chanti: ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో ఎవ్వరూ సాయం చేయరు, వాళ్లంతా సర్వనాశనమైపోతారు, ఇది నా శాపమంటూ చలాకి చంటి సంచలన వ్యాఖ్యలు

Vikas M

చలాకీ చంటి అనగానే 'జబర్దస్త్'లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు.

KTR Consoles Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించిన కేటీఆర్, గుండెపోటుతో ఆయన కూతురు కన్నుమూత

Vikas M

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ లోని రాజేంద్రప్రసాద్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనను ఓదార్చారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల వయసులో ఆమె హఠాన్మరణానికి గురయ్యారు

Chiranjeevi Meet CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి...వరద సాయం చెక్కు చంద్రబాబుకు అందజేత...

sajaya

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.

Advertisement

Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం, జలమయమైన రోడ్లు, పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్

Hazarath Reddy

హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, యూసఫ్ గూడ, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది

Rain In Tirumala: తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వాన, వీడియో ఇదిగో..

Hazarath Reddy

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమాడ వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి.

Health Tips: గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య ఇబ్బంది పెడుతుందా..అయితే ఈ చిట్కాలతో ఈ సమస్యకు పరిష్కారం.

sajaya

చాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. అలాగే గాల్ బ్లాడర్ లో కూడా రాళ్లు ఏర్పడడం ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్న సమస్య. అయితే కిడ్నీలో వచ్చే రాళ్లకు, గాల్ బ్లాడర్ లో వచ్చే రాళ్లకు కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి.

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీకు విటమిన్ సి లోపం ఉన్నట్లే.

sajaya

విటమిన్ సి మన శరీరానికి కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. అనేక రకాలైనటువంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Advertisement

Health Tips: ప్రతిరోజు కొత్తిమీరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.

sajaya

కొత్తిమీరను ప్రతిరోజు మనము వంటలో వాడుతూ ఉంటాము. ఇది వంటకు సువాసనను రుచిని కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

Health Tips: మైదా పిండిని అధికంగా వాడుతున్నారా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

sajaya

మనం తీసుకునే ఆహారంలో బ్రెడ్, బిస్కెట్లు, కేకుల అన్నిట్లో కూడా మైదాని అధికంగా వాడుతూ ఉంటారు. మైదాని తీసుకోవడం వల్ల ఇది మన శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్ గా మైదాని అంటారు.

Andhra Pradesh Rains: నెల్లూరు జిల్లాకు హై అలర్ట్, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ అల్పపీడనం తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

MLA Koneti Adimulam: కోనేటి ఆదిమూలం మరో వీడియో లీక్, టీడీపీ మహిళా నేతతో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియో క్లిప్ ని వైసీపీ పార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Advertisement

Woman Narrowly Escapes Video: అదృష్టం అంటే ఈమెదే, పై నుంచి ఒక్కసారిగా మీద పడిన వాటర్ ట్యాంక్, తృటిలో తప్పిన ప్రాణాపాయం

Hazarath Reddy

యాపిల్ తింటూ రోడ్డుపైకి వచ్చిన మహిళపై ఒక్కసారిగా మేడ మీద నుంచి వాటర్ ట్యాంక్ పడింది. కాగా మహిళపై పడ్డ వాటర్ ట్యాంక్ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడింది. దీనికి సంబంధించిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: వీడియో ఇదిగో, ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పైకి ఎక్కిన కొండ చిలువ, తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

నంద్యాల జిల్లా అవుకు మండలం సింగనపల్లి గ్రామంలో ఘటన. ఫుల్లుగా మద్యం సేవించి కూర్చున్న లారీ డ్రైవర్ పక్కనే పొదల్లో నుంచి వచ్చి డ్రైవర్ పైకి ఎక్కి నాట్యమాడిన కొండచిలువ. కట్టెల సహాయంతో కొండ చిలువను పక్కకు లాగేసిన గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఇదే.

Accident Caught on Camera: షాకింగ్ యాక్సిడెంట్ వీడియో ఇదిగో, బొలెరోను ఢీకొట్టి పేలిపోయిన బైక్, ముగ్గురు మృతి చెందినట్లుగా వార్తలు

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూచ్ బెహార్లో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో బైకు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్న బొలెరోను ఢీకొట్టింది.ఈ మెరుపు వేగం ధాటికి ఒక్కసారిగా బైక్ పేలిపోయి మంటలు చెలరేగాయి.

Hindupur Gang Rape Case: హిందూపురం గ్యాంగ్ రేప్ సీసీ పుటేజీ ఇదిగో, ఆరుగురు కామాంధులు అత్తా కోడళ్లను షెడ్డులోకి లాక్కెళ్లి అత్యాచారం, నిందితుల్లో ముగ్గురు మైనర్లు

Hazarath Reddy

శ్రీసత్యసాయి జిల్లాలో అర్ధరాత్రి అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగిన సంగతి విదితమే. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వాచ్‌మెన్‌, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు.

Advertisement
Advertisement