News
Lebanon Pager Blasts: లెబనాన్ పేజర్ల పేలుడు కేసులో కేరళకు లింక్, పేజర్లను సరఫరా కంపెనీ కేరళ వ్యక్తిదే...అజ్ఞాతంలోకి వెళ్లిన రిన్సన్ జోస్!
Arun Charagondaలెబనాన్ పేజర్ల పేలుడు కేసులో కేరళకు లింక్ వెలుగులోకి వచ్చింది. పేజర్లను సరఫరా చేసిన బల్గేరియా కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు కేరళలోని వాయనాడ్ కు చెందిన రిన్సన్ జోస్. కేరళ నుంచి నార్వేకు వలస వెళ్లారు 37 ఏళ్ల రిన్సన్ జోస్. తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ ట్రేడ్ మార్క్ లైసెన్స్ తో పేజర్ల తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రిన్సన్ జోస్.
India vs Bangladesh 1st Test: సెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, బంగ్లాకు 515 పరుగుల భారీ టార్గెట్...వీడియో
Arun Charagondaబంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగారు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 109 పరుగులు,గిల్ 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
Telangana: బాలికలపై హాస్టల్ వార్డెన్ వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు..వీడియో ఇదిగో
Arun Charagondaరాజేంద్రనగర్లో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన హాస్టల్లో వార్డెన్ తరచూ వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. అకారణంగా చితకబాదుతోందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వార్డెన్ పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Maharashtra: పూణేలో షాకింగ్ సంఘటన, రోడ్డుపై గుంతలో పడ్డ ట్యాంకర్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్..వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాంకర్ అకస్మాత్తుగా ఉన్నచోటే రోడ్డులోకి కూరుకుపోయింది. అనూహ్యరీతిలో పెద్ద గుంత ఏర్పడి ట్యాంకర్ అందులో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయటకు రాగలిగాడు.
Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్..జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు , జానీ మాస్టర్‌ని కస్టడీ కోరనున్న పోలీసులు!
Arun Charagondaజానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్. జానీ మాస్టర్ భార్య పై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లారు ఆయన భార్య . దీంతో జానీ మాస్టర్ భార్య తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. పదిరోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ దంచికొడుతున్న వాన.. రేపు కూడా భారీ వర్షాలు
Rudraహైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఉప్పల్ నుంచి లింగంపల్లి, అటు పాతబస్తీ నుంచి ఇటు కొంపల్లి వరకూ పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.
Road Accident At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు, ఒకరు మృతి..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్ పేట్ ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది కారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ నుంచి ఈసీఐఎల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Viral Video: ఇదేం దొంగతనం భయ్యా..! కాళ్ల మధ్యలో పెట్టుకొని రూ.10 వేల చీరలు దొంగతనం చేసిన మహిళలు.. ముస్తాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో..!
Rudraసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలోని లిప్సిక సారీ సెంటర్ లో దొంగతనం జరిగింది. చీరల కొనుగోలు పేరిట దుకాణంలోకి వచ్చిన ఐదుగురు మహిళలు చీరలు కొంటున్నట్టు నటించి రూ.10 వేల విలువైన చీరలను కాళ్ల మధ్య పెట్టుకొని దొంగతనం చేశారు.
Hydra Demolition Of Illegal Constructions: కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు..వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్దత కల్పించడంతో పాటు మరిన్ని అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడు పెంచింది. కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. సర్వే నెంబర్ 141లో కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. దీంతో భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు హైడ్రా అధికారులు.
Nalgonda: స్కూల్ ఫీజు కట్టలేదని నర్సరీ విద్యార్థులను స్కూల్లోనే బంధించిన యాజమాన్యం, దేవరకొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఘటన
Arun Charagondaనల్గొండ - దేవరకొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం దారుణానికి పాల్పడింది. ఫీజు చెల్లించలేదని నర్సరీ చదువుతున్న చైత్ర, యూకేజీ చదువుతున్న జాహ్నవిని స్కూల్లోనే నిర్భంధించారు.
Rajinikanth Dance in Vettaiyan Event: ‘వెట్టయాన్’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అదిరిపోయే డ్యాన్స్.. మీరూ చూడండి..!
Rudraఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇటీవల ఘనంగా జరిగింది.
Telangana Cabinet Decisions: హైడ్రాకు చట్టబద్దత,సన్నవడ్లకు 500 రూపాయల బోనస్,కోస్గికి ఇంజనీరింగ్ కాలేజీ..తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతా ఊహించినట్లే హైడ్రాకు విస్తృత అధికారాలు ,చట్టబద్దత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆగదని మంత్రివర్గం తేల్చిచెప్పింది.
Delhi CM Atishi: నేటి సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేయనున్న ఆతిశీ.. హస్తినకు యంగెస్ట్ సీఎంగా రికార్డు
Rudraఆప్ నేత ఆతిశీ ఢిల్లీ ఎనిమిదో సీఎంగా శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా.. ఆతిశీ చేత ప్రమాణం చేయించనున్నారు.
Satyavedu MLA Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. ఆరోపణలు చేసిన బాధితురాలు రాజీకి.. కేసును మూసేసిన న్యాయస్థానం
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నది.
Mysuru Dasara Elephants Clash: రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని ఘోరం.. మైసూర్ ప్యాలెస్ వద్ద గజరాజుల బీభత్సం.. భయంతో జనాలు ఉరుకులు, పరుగులు (వీడియో)
Rudraబెంగళూరులోని ప్రసిద్ధ మైసూర్ ప్యాలెస్ వద్ద శుక్రవారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దసరా వేడుకల కోసం తీసుకొచ్చిన రెండు ఏనుగులు కంజన్, ధనంజయ పోట్లాడుకుని.. బీభత్సం సృష్టించాయి.
Pune Shocker: ట్యాంకర్ ను అమాంతం మింగేసిన రోడ్డు.. పూణేలో షాకింగ్ ఘటన.. వీడియో మీరూ చూడండి!
Rudraమహారాష్ట్రలోని పూణేలో నమ్మశక్యంగాని ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ పెద్ద ట్యాంకర్ ను ఉన్నట్టుండి రోడ్డు అమాంతం మింగేసింది.
Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో దంచి కొట్టిన వర్షం, ఉరుములు-మెరుపులతో పలు చోట్ల భారీ వర్షం, రహదారులు జలమయం..వీడియోలు ఇదిగో
Arun Charagondaహైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, నాంపల్లి, హిమాయత్ నగర్,ఆర్టీసీ క్రాస్ రోడ్, తార్నాక, కోఠి,సరూర్‌నగర్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Rain Alert For Telangana: తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటూ వర్షాలు, పలు జిల్లాలకు ఐఎండీ అలర్ట్, ఏయే ప్రాంతాల్లో వానలు పడుతాయంటే?
VNSతెలంగాణలో రాగల మూడురోజులు (Rain Alert) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ఆజరీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Jammu and Kashmir Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి, మరో 9 మందికి గాయాలు, జమ్మూకశ్మీర్‌లో అదుపుతప్పి లోయలో పడిన బస్సు
Hazarath Reddyజమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. సుమారు మరో 9 మంది గాయపడగా.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్ బయలుదేరింది.
Fine For Defecation: షాపింగ్ మాల్ గేటు ఎదుట మలవిసర్జన, సింగపూర్ లో భారతీయుడికి భారీ జరిమానా
VNSరాత్రంతా మెరీనా బే శాండ్స్ కెసినోలో గడిపాడు. తెల్లవారుజామున 5 గంటలకు కెసినో నుంచి బయటకు వచ్చిన అతను కాలకృత్యాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మద్యం మత్తులో మరుగుదొడ్డి ఎక్కడ ఉందో గుర్తించలేకపోయాడు. చివరకు ఉదయం 7 గంటల సమయంలో అదే ఏరియాలోని ‘ది షాపీస్’ అనే స్టోర్ ఎంట్రన్స్ వద్ద మల విసర్జన చేశాడు (Fine For Defacation).