Indian Currency (Photo-ANI)

New Delhi, Dec 28: కేంద్రప్రభుత్వం ఇప్పటివరకూ రూ.147.19 లక్షల కోట్ల అప్పులు (Govt Debt Rises to Rs 147 Lakh Cr) చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా కేంద్రం అప్పులపై నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. కేంద్రం ఇప్పటివరకు రూ.147.19 లక్షల కోట్ల అప్పులు (debt increases to Rs 147 lakh crore) చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ చివరినాటికి రూ.145.72 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ మొత్తం అప్పులు సెప్టెంబర్ చివరి నాటికి రూ.147.19 లక్షల కోట్లకు పెరిగాయి. శాతం పరంగా, ఇది 2022-23 రెండవ త్రైమాసికంలో 1 శాతం త్రైమాసిక పెరుగుదలను ప్రతిబింబిస్తుంది.

ఈ ఏడాది జూన్‌ నాటికి దేశం మొత్తం అప్పు రూ. 145.72 లక్షల కోట్లు ఉండగా, గత రెండు నెలల వ్యవధిలోనే బీజేపీ ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్ల అప్పు చేసింది. దీంతో సెప్టెంబర్‌ చివరి నాటికి అది రూ.147.19 లక్షల కోట్లకు (Public Debt Rises To Rs 147 Lakh Crore) పెరిగింది. ఇందులో 29.6 శాతం దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయి.

కేంద్రం సంచలన నిర్ణయం, ఔషద తయారీ కంపెనీలపై రైడ్స్ కోసం ప్రత్యేక ఆదేశాలు, రాష్ట్రాలతో కలిసి కంపెనీల్లో తనిఖీలు చేయాలని నిర్ణయం

గత 67 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.55,87,147 కోట్లు కాగా, నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఎనిమిదన్నరేండ్లలో చేసిన అప్పు రూ.91 లక్షల కోట్లకు పైగా ఉన్నది. నాటి ప్రధాన మంత్రులు ఏడాదికి సగటున రూ.83 వేల కోట్ల అప్పులు చేస్తే, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా నెలకే దాదాపు రూ.90 వేల కోట్ల అప్పులు చేశారు. ఇక పేద, మధ్యతరగతి వర్గాలకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించి, వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న సంగతి విదితమే.

కొత్తగా ముక్కు నుంచి లోపలకి వెళ్లి మెదడును తినేసే వ్యాధి, బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో కొరియాలో వ్యక్తి మృతి, న‌గ‌లేరియా ఫ్ల‌వ‌రీ లేదా బ్రెయిన్ ఈటింగ్ అమీబా గురించి పూర్తి వివరాలు ఇవే..

ఇక 2021 సెప్టెంబర్‌ 21 నాటికి 638.64 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉన్న విదేశీమారకపు నిల్వలు, 2022, సెప్టెంబర్‌ 30 నాటికి 532.66 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయాయి. అంతేకాకుండా అమెరిన్‌ డాలరుతో రూపాయి మారకం విలువ రోజు రోజుకు పతనమవుతోంది. కేంద్రం చేసిన అప్పులు ప్రకారం చూస్తే దేశ జనాభా 140 కోట్లుగా తీసుకొంటే ప్రతి ఒక్కరి మీద సుమారుగా లక్ష రూపాయల అప్పు ఉన్నట్టు లెక్క.