Income Tax Return: ఐటీ రిటర్న్స్ లాగిన్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? అయితే ఈ తప్పులు లేకుండా చూడండి, ఐటీ ఫైల్ చేయడం చాలా ఈజీ, ఫామ్‌-16 టూ ఫామ్‌-26 ఏఎస్‌ లో ఈ జాగ్రత్తలు పాటించండి
Income Tax Filing (Photo Credits: Pixabay)

New Delhi, July 23: ప్రతి ఏడాది మాదిరే ఈఏడాది కూడా గ‌త ఆర్థిక సంవ‌త్సరం (2021-22) ఐటీ రిట‌ర్న్స్ (Income Tax Return) దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు స‌మీపిస్తున్నది. వేత‌న జీవులు, ప‌న్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ (ITR filing) చేసినా.. చివ‌రి క్షణంలో స‌బ్మిట్ చేస్తుంటారు. సరిగ్గానే ఐటీఆర్ ఫైల్ (ITR filing) చేశామ‌న్న భావ‌న‌తో ఉంటారు. కానీ ఐటీ విభాగం నుంచి నోటీసు వ‌చ్చినా.. త‌మ‌కు రావాల్సిన ఐటీ రీఫండ్ (IT refund) ఆల‌స్యమైనా పొర‌పాటు జ‌రిగింద‌ని గుర్తిస్తారు. దీనికి ఆదాయం ప‌న్ను చ‌ట్టంలోని సెక్షన్ల గురించి ఐటీఆర్ ఫైల్ చేసేవారికి అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ నెలాఖ‌రుతో గ‌త ఆర్థిక సంవ‌త్సర ఐటీ రిట‌ర్న్స్ (ITR filing) దాఖ‌లు చేయ‌డానికి గ‌డువు ముగుస్తుంది. క‌నుక ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే.. పొర‌పాట్లకు తావు ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి ట్యాక్స్ పేయ‌ర్లు ఆశించిన దానికంటే త‌క్కువ రీఫండ్ రావ‌చ్చు. ఇంకోసారి ఐటీ విభాగం నుంచి నోటీస్ వ‌స్తుంది. దీనికి ఫామ్‌-26 (form 16) ఏఎస్‌లో పేర్కొన్న టీడీఎస్ (TDS) వివ‌రాలు స‌రిగ్గా ఎంట‌ర్ చేయ‌క‌పోవ‌డ‌మే. ఇప్పటి నుంచైతే ఐటీఆర్‌లో ఈ వివ‌రాల‌న్నీ ముందే నింపి ఉంటాయి. కానీ, ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మంచిద‌ని ఆదాయం ప‌న్ను విభాగం నిపుణులు అంటున్నారు.

ITR filing deadline: ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంచే ప్రసక్తే లేదు! ఈ నెలాఖరుతో ముగుస్తున్న డెడ్ లైన్, కోటి అప్లికేషన్లు వచ్చినా తీసుకుంటామని ప్రకటన, ఎవరు ఐటీఐఆర్ దాఖలు చేయాలో, ఎలా చేయాలో తెలుసా? 

స్టాక్‌మార్కెట్‌లో (Stock) షేర్లతో బిజినెస్ చేసిన‌ప్పుడు దీర్ఘకాలికంగా, స్వల్పకాలికంగా వ‌చ్చే లాభాల్లో తేడా ఉంటుంది. స్వల్ప కాలిక లాభాల‌పై 15 శాతం ప‌న్ను, దీర్ఘ కాలిక లాభాలు ఏడాదిలో రూ.ల‌క్ష, అంత కంటే ఎక్కువ ఉంటే 10 శాతం ప‌న్ను చెల్లించాలి. ఐటీ రిట‌ర్న్స్‌లో ప‌న్ను చెల్లింపుదారులు త‌మ ఆదాయ వ‌న‌రుల వివ‌రాలు స‌రిగ్గా రికార్డు చేయ‌క‌పోతే ఇబ్బందులు త‌లెత్తుతాయి.

కొన్ని సంద‌ర్భాల్లో ఐటీ రిట‌ర్న్స్ (ITR filing) స‌రిగ్గా ఫైల్ చేయ‌కున్నా రీఫండ్ కాదు. దానికి సంబంధిత ప‌న్ను చెల్లింపుదారు స‌మ‌ర్పించిన ఐటీ రిట‌ర్న్స్ ఫైలింగ్‌లో బ్యాంక్ ఖాతా వివ‌రాలు పొర‌పాటుగా న‌మోదు కావ‌డం కార‌ణం. పాన్‌-ఆధార్ కార్డులు (PAN Card) అనుసంధానించిన‌ప్పుడే రీఫండ్ కావ‌డం తేలిక అవుతుంది. పాన్‌, ఆధార్ కార్డు వివ‌రాలు, బ్యాంకు ఖాతాలో వివ‌రాల‌తో స‌రిపోలితేనే రీఫండ్ వేగంగా జ‌రుగుతుంది.

CBSE 10th Results 2022 Declared:సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫ‌లితాలు విడుదల, ప‌రీక్ష‌ల్లో 94.40 శాతం విద్యార్థులు పాస్, అబ్బాయిల‌తో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువ పాస్  

స‌రైన ఫామ్ ఎంచుకోకుండానే దాఖ‌లు చేసిన ఐటీ రిట‌ర్న్స్‌ను (ITR filing) ఆదాయం ప‌న్ను విభాగం ఆమోదించ‌క‌పోవ‌చ్చు. కొన్నిసార్లు తిర‌స్కరించొచ్చు. రూ.50 ల‌క్షల‌కు మించి ఆదాయం ఉన్నా, ఒక‌టి కంటే ఎక్కువ ఇండ్లు ఉన్నా.. ఐటీఆర్‌-1 ఫామ్‌లో చేర్చలేం. ఇదిలా ఉంటే, ఫామ్‌-16లో అన్ని మిన‌హాయింపులు న‌మోదు కాక‌పోవ‌చ్చు. ఫామ్‌-16లో క‌నుక మీరు గ‌తేడాది పెట్టుబ‌డుల‌పై ప‌న్ను మిన‌హాయింపుల వివ‌రాలు న‌మోద‌య్యాయా లేదా చెక్ చేసుకుని.. ఆయా మిన‌హాయింపుల వివ‌రాల‌ను సంబంధిత ఫామ్‌లో స‌రైన భాగంలో ఐటీఆర్‌లో న‌మోదు చేయాలి

ఐటీఆర్‌లు దాఖ‌లు చేసేందుకు మీరు www.incometax.gov.in అనే వెబ్‌సైట్‌లోకెళ్లి.. మీ యూజ‌ర్ ఐడీతో లాగిన్ కావాలి. ఏడాది త‌ర్వాత లాగిన్ కావ‌డం వ‌ల్ల చాలా మంది త‌మ పాస్‌వ‌ర్డ్ మ‌రిచిపోయే అవ‌కాశాలే ఎక్కువ‌. అయితే, సుల‌భంగానే కొత్త పాస్‌వ‌ర్డ్ పొందొచ్చు. లాగిన్ పేజీలో తొలుత పాన్ వివ‌రాలు న‌మోదు చేశాక‌.. ఫ‌ర్గెట్ పాస్‌వ‌ర్డ్ ఎంపిక చేసుకుని.. అటుపై ఆధార్ ఓటీపీ లేదా డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ లేదా ఈ-ఫైలింగ్ ఓటీపీల్లో ఏదో ఒక‌టి ఎంచుకోవ‌చ్చు. వీటిల్లో ఆధార్ ఓటీపీ ద్వారా పాస్‌వ‌ర్డ్ మార్చుకోవ‌డం చాలా తేలిక కూడా. ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేసే స‌మ‌యంలో మీ వ్యక్తిగ‌త డిటైల్స్ ఒక‌సారి చెక్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్ నంబ‌ర్‌, ఈ-మెయిల్ త‌దిత‌ర వివ‌రాలు చెక్ చేసుకుని.. అవ‌స‌ర‌మైతే.. మార్పులు ఉంటే జాగ్రత్తగా ఆ డిటైల్స్ అప్‌డేట్ చేయాలి.