Bangalore, Jan 3: కర్ణాటకలో కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక తండ్రిని అతడి భార్య చంపేసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బావిలో పడేసింది. బెలగావి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భీమశంకర్ గులేద్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా ఉమరాణి గ్రామ నివాసి శ్రీమంత ఇట్నాళ (35), భార్య సావిత్రి ఇద్దరూ కూలి పనులు చేస్తూ జీవిస్తుంటారు. వారికి ఇద్దరు కుమార్తెలు. అయితే డబ్బుల కోసం సావిత్రిని పరాయి పురుషుల దగ్గరకు వెళ్లాలని శ్రీమంత బలవంతం చేసేవాడు. దీంతో ఆమె భర్తను దూరం పెట్టింది.
దీంతో అతడు కన్న కూతురిపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సావిత్రి బండరాయితో బాది భర్తను హత్య చేసింది. తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి చిన్న డ్రమ్ములో వేసి ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. అనంతరం ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసింది. హత్యకు ఉపయోగించిన బండరాయిని బావిలో పడేసింది.
కడిగి షెడ్‌లో దాచిపెట్టింది. కాగా గురువారం బెలగావిలోని చిక్కోడి తాలూకా ఉమారాణి గ్రామంలో 40 ఏళ్ల శ్రీమంత ఇట్నాలి మృతదేహం ముక్కలు డిసెంబర్ 10న లభ్యమయ్యాయి. శ్రీమంత మృతదేహం ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు చేయగా విషయం బయటపడింది. తానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సావిత్రి ఒప్పుకుంది.
ఆమె చెప్పిన పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. తాగుబోతు అయిన వ్యక్తి డబ్బుల కోసం తరచూ భార్యను వేధించేవాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన రోజు ఆమెకు ఉన్న భూమి విషయంలో ఆమెతో గొడవపడ్డాడు. అతను తన భార్య భూమిని అమ్మి, అతనికి కొత్త మోటారుబైక్ కొనాలని కోరుకున్నాడు." ఇక తట్టుకోలేక ఆ రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న అతడిని హత్య చేసినట్లు భార్య అంగీకరించింది.
"ఆమె మొదట అతనిని గొంతు పిసికి చంపింది, అతను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, అతని ముఖాన్ని పగులగొట్టడానికి సమీపంలో పడి ఉన్న బండరాయిని ఉపయోగించింది. ఆమె ఆ బండను బావిలో పారవేసింది" అని ఎస్పీ చెప్పారు. అనంతరం అతని శరీరాన్ని రెండు ముక్కలుగా చేసి, బారెల్‌లో తీసుకువెళ్లింది. ఆమె అనంతరం బారెల్స్‌ను బావిలో పారవేసారని గులేద్ తెలిపారు.