జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో ఒకటైన చంద్ర గ్రహం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. చంద్రుడు తన రాశిని మార్చుకున్నప్పుడు అది అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. జనవరి ఏడవ తేదీన సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యారాశి- కన్యా రాశి వారికి చంద్రగ్రహ సంచారం మంచి శుభ ఫలితాలను అందిస్తుంది. వీరి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారంలో మంచి మంచి డీల్స్ వస్తాయి. చర్మ సంబంధ సమస్యతో బాధపడే వారికి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తుంది జీతం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఆత్మీయులు కలుసుకునే అవకాశం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు ఎక్కువ అనుకూలం కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనుకునే కళ నెరవేరుతుంది.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
మిథున రాశి- మిథున రాశి వారికి చంద్రుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి వారి లాభాల్లో ఘననీయమైన పెరుగుదల ఏర్పడుతుంది. సొంత వ్యాపారం చేసే వారికి లేదా భాగస్వామ్యం వ్యాపారం చేసేవారికి ఆకస్మాత్తుగా ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్వికులు ఉండే రావాల్సిన ఆస్తులు వస్తాయి. కోట్ల సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇది మిమ్మల్ని డిప్రెషన్ నుంచి బయట పడేస్తుంది. కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
తులారాశి- తులారాశి వారికి చంద్రుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వ్యాపారం చేసే వారికి అనేక లాభాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కెరియర్ పరంగా ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇది తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగించే అంశంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారికి భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.