2025 వ సంవత్సరం శుక్రవారం జనవరి 10వ తేదీన ఎంతో శుభప్రదంగా భావించే వైకుంఠ ఏకాదశి ఏర్పడుతుంది. ఇది శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సకల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈరోజును చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ కలయిక అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం శ్రీమహావిష్ణువు అనుగ్రహం తో అన్ని రంగాలలో వీరు విజయాన్ని సాధిస్తారు. ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి- మీన రాశి వారికి శ్రీ మహా విష్ణువు అనుగ్రహం వల్ల అనేక శుభ ఫలితాలు ఈ సంవత్సరం ఏర్పడతాయి. వీరికి కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. కెరీర్ పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. ఉద్యమం వ్యాపారం చేసే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. అంతేకాకుండా కొత్త కొత్త బాధ్యతలు అందుతాయి. కొత్తగా ప్రాజెక్టు పనులు చేసే వారికి ఇది చాలా మంచి సమయం ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.
Health Tips: రక్తంలో ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా
మేష రాశి- మేష రాశి వారికి వైకుంఠ ఏకాదశి నుంచి వీరికి అన్ని శుభ ఘడియలే ఉంటాయి. ఆ శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో వీరికి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. వీరు చేసే ప్రతి పని కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఇది మిమ్మల్ని విజయానికి దగ్గరగా చేస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు మీకు మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త కొత్త ప్రణాళికలతో మీ ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా పెరుగుతుంది. భాగస్వామితో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకర క్షణాలు గడుపుతారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి 2025 వ సంవత్సరంలో జనవరి 10వ తేదీన వచ్చే వైకుంఠ ఏకాదశి నుండి వీరి అదృష్టం పూర్తిగా అనుకూలంగా మారుతుంది. వీరి తెలివితేటలు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారంలో వృత్తుల్లో విజయాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకొని ముందుకు వెళతారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శారీరత మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.