తిరుపతి(Tirupati) కూరగాయల మార్కెట్‌లో వ్యక్తి దారుణ హత్య(Murder)కు గురయిన సంఘటన చోటు చేసుకుంది. మార్కెట్‌లో పని చేసే అజంతుల్లాపై రుద్ర, అతని కుమారులు కత్తితో దాడి చేశారు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు యత్నించగా అంజతుల్లా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రుద్ర, అతని కుమారులు.. అజంతుల్లాను విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. డిసెంబర్ 31న ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్థానిక సీసీ టీవీ పుటేజుల్లో ఈ దాడి దృశ్యాలు రికార్డయ్యారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్ ఓ ప్రాణం తీసింది, బెట్టింగ్‌కు బానిసై అప్పుల పాలు కావడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. ఖమ్మంలో విషాదం

Man brutally murdered in Tirupati vegetable market

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)