మిలాప్..ఈ పేరు అందరికీ సుపరిచితమే.. సేవా కార్యక్రమాలు చేయాలనుకునే వారికి ఈ సంస్థ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సాయపడుతూ వస్తోంది. పేదవారికి, ఆపదలో ఉన్నవారి కోసం ఎవరైనా క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు (Milaap Free Crowdfunding for India) సేకరించాలనుకుంటే వారికి ఆసరాగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులను నింపుతోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఛారీటి డే సంధర్భంగా పలు విషయాలను మాతో షేర్ చేసుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9000+ ఎన్జీఓలతో కలిసి పనిచేసిన ఈ సంస్థ ఎంతోమందికి క్రౌడ్ ఫండింగ్ సాయంతో కొత్త జీవితాన్ని ప్రసాదించింది. సేవ చేయాలనుకునే వారు మిలాప్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేయవచ్చు.
రమా దేవి కోక ఎంతో గొప్ప భరతనాట్యం నర్తకి. 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచి తను శాస్త్రీయ నృత్య సాధన మొదలు పెట్టింది. 1980 లో తాను నర్తకి గా ఉన్నత స్థాయికి ఎదుగుతున్న సమయంలో తనకి మొదటి సారి మల్టిపుల్ స్క్లిరోసిస్ వచ్చి, మెడ క్రింద నించి పక్షవాతం వచ్చింది. ప్రతి రోజూ ఫిజియోథెరపీ, ధ్యానం, సానుకూల వైఖరి, నమ్మకం తనను 40 సంవత్సరాలు బ్రతికించాయి. వ్యాధి తో సుదీర్ఘ ప్రయాణం తరువాత మే 2020 లో తాను మరణించారు.
భారత దేశంలో MS రోగులకు సహాయం అందించి, వారికి మదత్తు కల్పించే ఒకే ఒక్క రెజిస్టర్డ్ సంస్థ మల్టిపుల్ స్క్లిరోసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా (MSSI). రమా దేవి ఈ సంస్థ సేవలు పొందడమే కాక, MSSI కు బోర్డు మెంబరుగా కూడా వ్యవహరించారు. ఈ సంస్థ వారు MS రోగులకు అవసరమైన మందులు, ఫిసియోథెరపీ, సహాయ పరికరాలు అందిస్తారు. మల్టిపుల్ స్క్లిరోసిస్ (MS) అనేది మెదడుకి, వెన్నుముక (నాడీ వ్యవస్థ) కి వచ్చే వైకల్య వ్యాధి. ఆ వ్యాధి తీవ్రతను తగ్గించడానికి డిసీస్ మాడిఫయింగ్ థెరపి (DMT) చేస్తారు. అయితే ఈ వ్యాధికి ఇప్పటి వరకూ పరిష్కారం లేదు.
ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందుల వల్ల వారి సంక్షేమ సేవలను అందించలేకపోతున్నారు. ప్రపంచ MS దినోత్సవం 2020 సందర్భంగా MSSI హైదరాబాదు ఛాప్టర్ వారు మిలాప్ లో రమా దేవి జ్ఞాపకార్ధం ఆన్లైన్ ఫండ్ రైసర్ మొదలు పెట్టారు. ఈ ఫండ్ రైసర్ ద్వారా MSSI వారు MS వ్యాధి గురించి అవగాహన పెంచి, మరింత మంది బాధితులకు వైద్యం అందించాలని ఆశిస్తున్నారు. మిలాప్ ఫండ్ రైసర్ ద్వారా 140 దాతలు 11 లక్షల రూపయలకు పైగా విరాళాలు అందించి ఈ కాంపైన్ ను ఘన విజయం చేసారు.
అన్నిటి కంటే గొప్ప దానం అవయవ దానం అని అంటారు. MOHAN ఫౌండేషన్ (మల్టి ఆర్గన్ హార్వెస్టింగ్ ఏఇడ్ నెట్వర్క్) అవయయ దానాలు పెంచేందుకు, దానికి అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు పనిచేస్తోంది. కేవలం 2019 లో మాత్రమే ఈ ఫౌండేషన్ 3,200 కు పైగా అవయవ మరియు టిష్యూ మార్పిడి సాధ్యం చేసింది. అవయవ దానం ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఈ సంస్థ వారు "మిషన్ టు రీచ్ మిలియన్స్" అనే కార్యక్రమాన్ని మిలాప్ ద్వారా మొదలు పెట్టారు. ఈ కాంపైన్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడనికి, ఈ లింకును నొక్కండి
మరో కథకు వస్తే.. మిలింద్ చాంద్వాని 2017 లో పేద, వెనుకబడ్డ వర్గాలకు చెందిన పిల్లలకు విద్యను సరదాగా, సులభంగా నేర్పడానికి క్యాంప్ డైరీస్ అనే సంస్థను స్థాపించారు. ఇప్పటి వరకు వారు 9 నగరాలలో 5000 విద్యార్థుల పైగా చేర్చుకోగలిగారు. వచ్చే సంవత్సరంలో వారు 3000 పిల్లలను చేర్చుకోవాలనే ధ్యేయంగా సంస్థ పనిచేస్తోంది. ఇందుకోసం వారు మిలాప్ (Milaap) ద్వారా ఫండ్ రైజింగ్ చేపట్టారు. చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్ తో కీర్తి పొందిన నటి అవిక గోర్ క్యాంప్ డైరీస్ సంస్థ కు నిత్యం తన మద్ధతు అందిస్తూ వస్తోంది.
2006 లో 20 సంవత్సరాల కాలేజి అబ్బాయి చిగురపతి సుధీక్షణ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. స్కూల్ టీచర్ అయిన సుధీక్షణ్ తల్లి విమల కొడుకు మరణంతో కుంగిపోయింది. తన కొడుకు లాగా ఎవరికీ జరగకూడదని.. రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన పెంచి, రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి సహాయం అందించడానికి సుధీక్షణ్ ఫౌండేషన్ అనే ట్రస్టు ను విమల మొదలుపెట్టారు. ఈ ట్రస్టు ద్వారా పిల్లలు మరియు యువకులకి ప్రొస్తెటిక్ అవయవాలను అందిస్తున్నారు. వీరు మిలాప్ ద్వారా ఫండ్ రైజింగ్ చేపట్టి పలువురి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
ఇదిలా ఉంటే 2018 లో ప్రచురించబడిన WHO రిపోర్టు ప్రకారంగా 5-29 వయస్సు గల పిల్లలు, యువకుల మరణాలు అత్యధికంగా ప్రమాదాల వల్లనే జరుగుతున్నాయని తెలిపింది. అంచనాల ప్రకారంగా 1000 మంది మనుషులలో 0.62 మందికి అంగవైకల్యానికి గురవుతున్నారు.