5 Money Changes From October: డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డీ మ్యాట్ అకౌంట్ ఉందా? అయితే అక్టోబర్ 1 లోగా ఈ పనులు చేయకపోతే నష్టపోతారు, అక్టోబర్ నెల నుంచి జరుగనున్న ఐదు మార్పులు ఇవే!

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుతో చేసే చెల్లింపుల కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఈ రూల్స్‌ అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌, యాప్‌ లావాదేవీల్లో టోకనైజేషన్‌ (Tokenization) విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.

5 Money Changes From October: డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డీ మ్యాట్ అకౌంట్ ఉందా? అయితే అక్టోబర్ 1 లోగా ఈ పనులు చేయకపోతే నష్టపోతారు, అక్టోబర్ నెల నుంచి జరుగనున్న ఐదు మార్పులు ఇవే!
RBI

New Delhi, SEP 29: ప్రస్తుత పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు (credit card,), డెబిట్ కార్టు (debit card), స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కదానికి బ్యాంకుపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి చెందిన పలు కీలక పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం తప్పనిసరి. సెప్టెంబర్ 30తో బ్యాంకింగ్ రంగాలు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పలు కీలక మార్పులు జరుగబోతున్నాయి. అవేంటో తెలుసుకోకపోతే నష్టం తప్పదు. పైగా ఆన్ లైన్ షాపింగ్, పెన్షన్లకు సంబంధించి కూడా మార్పులను చేయబోతున్నారు. టోకనైజేషన్ విధానం ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారం గోప్యంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఐదు విషయాల్లో మార్పులు జరుగుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం!

డీమ్యాట్‌ ఖాతా ఉందా?

డీమ్యాట్‌ (Demat Account) ఖాతాదారులు సెప్టెంబర్‌ 30లోపు తమ ఖాతాకు టు ఫ్యాక్టర్‌ అథెంటికేన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్‌లో NSE ఓ సర్క్యులర్‌ విడుదల చేసింది. డీమ్యాట్‌ ఖాతా వినియోగదారులు యూజర్‌ ఐడీతో పాటు పిన్‌ లేదా పాస్‌వర్డ్‌ ఉపయోగిస్తుంటారు. వీటికి అదనంగా బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ కూడా ఏర్పాటు చేసుకోవాలని ఎన్‌ఎస్‌ఈ సూచించింది.

క్రెడిట్‌కార్డు యాక్టివేషన్‌కు ఓటీపీ

క్రెడిట్‌కార్డు, డెబిట్‌ కార్డులకు సంబంధించిన జులై 1 నుంచి ఆర్‌బీఐ (RBI) కొన్ని కొత్త నియమాలు అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో కొన్నింటి గడువును అక్టోబర్‌ 1 వరకు పొడిగించింది. ఇందులో ఒకటి క్రెడిట్‌ కార్డు యాక్టివేషన్‌కు (Credit Card Activation) సంబంధించింది. ఒకటో తేదీ నుంచి క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు.. కార్డు జారీ చేసేముందు కార్డుదారుడి నుంచి ఓటీపీ రూపంలో అనుమతి పొందాల్సి ఉంటుంది. కార్డు జారీ చేసిన 30 రోజుల్లోగా అనుమతి పొందకుంటే అక్కడికి వారం రోజుల్లో కార్డును బ్లాక్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే వినియోగదారుల అంగీకారం లేకుండా కార్డు లిమిట్‌ను కూడా పెంచొద్దని ఆర్‌బీఐ సూచించింది.

Bank Complaints: ఏదైనా బ్యాంకుపై లేదా ఫైనాన్స్ సంస్థపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? సింపుల్ గా ఇలా చేయండి ! 

ఏపీవైలోకి వారికి నో ఛాన్స్‌

కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రత పథకమైన అటల్ పెన్షన్‌ యోజన (ఏపీవై)లో చేరేందుకు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కేంద్రం అనర్హులుగా ప్రకటించింది. అక్టోబర్‌ 1వ తేదీ కంటే ముందే ఈ పథకంలో చేరిన ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మాత్రం స్కీమ్‌లో కొనసాగుతారు. ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపుదారులెవరైనా అక్టోబరు 1 తర్వాత ఏపీవైలో చేరినట్లు గుర్తిస్తే వెంటనే వారి ఖాతాను మూసివేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

టోకనైజేషన్ షురూ

డెబిట్‌/క్రెడిట్‌ కార్డుతో చేసే చెల్లింపుల కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఈ రూల్స్‌ అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌, యాప్‌ లావాదేవీల్లో టోకనైజేషన్‌ (Tokenization) విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది. తొలుత 2021 జూన్‌ 30వ తేదీ వరకు గడువు నిర్దేశించగా.. పేమెంట్‌ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత తెలుపకపోవడంతో పలుమార్లు గడువు పొడిగించారు. ఈ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. అక్టోబరు 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. టోకనైజ్‌ చేయడం ద్వారా కార్డు వివరాలు వ్యాపార సంస్థల వద్ద స్టోర్‌ అవ్వవు. దీనివల్ల సున్నిత సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది.

Aadhaar-UAN Linking: సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్ రూల్స్ మారుతున్నాయి, వెంటనే PF అకౌంట్‌కి ఆధార్ లింక్ చేయండి, ఒకవేళ చేయకుంటే మీ EPFO సేవలన్నీ ఆగిపోతాయి, PF ఖాతాకు ఆధార్‌ని లింక్ ఎలా చేయాలో తెలుసుకోండి 

ఎన్‌పీఎస్‌లో కొత్త మార్పు

జాతీయ పింఛన్‌ పథకం (NPS) ఈ-నామినేషన్‌కు సంబంధించి అక్టోబర్‌ 1 నుంచి కొత్త మార్పు రాబోతోంది. సబ్‌స్క్రైబర్లు ఇ-నామినేషన్‌ చేపట్టినప్పుడు నోడల్‌ ఆఫీసర్‌ దాన్ని ఆమోదించొచ్చు లేదంటే తిరస్కరించొచ్చు. అయితే, ఒకవేళ 30 రోజుల్లోగా సంబంధిత నోడల్‌ ఆఫీసర్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోతే సీఆర్‌ఏ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా ఇ-నామినేషన్‌ ఆమోదం పొందుతుంది.

(The above story first appeared on LatestLY on Sep 29, 2022 07:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).