Chennai Rains: ఇంకా వదలని వరద ముప్పు, మళ్లీ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ, రాబోయే 5 రోజుల పాటు చెన్నై, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
Chennai Rains (photo-Video Grab)

Chennai, Dec 8: మిచౌంగ్‌ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోని చెన్నై నగరానికి వాతావరణ శాఖ మరో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. రానున్నఐదు రోజుల్లో చెన్నై, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Tamil Nadu Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌, లక్షద్వీప్‌లో వచ్చే మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో స్కూళ్లు,కాలేజీలు శుక్రవారం కూడా మూసివేయనున్నారు. మిచౌంగ్‌ తుపాను కారణంగా చెన్నైలో 20 మంది మృత్యువాత పడ్డారు.

చెన్నైలో కొనసాగుతున్న భారీ వర్షాలు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

మిచౌంగ్‌ తుపాను ఏపీలో తీరం దాటినప్పటికీ చెన్నైలోనూ తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికీ కురుస్తున్న వర్షాల వల్ల చెన్నైలో తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇతర జిల్లాల నుంచి 9 వేల మంది అధికారులను చెన్నైలో సహాయక చర్యలకుగాను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. చెన్నైతో పాటు నీలగిరి,కోయంబత్తూరు, తిరుప్పూర్‌, దిండిగల్‌, థేనీ,పుదుక్కొట్టై, తంజావూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Here's Videos

మిగ్‌జాం తుఫాన్‌ (Cyclone Michaung) తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాన్‌ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలు బుధవారానికి తగ్గాయి. వర్షాలు తగ్గి రెండు రోజులు అయినప్పటికీ నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు.

ఈశాన్య తెలంగాణ‌వైపు ప‌య‌నిస్తున్న వాయుగుండం, రాబోయే 24 గంట‌ల పాటూ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఏపీ, త‌మిళ‌నాడుల్లో కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం.. కోయంబత్తూర్ జిల్లాల్లోని నీలగిరి, ఘాట్ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, దిండిగల్, తేని, చెన్నై, విరుదునగర్, శివగంగ, పుదుక్కోట్టై, తంజావూరు జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Here's Rain Videos

మరోవైపు చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవు ప్రకటించింది. ఇక నగరంలో వర్షాల కారణంగా 20 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం చెన్నైలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.