Politics
Telangana HC on Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు,రూ. 3 లక్షల జరిమానా
Hazarath Reddyగద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ షాక్‌ తలిగింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారంటూ గురువారం ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను(ప్రస్తుతం బీజేపీ) ఎమ్మెల్యేగా ప్రకటించింది.
Nara Lokesh on Kodali Nani: వీడియో ఇదిగో, కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తా, గన్నవరంలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyసీఎం జగన్‌ ఓ పిరికి వ్యక్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. యువగళం సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు. గన్నవరంలో జరిగిన టీడీపీ గర్జన సభలో సీఎం జగన్‌పై లోకేష్ విమర్శల వర్షం గుప్పించారు.భయం అనేది తమ బ్లడ్‌లోనే లేదని నారా లోకేశ్ చెప్పారు.కొడాలి నానిని గుడివాడ సెంటర్లో కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తానని నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Jupally Krishna Rao: కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరుల రక్తపు కూడు తింటోంది: జూపల్లి
Rudraరానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా పోటీకి దిగడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని ముందే అంగీకరించారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
Telangana Assembly Elections 2023: మళ్లీ బాంబు పేల్చిన మైనంపల్లి హనుమంతరావు, మెదక్‌లో తన కుమారుడు పోటీ చేయడం ఖాయమని వెల్లడి, ప్రజలతో మాట్లాడాకే భవిష్యత్ కార్యాచరణ అంటూ ప్రకటన
Hazarath Reddyతన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంగళవారం మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ లో మైనంపల్లి రోహిత్ పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
Telangana Assembly Elections 2023: పనిచేయని రాసలీలల వైరల్ ఫోటో వ్యవహారం, బానోత్ మదన్ లాల్‌కే వైరా సీటు అప్పగించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బానోత్ మదర్ లాల్ (Banoth Madanlal) అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మధ్య బానోత్ మదన్ లాల్ ఓ మహిళతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి
TDP in Telangana Fray: తెలంగాణలో ఒంటరిగా బరిలోకి టీడీపీ.. త్వరలోనే అభ్యర్థుల పేర్ల ప్రకటన.. తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని, పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావులతో చంద్రబాబు భేటీ
Rudraతెలంగాణలో శాసనసభ ఎన్నికల వేడి రాజుకున్నది. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల కూర్పులో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు.
Telangana Voters: తెలంగాణలో 3,06,42,333 మంది ఓటర్లు.. ఎన్నికల సంఘం వెల్లడి
Rudraతెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.06 కోట్లకు చేరుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండో ప్రత్యేక సవరణకు సంబంధించి ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను సోమవారం ప్రకటించింది.
Telangana Assembly Elections 2023: మేమంతా హ‌రీశ్‌రావు వెంటే, మైనంప‌ల్లి వ్యాఖ్య‌ల‌ను ఖండించిన మంత్రి కేటీఆర్
Hazarath ReddyTelangana Assembly Elections 2023, Telangana Assembly Elections, Telangana, Assembly Elections 2023, BRS, BRS Candidates, MLAs,తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీష్‌రావు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి, హ‌రీష్‌రావు, ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Telangana Assembly Elections 2023: సీఎం కేసీఆర్‌ షాకిచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్లే, రాజయ్యకు మొండి చేయి చూపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ షాకిచ్చారు. మొత్తం తొమ్మిది చోట్ల సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు.
Gannavaram Politics: టీడీపీ తీర్థం పుచ్చుకున్న యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరంలో ఒక్కసారిగా మారిపోయిన రాజకీయాలు
Hazarath Reddyఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ పసుపు కండువా కప్పి యార్లగడ్డను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Telangana Polls: గజ్వేల్‌, కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్, 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత
Hazarath Reddyబీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్‌ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు.
BRS First List: మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా?105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం.. ఓ 10 మంది దాకా సిట్టింగ్‌లకు సీట్లు దక్కలేదని పార్టీలో చర్చ
Rudraతెలంగాణలో అప్పుడే పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. వచ్చే డిసెంబర్‌‌ లోపు ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు తలమునకలయ్యాయి.
Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రాంగణంలో ఆలయం, చర్చి, మసీదు... ఈ నెల 25న ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
Rudraతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయంలో మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఆగస్టు 25న ప్రారంభించనున్నారు.
BJP List: ఛత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్టులో నేరచరితులు, వారసులు, ఓటమిపాలైన వాళ్లు కూడా..
Rudraత్వరలో ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే సిద్ధమైంది. ఛత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో దిగనున్న తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను ప్రకటించింది.
YS Sharmila: గజ్వేల్ పర్యటనకు వెళ్తున్న షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. హౌస్ అరెస్ట్.. పర్యటనకు అనుమతి లేదని వెల్లడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
Rudraసిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో పర్యటించేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సిధ్ధమయ్యారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
TDP MLA Jaleel Khan: తెలుగు ప్రజల కోసం ప్రధాని పదవిని వదిలేసుకున్న త్యాగమూర్తి చంద్రబాబు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్
Hazarath Reddyవిజయవాడ పశ్చిమ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చంద్రబాబు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ఇస్తానంటే నాకు నా తెలుగు రాష్ట్ర ప్రజలే కావాలని ప్రధాని పదవి వదులుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు.
Manda Krishna Madiga on Revanth Reddy: రేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి బాగా ఉంది, ఆయన కంటే మిగతా రెడ్లే నయం, మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyరేవంత్‌కు రెడ్డి కుల పిచ్చి ఉంది. ఆయన కంటే మిగతా రెడ్లే నయం. అన్ని పార్టీలకు రెడ్డిలను అధ్యక్షులు చేయాలని రేవంత్ కొరుకున్నట్లుగానే బీసీని తీసేసి కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిని చేసిందని మంద కృష్ణ మాదిగ అన్నారు. రేవంత్ రెడ్డి కంటే పిట్టల దొర నయం అని విమర్శించారు.
Times Now ETG Survey: ఎవరికెన్ని సీట్లు, టైమ్స్‌ నౌ సర్వే పూర్తి వివరాలు ఇవిగో, మళ్లీ అధికారం మోదీ సర్కారుదే, ఏపీలో జగన్ సర్కారుకు, తెలంగాణలో కేసీఆర్‌కే మళ్లీ పట్టం
Hazarath Reddyదేశంలో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మోదీ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రఖ్యాత ‘టైమ్స్‌ నౌ’సర్వే (Times Now ETG Survey) తేల్చి చెప్పింది.
Times Now ETG Survey: సర్వే మళ్లీ జగన్ వైపే, 2024లో టీడీపీ, జనసేన గల్లంతేనంటున్న టైమ్స్ నౌ సర్వే, 23 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో జగన్ సర్కారు గెలుస్తుందని సర్వేలో వెల్లడి
Hazarath Reddyఎన్నికలు సమీపిస్తున్న వేళ టైమ్స్‌ నౌ సర్వే బయటకు వచ్చింది. తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగిస్తుందని తెలిపింది.
Tellam Venkatarao: పొంగులేటికి ఝలక్‌ ఇచ్చి బీఆర్ఎస్‌లోకి జంప్ అవుతున్న తెల్లం వెంకట్రావ్, భద్రాచలం టికెట్ ఒకే అయినట్లుగా వార్తలు
Hazarath Reddyఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించాడు.భద్రాచలం టికెట్ తెల్లం వెంకట్రావుకు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.