రాజకీయాలు
West Bengal Assembly Polls 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఒకేసారి 291 అభ్యర్థుల జాబితా విడుదల, ఈసారి తాను నందిగ్రామ్ నియోజకర్గం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన బెంగాల్ సీఎం
Vikas Mandaఇదిలా ఉంటే, మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీకి దిగటం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థానంలో మమత బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి గత డిసెంబర్ నెలలో బీజేపీలో చేరారు.....
Andhra Pradesh Bandh: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపిలో కొనసాగుతున్న బంద్, బీజేపీ మినహా అన్ని పక్షాలు బంద్‌కు సంపూర్ణ మద్ధతు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల మోహరింపు
Team Latestlyవిశాఖపట్నం ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ శుక్రవారం పాటిస్తున్నారు. బిజెపి మినహా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు పూర్తిగా తమ మద్ధతు ప్రకటించాయి....
Kerala Assembly Elections 2021: గెలిపించండి, రూ.60కే పెట్రోల్ అందిస్తాం, కేరళలో బీజేపీ సంచలన ప్రకటన, కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్, శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ పైనే బీజేపీ ఆశలు
Hazarath Reddyకేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని గురువారం ప్రకటించింది. మెట్రో శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ అధికారికంగా ప్రకటించారు. టెక్నోక్రాట్, మెట్రో‌మ్యాన్ శ్రీధరన్ ఇటీవలే బీజేపీలో అధికారికంగా చేరారు. బీజేపీలో చేరక మునుపే తనకు సీఎం అభ్యర్థిగా (E Sreedharan Announced BJP CM Candidate) బరిలోకి దిగడం సమ్మతమేనని ప్రకటించారు.
Delhi MCD Bypolls: ఢిల్లీలో బీజేపీకి ఘోర పరాభవం, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ వార్డుల్లో నాలుగు ఆప్ కైవసం, ఒకటి కాంగ్రెస్ ఖాతాలోకి, 15 ఏళ్లుగా ఎంసీడీని పాలించిన బీజేపీకి ఒక్క సీటు కూడా రాని వైనం
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లోని 5 వార్డులకు గత నెల 28న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు (Delhi MCD Bypolls Results) నేడు విడుదలయ్యాయి. ఐదు వార్డుల్లో నాలుగింటిని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గెలుచుకోగా, ఓ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 15 ఏళ్లపాటు ఎంసీడీని పాలించిన బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు.
AP Municipal Polls: ఎస్ఈసీకి మళ్లీ ఎదురుదెబ్బ, అన్ని ఉత్తర్వులను నిలుపుదల చేసిన ఏపీ హైకోర్టు, నిర్దిష్ట ఆధారాలు లేకుండా ఎన్నికల్లో మోసం జరిగిందని ఎలా చెబుతారంటూ ప్రశ్నలు
Hazarath Reddyఎన్నికల కమిషన్ కు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసిన తరువాత కూడా పలుచోట్ల పలువురు అభ్యర్థులను నామినేషన్ల దాఖలుకు అనుమతినిస్తూ ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు (AP High Court) నిలిపివేసింది.
Prashant Kishor: దీదీ ఇలాకాలో బీజేపీ అధికారంలోకి వస్తే నేను నా వృత్తి నుంచి వైదొలుగుతా, సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్, తృణమూల్ నేతలను బెదిరించి లొంగదీసుకుంటున్నారని బీజేపీపై ఆరోపణలు
Hazarath Reddyపశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్సే తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, ఒకవేళ రానున్న ఎన్నికల్లో (West Bengal Assembly Elections 2021) బీజేపీ కనుక బెంగాల్‌లో అధికారంలోకి వస్తే నేను నా వృత్తి నుంచి పూర్తిగా వైదొలుగుతానని తెలిపారు. బీజేపీ 100 సీట్లను క్రాస్ చేస్తే ఈ వృత్తి వదిలి వేరే వృత్తిలోకి వెళ్లిపోతానని ఆయన (Prashant Kishor) సంచలన వ్యాఖ్యలు చేశారు
Ramesh Jarkiholi's Resignation: బీజేపీ మంత్రి రాసలీలల వీడియో వైరల్, జలవనరుల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన కర్ణాటక బీజేపీ నేత రమేశ్‌ జార్కిహొళి, నిర్దోషిగా బయటకు వస్తాను, అది ఫేక్ వీడియో అని తెలిపిన రమేశ్‌
Hazarath Reddyయువతితో రాసలీలలు జరుపుతూ వీడియోకు చిక్కిన కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత రమేశ్‌ జార్కిహొళి తన మంత్రి పదవికి బుధవారం రాజీనామా (MP Ramesh Jarkiholi's Resignation) చేశారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మంగళవారం సాయంత్రం వీడియో సందేశం ద్వారా రమేష్ చెప్పినప్పటికీ.. పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడిల కారణంగా బుధవారం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
AP Municipal Elections 2021: మళ్లీ వైసీపీదే హవా..మునిసిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు, మొత్తం 245 డివిజన్, వార్డు స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించే అవకాశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు (AP Municipal Elections 2021) జరగనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల తొలి రోజు అయిన నిన్న కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకున్నారనే వార్తలు వస్తున్నాయి.
Chandrababu Protest Row: చంద్రబాబు నిరసనకు అనుమతి లేదు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పర్మిషన్ ఇవ్వడం కుదరదు, నోటీసులు జారీ చేశామని తెలిపిన తిరుపతి అర్భన్‌ ఎస్పీ అప్పలనాయుడు
Hazarath Reddyవైసీపీ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ తిరుపతిలోని గాంధీ విగ్రహ కూడలిలో నిర‌స‌నకు టీడీపీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన‌డానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి (Tirupati airport) చేరుకోగా అక్క‌డ ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు.ఈ ఘటనపై తిరుపతి అర్భన్‌ ఎస్పీ అప్పలనాయుడు స్పందించారు.
Amit Shah Tirupathi Tour Cancelled: అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు, మార్చి 4న జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం వాయిదా, ముఖ్యమంత్రులతో మీటింగ్ ఎప్పుడు జరిగేదీ తర్వాత ప్రకటిస్తామని తెలిపిన అధికార వర్గాలు
Hazarath Reddyమార్చి 4, 5 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం తిరుపతిలో జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో పాల్గొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావించినా, తాజాగా ఆయన పర్యటన (Amit Shah Tirupathi Tour Cancelled) రద్దయింది.
AP Municipal Polls 2021: సమావేశం నుంచి టీడీపీ నేత వర్ల రామయ్యని బయటకు పంపించిన ఎస్ఈసీ, అఖిలపక్ష నేతలతో ముగిసిన నిమ్మగడ్డ భేటీ, మునిసిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని పిలుపు
Hazarath Reddyత్వరలో జరగనున్న ఏపీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అఖిలపక్ష నేతలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై (AP Municipal Polls 2021) అఖిలపక్ష నేతలతో ఎస్‌ఈసీ చర్చించారు.
Puducherry Assembly Elections 2021: త్వరలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది, పుదుచ్చేరిలో సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా, తమిళంలో మాట్లాడలేనందుకు క్షమించమంటూ తమిళ రాగం
Hazarath Reddyభారత దేశం నుంచి త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ మాయమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరి రాష్ట్రంలోని కారైక్కాల్‌లో ఆదివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో (Puducherry Assembly Elections 2021) ఆయన మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని (Puducherry Political Crisis) ఎవరూ కూల్చలేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం నారాయణస్వామి తీరు నచ్చక తమ పదవులకు రాజీనామా చేయడంతోనే మెజారిటీ లేక పతనమైందని చెప్పారు.
Rahul Gandhi Dance: డ్యాన్సుతో దుమ్మురేపిన రాహుల్ గాంధీ, Push-Up Challenge స్వీకరించిన కాంగ్రెస్ యువనేత, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ
Hazarath Reddyరాహుల్ గాంధీ విద్యార్థులతో ఆడిపాడారు. తమిళనాడులోని ములగుమూదుబ్న్ సెయింట్ జోసెఫ్స్ మెట్రిక్యులేషన్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ (Rahul Gandhi Dance) చేసారు. పుష్-అప్స్, 'ఐకిడో' తో అక్కడి విద్యార్థులతో హుషారుగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో కాంగ్రెస్‌ శ్రేణుల్లో, అభిమానుల్లో వైరల్‌గా మారింది.
Pooja Chavan Suicide Case: యువతిపై వేధింపుల ఆరోపణలు, మహారాష్ట్ర మంత్రి రాజీనామా, నా రాజకీయ జీవితం నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపిన శివసేన నేత సంజయ్ రాథోడ్
Hazarath Reddyబీజేపీ తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిందని సంజయ్ ఆరోపించారు. గత 30 ఏళ్లలో తాను సంపాదించుకున్న మంచి పేరును బీజేపీ నాశం చేసిందన్నారు.
Tamil Nadu: మహిళా ఐపీఎస్ అధికారిపై ప్రత్యేక డీజీపీ లైంగిక వేధింపుల కేసు, సీబీసీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ త్రిపాఠి, తమిళనాడు ప్రభుత్వం నిందితుడికి సహకరిస్తుందని ప్రతిపక్షాలు మండిపాటు
Hazarath Reddyప్రత్యేక డీజీపీ రాజేశ్‌దాస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు సీబీసీఐడీకి చేరింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులను డీజీపీ త్రిపాఠి ఆదివారం జారీ చేశారు. కాగా ఉన్నతాధికారులకు ఆ మహిళా ఐపీఎస్‌ ఫిర్యాదు చేయకుండా అనేక మంది అధికారులు అడ్డుకున్నట్టుగా సమాచారం
Southern Zonal Council Meeting: మార్చి 4న తిరుపతికి అమిత్ షా, హోంమంత్రి ఆధ్వరంలో దక్షిణాది రాష్ట్రాల‌ ముఖ్యమంత్రుల సమావేశం, వంద మంది వరకు భేటీలో పాల్గొనే అవకాశం
Hazarath Reddyదక్షిణాది రాష్ట్రాల‌ ముఖ్యమంత్రుల సమావేశం మార్చి 4వ తేదీన తిరుపతిలో జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో (Southern Zonal Council meeting) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాల సీఎంలు అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాల్గొననున్నారు.
West Bengal Assembly Elections 2021: టీఎంసీ- బీజేపీల మధ్య పోరు, బెంగాల్ ప్రజలు తమ పుత్రికను గెలిపించుకుంటారు, ప్రజాస్వామ్యం నిలబడుతుంది, బెంగాల్ ఎన్నికలపై ఆసక్తికర ట్వీట్ చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరానికి నగారా మోగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ పరస్పర విమర్శలతో అధికార తృణమూల్‌- బీజేపీ దూకుడు పెంచాయి. ప్రచారాన్ని మరింతగా రక్తి కట్టిస్తున్నాయి. ఈ ప్రచార పర్వం ఇలా ఉంటే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బెంగాల్ ఎన్నికలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా పరోక్షంగా బీజేపీకి చురకలు అంటించారు.
Case Files against JC Prabhakar Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, క్రికెట్‌ కిట్లను పంపిణీ చేస్తూ పట్టుబడిన వైనం
Hazarath Reddyమున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో యువతను ప్రలోభాలకు గురి చేసేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం పట్ల 188, 171–ఇ–హెచ్, సెక్షన్ల కింద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు (Case Files against JC Prabhakar Reddy) నమోదైంది.
Assembly Elections Schedule 2021: పుదుచ్చేరి సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, మే 2న కౌంటింగ్ మరియు ఫలితాల వెల్లడి
Vikas Mandaఅస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. మార్చి 27 నుంచి ఎన్నికలు జరగనున్నాయి, ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎలక్షన్ కమీషన్ స్పష్టం చేసింది....
Motera Political Innings: మోతేరా స్టేడియానికి 'నరేంద్ర మోదీ' స్టేడియంగా పేరు మార్పుపై దుమారం, సర్దార్ పటేల్‌కు జరిగిన అవమానంగా అభివర్ణించిన కాంగ్రెస్ పార్టీ, పేరు మార్పును సమర్థించుకున్న బీజేపీ
Team Latestlyప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌లో గల మోమొతేరా స్టేడియం పేరుపై ఇప్పుడు రాజకీయంగా మరియు సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది. ఈ స్టేడియానికి సర్ధార్ పటేల్ స్టేడియం అని కాకుండా నరేంద్ర మోదీ స్టేడియం అని నామకరణం చేయడమే ఇందుకు కారణం....